Wednesday, April 17, 2019

ఎప్పటి పని అప్పుడే చేసుకుందాంవద్దు వాయిదా
వద్దు వాయిదా

వేళాయెనా దేనికో?
అప్పటి పని అప్పుడే చేసుకుందాం

మనం చూడని "రేపు" చూసేది,
ఈరోజు మనం ఏం చేశామనే ..
ఎప్పటి పని అప్పుడే చేసుకుందాం
అప్పుడు ఇప్పుడంటూ తప్పుడు మాటలు ఆపుదాం

కారణమేదైనా?
సూర్యుడాగి పోతాడా
చంద్రుడాగి పోతాడా
తిరిగే భూమి ఆగిపోతుందా..
కదిలే కాలమాగి పోతుందా ..

ఏది ఆగదు. మరి మనమెందుకాగాలి ?

వద్దు వాయిదా
వద్దు వాయిదా

గమ్యానికి పోవాలనుకున్నాం
దారి మరిచిపోతామా?
అలసి ఆగిపోతామా?
ఆకర్షణల మధ్య నలిగిపోతామా..

వద్దు, వద్దు
వద్దు వాయిదా


పద ముందుకు
పద ముందుకు 

Tuesday, April 2, 2019

వాకిలి తెరిచి ఉంది..

వాకిలి తెరిచి ఉంది..
ఎవరెవరో వస్తున్నారు..

అందమైన అమ్మాయిలూ
కోరలు తిరిగిన రాక్షసులూ..
గొప్ప చేతిరిగిన వంటగాళ్లూ
వచ్చి పోరా అనే ఆటగాళ్లూ
ఎవరెవరో వస్తున్నారు..
వాకిలి తెరిచి ఉంది..


కొంత మంది వచ్చి ఆలోచింప చేస్తారు
కొంతమంది ఆలోచన తప్పంటారు
కొంతమంది తప్పదంటారు
కొంతమంది తప్పుకోమంటారు
ఎవరెవరో వస్తున్నారు..
వాకిలి తెరిచి ఉంది..

తలుపు కొట్టే పని లేదు
పిలుపుల అవసరమే లేదు
వద్దకు రమ్మని ఆహ్వానించకుండానే
ఎవరెవరో వస్తున్నారు..
వాకిలి తెరిచి ఉంది..

వచ్చారు కదా అని ఆతిధ్యం ఇయ్యనా..?
వచ్చిన వాళ్లలో, రావలసిన వాళ్లెవరో బేరీజు వెయ్యనా?
ఒకరికి వెళ్లోద్దని
ఒకరికి రావొద్దని
ఎలా చెప్పను?

అసలు వాకిలి దాటి నేను..
ఏ రోజు ?
బయటకు అడుగు పెడతాను?

Tuesday, March 19, 2019

కాలము - నేను

కాలము జ్ఞాపకము
కాలము వాస్తవము
కాలము అనాది సత్యము

కాలము నాకన్నా ఎక్కువ
నేను లేకున్నా అది ఉంది

కాలము స్పృశించనిది
కాలము కననిది
కాలము కాననిది
ఏముంది ?

కాలంతో కలిసిపోవడం తప్ప
కాలంలో కలిసి పోవడం తప్ప
నేనేమి చెయ్యగలను??

ఆగిపోతే..?
నుజ్జు నుజ్జయి పోతాను

ఎదురు తిరిగితే..?
తెలివి తక్కువ వాడిగా పోతాను..

కలిసి నడిస్తే..?
ముందుకు పోతాను..

కాలం నాకోసం ఆగదు
కాలం ఎప్పుడూ ఉంది.. అలా కదిలిపోతూ
నేనే మధ్యలో వచ్చాను..
మధ్యలో పోవడానికి

ఊరికే ఆలోచిస్తే అనిపిస్తూంది
ఎప్పుడూ ఉండేది
అన్ని చోట్లా ఉండేది
అన్నిటికి సాక్షి
అందరికీ ఒక్కటి
అయినప్పుడు ..
కాలము దేవుడు ఎందుకు కాకూడదు.. ?
ఆ గౌరవం కాలము పై నాకెందుకు లేదు?

ఉంటే... 
నేను కూడా నా పని సరిగ్గా చేసుకు పోయేవాడిని కదూ !!!
పక్క దారుల పోకుండా !!

