Monday, May 28, 2018

ఓ ప్రియతమా బదులీయమా lyrics for Dilse ప్రేమ తో

ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

పల్లవే నువ్వని పలవరించే
చరణం ఎక్కడో పలకరిస్తే
చెప్పమ్మా తను కోరే చిరునామా...

ఓ ప్రియతమా బదులీయమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

జ్ఞాపకాన్ని ఈ గాలి అలా రేపుతుంటే ఆపేది ఎలా
ఈ గాలి ఎలా ఆపేది ఎలా

నాటి చంద్రకళ నేను కన్న కల
కాదంటే నమ్మలేదే
ఉందంటే ఏది అందే
ఓసారి చూపమందే
ఆ స్మృతినే ఆకృతిగా చూడలేనా

ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

పల్లవే నువ్వని పలవరించే
చరణం ఎక్కడో పలకరిస్తే
చెప్పమ్మా తను కోరే చిరునామా...
ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా

ఇంకా అదే క్షణానా ఉన్నా ఇన్ని నాళ్ళయినా
యదలో అదే స్వరనా పలికింది గాలి వాన
ఆ చిన్న నవ్వు లోనా
నే కరిగిపోయినాన
నేనంటూ లేనే లేనా
నీ స్మృతినే ఆకృతిగా చూడలేనా

ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

పల్లవే నువ్వని పలవరించే
చరణం ఎక్కడో పలకరిస్తే
చెప్పమ్మా తను కోరే చిరునామా...

ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

Tuesday, May 22, 2018

నువ్వు నేను ప్రేమ చాలుగా - Song Lyrics from THE END Telugu movie

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

తేనె ముల్లు గుచక్కే లోన
వాలు కళ్ళ జానా

పూల జల్లు కురిసే లాగా
నవ్వు నిచ్చి వెళ్ళావా
నీ చిన్ని గుండెనియ్యవా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

వీణ లాగ మొగెనె మైనా, మీన కనుల మంత్రమా
వాన ధారా తాకేనే లోన, వంక చూడు చంద్రమా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

మనసు పాడుతుంద .. నిన్ను చూడ కుండ
పరుగు ఆగుతుంద.. నిన్ను చేర కుండ
తలపు తరుముతుంద కన్ను మూయకుండ
తెలిసి తప్పుకుంద జాబిలేమో చూసి

నీకోసమే నా ప్రాణమే, నీ ధ్యాసలో నా లోకం
నీ ఊహలో నీ ఊసులో నే కరిగిపోనా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

చంద్రమా...

అలక తీరుతుంద పలకరించకుండ
కునుకు చేరుతుందా జోల పాడకుండ
చినుకు రాలుతుంద నింగి కదలకుండ
పెదవి వణుకుతుంద నువ్వు తాకకుండ

ఏమైనదో నీ మాయలో, నీ ప్రేమలో ఆనందం
నీ ఆశలే నా శ్వాసగా, నేనుండి పోనా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా 

Monday, May 14, 2018

తోడు

గాయకుడు ఎంత గొప్పవాడైనా
అతని గాత్రం రాణించాలంటే
ఒక గొప్ప స్వర కర్త తోడై ఉండాలి

అలానే మనలో ఎంత ఆధ్యాత్మిక తృష్ణ ఉన్నా
అది వికసించి పరిమళాలు వేదం జల్లాలంటే
ఒక గొప్ప సద్గురు తోడు కావాలి

Thursday, May 10, 2018

Acceptance

It is best to accept

what we know as we know
what we do not know as do not know

It's okay
It's okay
It's okay


Wednesday, May 9, 2018

Let them go

It is best to let many things go,
instead sticking to them and struggle.

Sunday, May 6, 2018

కానీ నేను ఆగిపోవడం లేదు

గుండె లోతుల్లో,
ఒక శూన్యం

ఆ శూన్యం అలా మిగిలిపోయినా
నేను స్థిమిత పడలేను
ఆ శూన్యాన్ని ఆక్రమించుకోవడంలో ఏవేవో పోటీ పడుతున్నా...
నేను స్థిమిత పడలేను

పదాలను పేర్చి
ఇది అని నా పరిస్థితి అని పరిచయం చేయాలనుకుంటాను
కానీ..
పెదాలు కలిపినా మాటలు రావు

మౌనం గా మిగిలిపోతే
ఎవరికీ చెప్పుకోలేను
ప్రయత్నం చేస్తూ పోతే
చేతకాని వాడినైపోతున్నాను

అరిచి చెప్పినా
ఆలకించడానికి ఎవరున్నారనుకునే ఈ శూన్యంలో
నా శూన్యం గురించి నివేదించాలనుకోవడం
ఎంత గొప్ప ప్రయత్నమో?
తెలియడం లేదు

కానీ నేను ఆగిపోవడం లేదు 

ప్రశ్నలు
సఙ్గదిగ్దత
సమాధాన ప్రచుకోవటం
మళ్ళీ ప్రయత్నం చెయ్యడం
ఇదే ఆవృతి లో తిరుగుతున్నాను
ఎప్పటినుంచో !

వినేవారెవరో
విడుదల ఎపుడో, తెలియక పోయినా
రేపటి రోజు అనుకున్నది జరుగుతుందని
నేను ఆగిపోవడం లేదు