Monday, April 2, 2018

సరిగ్గా ఆలోచిస్తే...



ఓ కునుకు ఓదార్చి..
నిద్ర పుచ్చేలోగా 

ఒక రేయి చీకటిని దాటి..
వెలుగు కౌగిలింతలో ఒదిగేలోగా

ఒక రెప్ప పాటు..
చప్పుడు చేసే లోగా

ఓ మరణం
ఓ పుట్టుక
ఒకదానినొకటి లంకెలేసుకున్నాయి

జనించిన ప్రతిసారీ..
మరింత ఉత్సాహంగా,
ఉత్సవంగా బ్రతికే అవకాశాన్నిస్తున్నాయి

No comments:

Post a Comment