Tuesday, May 22, 2018

నువ్వు నేను ప్రేమ చాలుగా - Song Lyrics from THE END Telugu movie

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

తేనె ముల్లు గుచక్కే లోన
వాలు కళ్ళ జానా

పూల జల్లు కురిసే లాగా
నవ్వు నిచ్చి వెళ్ళావా
నీ చిన్ని గుండెనియ్యవా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

వీణ లాగ మొగెనె మైనా, మీన కనుల మంత్రమా
వాన ధారా తాకేనే లోన, వంక చూడు చంద్రమా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

మనసు పాడుతుంద .. నిన్ను చూడ కుండ
పరుగు ఆగుతుంద.. నిన్ను చేర కుండ
తలపు తరుముతుంద కన్ను మూయకుండ
తెలిసి తప్పుకుంద జాబిలేమో చూసి

నీకోసమే నా ప్రాణమే, నీ ధ్యాసలో నా లోకం
నీ ఊహలో నీ ఊసులో నే కరిగిపోనా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

చంద్రమా...

అలక తీరుతుంద పలకరించకుండ
కునుకు చేరుతుందా జోల పాడకుండ
చినుకు రాలుతుంద నింగి కదలకుండ
పెదవి వణుకుతుంద నువ్వు తాకకుండ

ఏమైనదో నీ మాయలో, నీ ప్రేమలో ఆనందం
నీ ఆశలే నా శ్వాసగా, నేనుండి పోనా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా 

No comments:

Post a Comment