Tuesday, November 5, 2019

కాసేపు నాతో గడిపితే

ఆలోచనల చప్పుడు లేదు
మనసు నస లేదు

ఒక స్థిమితమైన స్థితి
ఏదో స్పష్టత

ఏదో తెచ్చుకుని నన్ను నింపుకుందామన్న ఆత్రం లేదు
ఏదో తెరల గజిబిజి అలజడి లేదు

ఒక స్థిమితమైన స్థితి
ఏదో స్పష్టత

కాస్తంత క్షమాపణ
కాస్తంత ప్రేమ
కాస్తంత బాధ్యత
కలిపి కాసేపు నాతో గడిపితే

ఒక స్థిమితమైన స్థితి
ఏదో స్పష్టత

No comments:

Post a Comment