Tuesday, February 19, 2019

Pizza II - Villa స్వర్గమే వాకిలీ తెరిచెనే - Lyrics

స్వర్గమే వాకిలీ తెరిచెనే
మేఘమే దారులే పరిచెనే
జత పడునిక  చెరి సగముల ప్రాణం
విడి పడునిక నువు నేనను భావం 
మనము గా ... మారే తొలి క్షణములో
మనసుకే మైకంలా కమ్మగా కమ్మెనే
ఓ... దీనినే ప్రేమంటే ఎందుకో నమ్మెనే

వరములా వానలా కురిసెనే
బ్రతుకిలా తడిసేనే మురిసెనే
మనసుకే మైకంలా కమ్మగా కమ్మెనే
ఓ... దీనినే ప్రేమంటే ఎందుకో నమ్మెనే

ఇరు కలలిక ఒక కధలా సాగే
చిరు కదలిక పెదవంచున ఆగే
చాలులే రోజూ ఇదే చాలులే
రోజూ ఇదే చాలులే
రోజూ ఇదే చాలులే
చాలులే
చాలులే
చాలులేFriday, January 11, 2019

సద్గురువు

ఏదో ఖాళీ..
దేనితో పూడ్చాలో తెలీని ఖాళీ..

సమయం నిలబడదు
మనుషులకి నిలకడ లేదు
వస్తువులు ఎంతో కాలం ఈ ఖాళీని పూడ్చడం లేదు..

ఏం చేయాలో తెలీక
ఎటు పోవాలో దిక్కు తోచక
ప్రతి దిక్కూ .. ఆశగా తిరిగి వచ్చాను
అలసి ఓ పక్కగా కూల బడ్డాను..

ఒక చల్ల గాలి
ఆత్మీయంగా తల నిమిరింది..
నా ఆశకు కొత్త ఊపిరి పోసింది

దానినే  నేను,
గురువు అని
సద్గురువు అని
పిలుచుకుంటున్నా ..


Tuesday, January 8, 2019

ఈరోజూ, నిన్నలానే ఉంది

ఈరోజూ,
నిన్నలానే ఉంది

రేపూ అలానే ఉంటుంది
ఇప్పుడేమైనా చెయ్యకపోతే..
---

అయితే..
ఏం చెయ్యాలి?

నిన్నలా కాకుండా ఏమైనా చెయ్యాలి..
నిన్నలో బ్రతక కుండా ఉండాలి..

----

మరి..
ఏదైనా కష్టాలొస్తేనో..?

నేర్చుకుందాం..
కలిసి నడుద్దాం..

--------
సరే..
ఎప్పటి దాకా..?

అందరిని కలుపుకునే దాకా..
నువ్వు, నేనూ లేకుండా పోయే దాకా
మనం అందరికి పనికి వచ్చే దాకా..
మనతో ఎవరికీ పని లేని రోజు వచ్చే దాకా..

కల్లోలం వేంటేసుకోచ్చే పిల్ల గాలే - Lyrics

కల్లోలం వేంటేసుకోచ్చే పిల్ల గాలే
నను చూస్తూనే కమ్మేసేనే
కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే
విహరించేనా భూలోకమే

గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగే
వానే పట్టింది గోడుగే
అతిధిగా నువ్వోచ్చావనే

కలిసేందుకు తొందర లేదులే
కల తీరక ముందుకు పోనులే

కదిలేది  అది
కరిగేది   అది
మరి కాలమే కంటికి కనపడదే

ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మొగేనులే ఓ పేరే

ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మొగేనులే ఓ పేరే

రాశా రహశ్య లేఖలే
అ, ఆ లు లేవులే, సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

రాశా రహశ్య లేఖలే
అ, ఆ లు లేవులే, సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

కళ్ళ కేది ముందుగా ఆనలేదే  ఇంతలా
రేప్పలే పడనంత పండగ
గుండేకే  ఇబ్బందిలా
ఠక్కున ఆగేంతలా
ముంచినా  అందాలా ఉప్పెన ....

గొడుగంచున ఆగిన తుఫానే
యద పంచన లావా నీవేలే
కనపడని నది అది పొంగినది
నిను కలవగ కడలై పోయినదే

ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మొగేనులే ఓ పేరే

ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మొగేనులే ఓ పేరే

రాశా రహశ్య లేఖలే
అ, ఆ లు లేవులే, సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

రాశా రహశ్య లేఖలే
అ, ఆ లు లేవులే, సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే