Thursday, October 4, 2018

మారదు నిజం, నిజానికి ..


ఒకరు చెప్పారని,
ఒకరు చెప్పలేదని,
కాకుండా..

పది మంది కాదన్నా
ఎవరు అవునన్నా

నిజం తన స్వరూపం మార్చుకోదు
వాస్తవానికి, ఒకరి వత్తాసు అవసరం లేదు..

సూర్యుడు తన విధి మరిచిపోనట్టు
మనిషికి పుట్టుక చావులు తప్పనట్టు
బతికుంటే ఎవ్వరికైనా ఆకలి తప్పనట్టు
నువ్వు నేను లేకున్నా ...
ఈ ప్రపంచం ఆగదన్నట్టు ..

మారదు నిజం, నిజానికి ..

Friday, September 21, 2018

Penimiti Lyrics in Telugu Aravinda Sametha

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా.. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా *చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి ( గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ *పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలి లాంటి నిన్ను సంటివాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడక.. సులకన సేయకు.. నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ నరగోస తాకే కామందువే నలపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ

Credits Spiritual Kreatures - Comments from below Link.

https://www.youtube.com/watch?v=rsRSTPYxqvo

Thursday, September 20, 2018

నీవే... Music Dance video Lyrics

నీవె.. తొలి ప్రణయము నీవె.. తెలి మనసున నీవె.. ప్రేమ ఝల్లువే.. నీవే నీవే.. కలలు.. మొదలు నీవే.. మనసు.. కడలి అలలు నీవల్లే కనులు తడుపు నీవే కలత చెరుపు నీవే చివరి మలుపు నీవే నీవే.. ఎటు కదిలిన నీవే.. నను వదిలిన నీవే.. ఎదో మాయవే ప్రేమే.. మది వెతికిన నీడే .. మనసడిగిన తోడే .. నా ధ్యేయమే నిలువనీదు క్షణమైనా.. వదలనన్న నీ ధ్యాసా.. కలహమైన సుఖమల్లే.. మారుతున్న సంబరం.. ఒకరికొకరు ఎదురైతే.. నిమిషమైన యుగమేగా.. ఒక్కోసారి కనుమరుగై..ఆపకింక ఊపిరే.. నీవే.. గడిచిన కథ నీవే.. నడిపిన విధి నీవే.. నా ప్రాణమే.. పాదం వెతికిన ప్రతి తీరం.. తెలిపిన శశి దీపం నీ స్నేహమే నీ జతే .. విడిచే ఊహనే తాళనులె.. వేరొకా..జగమే నేనిక ఎరుగనులే.. గుండెలోని లయ నీవే.. నాట్యమాడు శ్రుతి నేనే.. నువ్వు నేను మనమైతే.. అదో భాగ్యమే.. నీవె.. నను గెలిచిన సైన్యం.. నను వెతికిన గమ్యం.. నీవే నా వరం.. ప్రేమే.. తొలికదలిక లోనె.. మనసులు ముడి వేసె.. ఇదో సాగరం..

- Credits Youtube
https://www.youtube.com/watch?v=0K8qu5H4oXk

Monday, July 30, 2018

చివరికి.. ఓ మంచి రోజు

ముద్రలు వేసుకుపోయిన అనుభవాలు
వేళ్ళూనుకు పోయిన ఆలోచనలు
వెరసి జ్ఞాపకాల వేదికలు ..

కాసిన్ని తలచుకుని గుర్తు చేసుకుంటే
కాసిన్ని గుర్తొచ్చి పొలమారుతాయి

కావాలనుకున్నా ఆ రోజులు అలాగే తిరిగి రావు
వద్దనుకున్నా వాటి మరకలు ఇంకా చెరిగి పోవు

విడిచిన బట్టల్ని, తిరిగి తొడుక్కున్నట్టు
గడిచిన కాలాన్ని
తిరిగి జీవిస్తుండడమే ఈ జ్ఞాపకాలతో వ్యవహారం అంతా 

కాసేపు అద్దంలో చూసుకోడానికి తప్ప
వేసుకుని బయటకి పోడానికి పనికి రావు ...

రాతిరి కల పగటికి మాయమైనట్టు 
వాస్తవంలో అడుగులు పడే కొద్దీ.. 
జ్ఞాపకాలు మరుగునపడి కనుమరుగైపోతాయి.. 
కాలం గిర్రున తిరుగుతుంది 

తిరిగి ఎక్కడో,
ఎప్పుడో,
గుర్తున్నానా అంటూ 
తిరిగి పరిచయం చేసుకోడానికి 
ఓ శుభ ముహూర్తాన ఎదురుపడతాయి 

అప్పుడు కళ్ళు నులుముకుని 
బుర్రకి పదును పెట్టి
తలని గోడకి కొట్టి విశ్వ ప్రయత్నం చేసినా..
వయసు మళ్ళిన ముదుసలి బుద్ధి కి 
జ్ఞాపకాలు జ్ఞప్తికి  రావు 

చివరికి..
జ్ఞాపకాలు అనాధలై వీధిన పడతాయి
మనిషి మరపు తో కలిసి మరణానికి దగ్గరవుతుంటాడు  

ఓ మంచి రోజు 
రెండూ లేకుండా పోతాయి.. 


Monday, July 16, 2018

ఆలోచన - ఒక విచిత్రమైన పదం..

ఆలోచన
ఒక విచిత్రమైన పదం..

దీనికి నిన్న నేడు రేపు లనే తేడా లేదు
తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే భేదం లేదు

విన్నవి చూసినవి
అక్కడా ఇక్కడా ఏరుకున్న విషయాలను
ఊహకి .. భావనలకు జోడించి
గాలిలో మేడలు లేపుతుంది

అటు ఇటు పోలేక
కూలిన ఆ మేడల శిధిలాల లోనే
నలుగుతూ జీవిస్తుంది

వాస్తవం గా వాస్తవాన్ని చూసే ఆలోచన,
ఆలోచనకు ఎప్పుడు వస్తుందో?

Tuesday, July 10, 2018

ఓ తీగె.. తెగి

ఓ తీగె.. తెగి ఊపిరాడక
విల విల లాడింది

చూడలేక.. చూసి ఊరుకోలేక
తెచ్చుకుని కొంత పుడమిని తోడిచ్చాను
దాహమంటే ఇంత నీరిచ్చాను
తాగి అలసి పడుకుండి పోయింది, ఆరోజుకి

తెల్లారి చూస్తే, నవ్వుతూ పలకరించింది
ప్రతిరోజూ గుమ్మంలో అడుగు పెట్టే ముందు
నా తల .. ఆ తీగె ఎలావుందో అని చూస్తూ
లోపలికి కదిలేది.
నేనెటువైపు పోతే అటువైపే చూసేది

కొత్త చిగురులు తొడిగినా
వేర్లు ఊనినా
ఏమాత్రము ఎదిగినా
ఒక సంతోషం.. ఇంట్లో బిడ్డ పెరుగుతున్నట్టు

ఓరోజు.. తీగె మల్లెలేసింది
ఆ అందాన్ని చూస్తూ ఆనందంలో మునిగిపోయాను
ఎవరో గుడికి తీసుకుపోతాం అన్నారు
ఇంకెవరో మా ఇంట్లో శుభకార్యం ఉందన్నారు
చూస్తిని కదా ఇంకొకరు ఎవరో పోయారన్నారు
దారిని పోయేవాళ్ళు పరిమళం బాగుంది పట్టుకుపోతాం అన్నారు...

నేను మాత్రం కదల్లేదు.. వదల్లేదు
కనీసం ముట్టను లేదు
అమ్మ ఒడిలో పాపలా
అన్నపూర్ణమ్మ చేతిలో ముద్దలా
సద్గురు చూపులా ఉన్న
ఆ మల్లె నేసిన తీగని
ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను..
అది చాలనుకున్నాను
అదే చాలనుకున్నాను

Saturday, June 30, 2018

నా చెలీ - పిజ్జా లిరిక్స్ naa cheli pizza lyrics in telugu

నా చెలీ నువే కదా
ఈ జగం కాదు అనినా
నీవో సగం నేనో సగం
ఈ జీవితం మనకో వరం
చంద్రోదయం ఈ సంబరం
ప్రేమోత్సవం మన పరిణయం

సిరి సొగసుల చెలివై చలి పెంచు
చిరు అలకల కలువై కవ్వించు - ప్రేయసీ
నవ రంగుల కలలే పండించు
బిగి కౌగిట కసిగా బంధించు - శ్రీమతీ
ఎంతో సుఖం నీ పరిమళం
చాలా ప్రియం కురుల కోమలం
నా ప్రేమలో నిన్నే లాలించనా

నా చెలీ నువే కదా
ఈ జగం కాదు అనినా
నీవో సగం నేనో సగం
ఈ జీవితం మనకో వరం
చంద్రోదయం ఈ సంబరం
ప్రేమోత్సవం మన పరిణయం

మేఘం నువే చినుకు నువే
కనువిందయే అందానివే
అంతా నువే నా దానివే
నా బ్రతుకుకే అర్ధానివే
ఆ .. ఆ... ఆ.Wednesday, June 20, 2018

Padayaatra Job Kurian Lyrics

Ennile Chudu Thaalamaayi Oru yaathrayaayi, Padhayaatrayaayi.. 
Kadhakaalame kulirormayaayi Oru yaathrayaayi, Padhayaatrayaayi..

Parayaan maranna Vaakkumaayi Manadhaaril aayitha..
Nira dheepame Kinavupolenn Kannil eguvaan..

Nizhal pole azhalaale veyil neele padhayaatra..
Nizhal pole azhalaale veyil neele padhayaatra..

Kaalam Arivukalaale alivukalaale poomazha pole..
mannil neela nilavin ponalayaale naadhalayangal.. 

Kaalam Arivukalaale alivukalaale poomazha pole..
mannil neela nilavin ponalayaale naadhalayangal.. 

Varadhaayakamaayi Swara saagaramaayi.. 
Janimokshavumaayi PuthuJeevanumaayi.. 

Nizhal pole azhalaale veyil neele padhayaatra..
Nizhal pole azhalaale veyil neele padhayaatra..

Mayamo Marimayamo - Rasam Lyrics - Job Kurian

Maayamo...marimaayamo...
jaalamo...indrajaalamo...
manasse en kannine nampaamo...
madikkaanenthoru moham...

kerippona vazhiyethu...
chennu cherum idamethu..
evide chennu chekkerum...
swarggamo kanaka sabhayo...

kerippona vazhiyethu...
chennu cherum idamethu..
evide chennu chekkerum...
swarggamo kanaka sabhayo...

erratteratterumpolayyaa
chankilenthe ariyaatha peda peda...
irangattirangattirangumpol aahaa
vayarinakame vallaatha chudu chuda..
pacha vecha marubhoomiyilevideyum
mukalilekkozhukum yanthra dhaarakal...
chuttumulla kadalin kaliveedithil
patti ninnaruma swapna bhangikal....

raathriyo..ithu pakalo..
vettam kondaaraattalle..
vettam kondaaraattalle....

raathriyo..ithu pakalo..
vettam kondaaraattalle..


midhyayo...ithu sathyamo...

erratteratterumpolayyaa
chankilenthe ariyaatha peda peda...
irangattirangattirangumpol aahaa
vayarinakame vallaatha chudu chuda..
pacha vecha marubhoomiyilevideyum
mukalilekkozhukum yanthra dhaarakal...
chuttumulla kadalin kaliveedithil
patti ninnaruma swapna bhangikal....

Source: http://getthelyric.com/song/mayamo-marimayamo-rasam-lyrics

Monday, June 11, 2018

గుడిలో దేవుడు...!!


------------------------------

చీకటితో లేస్తావు
పగలంతా తలుపులు తెరుచుకు చూస్తావు
ఓసారయిన వచ్చిపోతానని

నను చూస్తూనే ఉంటావు,
అయినా రోజంతా ఎదురుచూస్తావు
ఓమాటు అయినా నీ గుమ్మం తొక్కుతానని

కబురులు పంపుతావు,
ఉన్నానని గుర్తు చేస్తుంటావు, యేలాగో అలాగ
అయినా... ఊరంతా తిరుగుతాను కాని
నీ వైపుకు కదలను..
నీ ఊసుకు చనువీయను

చూసి చూసి, అలసి
నువ్వు అలాగే శయనిస్తావు..
మళ్ళీ ఎప్పటిలా..
చీకటితో లేస్తావు

నీకో మాట చెప్పనా!
నీకు తెలియనిది ఏముంది..
ఎంత తిరిగుతున్నా నేను కట్టేసి ఉన్న బందీనే..
ఒకటీ రెండూ కాదు.. శృంఖలాలు.
కొన్ని నేను కట్టుకున్నవి .. కొన్ని నన్ను పట్టుకున్నవి

ఈ ఎదురు చూపులు నువ్విక పడలేవు
నీ కష్టం నేను చూడలేను
కనుక నువ్వేరా..
వచ్చి నన్నెత్తుకెళ్ళు..
నన్నెత్తుకు తీసుకెళ్ళు..
ఆడుకుందాం కలిసి సంతోషంగా

కాళీయ మర్దనం లా
రావణాసుర వధ లా
నరకాసుర పీడాహరణం లా

Enthavo Job Kurian Lyrics in English

ennaalum nee maranyallo
en kanneeril pirannallo
ennellaamE thiranyallo
nee engo po enthavo

ororo vennilavathu
ethetho pon kinavatthu
en nenja thon nananyal
manchiraathay nee thelinyalo

Enthaavo
enthaa aavo
Enthaavo

Enthaavo
enthaa aavo
Enthaavo

En paattil nin nizhal therottam
maattam kan kanal thiranottam
choodum nyan arinyo enthavo

En paattil nin nizhal therottam
maattam kan kanal thiranottam
choodum nyan arinyo enthavo

ooo oh o oh... ooo oh
ooo oh o oh... ooo oh
ooo oh o oh... ooo oh
ooo oh o oh... ooo oh

Lokam ee kanmunnil enthaanithu
maayam marimayannaal engottithu
kanneero kaavero, kandarinja kaalam muthal

Mohangal chaayangal enthanithu
than thaane nedunna thenthaanithu
kanneero venneero pandarinja kaalam kaanam

aanandamaadum vade
neraattam nedum vade
ennaalaavum
thannaalaavum
varamaagumo

Enthaavo
enthaa aavo
Enthaavo

Enthaavo
enthaa aavo
Enthaavo

- Please let me know, if there are any corrections to be done. I will gladly do.

Friday, June 1, 2018

beautiful love Lyrics in Telugu from Naa Peru Surya

పెదవులు దాటని పదం పదం లో
కనులలో దాగని నిరీక్షణం లో
నాతో ఏదో అన్నావా

తెగి తెగి పలికే స్వరం స్వరం లో
తెలుపక తెలిపే అయోమయం లో
నాలో మౌనం విన్నావా
నాలానే నువ్వూ ఉన్నావా

మన కధ beautiful  love
మన కధ beautiful  love
పద పద find the మీనింగ్,
live this  feeling of beautiful  love

ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
ఎన్నడూ లేనిదీ కలవరం
కనుబొమ్మ విల్లుతో విసిరావో ఏమిటో
సూటిగా నాటగా సుమ శరం

తగిలిన తీయనైన గాయం
పలికిన హాయి కూని రాగం
చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదో

ఏం జరగనుందో ఏమో.. ఈ పైన

మన కధ beautiful  love
మన కధ beautiful  love
పద పద find the మీనింగ్,
live this  feeling of beautiful  love

మన కధ beautiful  love
మన కధ beautiful  love
పద పద find the మీనింగ్,
live this  feeling of beautiful  love

నిగ నిగ లాడెను కణం కణం
నీ ఊపిరి తాకిన క్షణం క్షణం
నా తలపే వలపై మెరిసేలా

వెనకడుగేయక నిరంతరం
మన ప్రేమ ప్రవాహం మనోహరం
ప్రతి మలుపు గెలుపై పిలిచేలా

బావుంది నీతో ఈ ప్రయాణం

మన కధ beautiful  love
మన కధ beautiful  love
పద పద find the మీనింగ్,
live this  feeling of beautiful  love 

Monday, May 28, 2018

ఓ ప్రియతమా బదులీయమా lyrics for Dilse ప్రేమ తో

ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

పల్లవే నువ్వని పలవరించే
చరణం ఎక్కడో పలకరిస్తే
చెప్పమ్మా తను కోరే చిరునామా...

ఓ ప్రియతమా బదులీయమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

జ్ఞాపకాన్ని ఈ గాలి అలా రేపుతుంటే ఆపేది ఎలా
ఈ గాలి ఎలా ఆపేది ఎలా

నాటి చంద్రకళ నేను కన్న కల
కాదంటే నమ్మలేదే
ఉందంటే ఏది అందే
ఓసారి చూపమందే
ఆ స్మృతినే ఆకృతిగా చూడలేనా

ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

పల్లవే నువ్వని పలవరించే
చరణం ఎక్కడో పలకరిస్తే
చెప్పమ్మా తను కోరే చిరునామా...
ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా

ఇంకా అదే క్షణానా ఉన్నా ఇన్ని నాళ్ళయినా
యదలో అదే స్వరనా పలికింది గాలి వాన
ఆ చిన్న నవ్వు లోనా
నే కరిగిపోయినాన
నేనంటూ లేనే లేనా
నీ స్మృతినే ఆకృతిగా చూడలేనా

ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

పల్లవే నువ్వని పలవరించే
చరణం ఎక్కడో పలకరిస్తే
చెప్పమ్మా తను కోరే చిరునామా...

ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

Tuesday, May 22, 2018

నువ్వు నేను ప్రేమ చాలుగా - Song Lyrics from THE END Telugu movie

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

తేనె ముల్లు గుచక్కే లోన
వాలు కళ్ళ జానా

పూల జల్లు కురిసే లాగా
నవ్వు నిచ్చి వెళ్ళావా
నీ చిన్ని గుండెనియ్యవా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

వీణ లాగ మొగెనె మైనా, మీన కనుల మంత్రమా
వాన ధారా తాకేనే లోన, వంక చూడు చంద్రమా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

మనసు పాడుతుంద .. నిన్ను చూడ కుండ
పరుగు ఆగుతుంద.. నిన్ను చేర కుండ
తలపు తరుముతుంద కన్ను మూయకుండ
తెలిసి తప్పుకుంద జాబిలేమో చూసి

నీకోసమే నా ప్రాణమే, నీ ధ్యాసలో నా లోకం
నీ ఊహలో నీ ఊసులో నే కరిగిపోనా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా

చంద్రమా...

అలక తీరుతుంద పలకరించకుండ
కునుకు చేరుతుందా జోల పాడకుండ
చినుకు రాలుతుంద నింగి కదలకుండ
పెదవి వణుకుతుంద నువ్వు తాకకుండ

ఏమైనదో నీ మాయలో, నీ ప్రేమలో ఆనందం
నీ ఆశలే నా శ్వాసగా, నేనుండి పోనా

నువ్వు నేను ప్రేమ చాలుగా
నీతో నేను ఉంటా తోడుగా 

Monday, May 14, 2018

తోడు

గాయకుడు ఎంత గొప్పవాడైనా
అతని గాత్రం రాణించాలంటే
ఒక గొప్ప స్వర కర్త తోడై ఉండాలి

అలానే మనలో ఎంత ఆధ్యాత్మిక తృష్ణ ఉన్నా
అది వికసించి పరిమళాలు వేదం జల్లాలంటే
ఒక గొప్ప సద్గురు తోడు కావాలి

Thursday, May 10, 2018

Acceptance

It is best to accept

what we know as we know
what we do not know as do not know

It's okay
It's okay
It's okay


Wednesday, May 9, 2018

Let them go

It is best to let many things go,
instead sticking to them and struggle.

Sunday, May 6, 2018

కానీ నేను ఆగిపోవడం లేదు

గుండె లోతుల్లో,
ఒక శూన్యం

ఆ శూన్యం అలా మిగిలిపోయినా
నేను స్థిమిత పడలేను
ఆ శూన్యాన్ని ఆక్రమించుకోవడంలో ఏవేవో పోటీ పడుతున్నా...
నేను స్థిమిత పడలేను

పదాలను పేర్చి
ఇది అని నా పరిస్థితి అని పరిచయం చేయాలనుకుంటాను
కానీ..
పెదాలు కలిపినా మాటలు రావు

మౌనం గా మిగిలిపోతే
ఎవరికీ చెప్పుకోలేను
ప్రయత్నం చేస్తూ పోతే
చేతకాని వాడినైపోతున్నాను

అరిచి చెప్పినా
ఆలకించడానికి ఎవరున్నారనుకునే ఈ శూన్యంలో
నా శూన్యం గురించి నివేదించాలనుకోవడం
ఎంత గొప్ప ప్రయత్నమో?
తెలియడం లేదు

కానీ నేను ఆగిపోవడం లేదు 

ప్రశ్నలు
సఙ్గదిగ్దత
సమాధాన ప్రచుకోవటం
మళ్ళీ ప్రయత్నం చెయ్యడం
ఇదే ఆవృతి లో తిరుగుతున్నాను
ఎప్పటినుంచో !

వినేవారెవరో
విడుదల ఎపుడో, తెలియక పోయినా
రేపటి రోజు అనుకున్నది జరుగుతుందని
నేను ఆగిపోవడం లేదు

Tuesday, April 24, 2018

Relationships

I just can't make them easily
         Can't break them easily
         Can't escape
         Neither live in balance

But without them, what am I?
With them what I am becoming?

I hope they are just relationships
and not attachments

I hope they are made for a purpose
and not for just needs

Indeed there must be
a way
Indeed there must be
a release

Thursday, April 12, 2018

ప్రదర్శనకు కాదు

శక్తి ఉన్నది పని చెయ్యడానికి...
పని జరగడానికి..

ప్రదర్శనకు కాదు 

Monday, April 2, 2018

సరిగ్గా ఆలోచిస్తే...ఓ కునుకు ఓదార్చి..
నిద్ర పుచ్చేలోగా 

ఒక రేయి చీకటిని దాటి..
వెలుగు కౌగిలింతలో ఒదిగేలోగా

ఒక రెప్ప పాటు..
చప్పుడు చేసే లోగా

ఓ మరణం
ఓ పుట్టుక
ఒకదానినొకటి లంకెలేసుకున్నాయి

జనించిన ప్రతిసారీ..
మరింత ఉత్సాహంగా,
ఉత్సవంగా బ్రతికే అవకాశాన్నిస్తున్నాయి

Monday, March 19, 2018

వెధవ జీవితం

జీవితానికో అర్ధం లేకుండా పోయింది..

నచ్చింది చేసుకుంటూ పోవడం..
దానికేదో reasoning ఇచ్చుకోవడం...

అందుకే "వెధవ జీవితం" అనే పదం పుట్టింది అనుకుంటా !

Saturday, February 10, 2018

కలయా! నిజమా!

తెరచిన నీ ఆలోచనలో
కనులు మూసుకున్నాను

ముగియని నీ ఆలాపనలో
కలనై కరిగి పోతున్నాను

నిజానికన్నా కలలో
నీ దగ్గరగా ఉంటున్నాను
నిజమో కలో తెలియక
నీ తపసే చేస్తున్నాను

ఒక రూపం
ఒక భాష
ఒక అర్ధం
ఒక వివరణ
ఇవ్వాలంటే నా 'కలకి'
నీవు తప్ప వేరే లేదు

ప్రతి క్షణం
ప్రతి రోజు
ప్రతి సారి
పదే పదే 
చెప్పాలంటే 'నిజానికి'
నిను తప్పే దారి లేదు

ఆరాటం!
నువ్వే దారిలో కలుస్తావని 
పడి, పడీ, ఎంత ఎదురుపడతానో
ఓ సారైనా నీ కంట పడతానని! 

ఎక్కడో అనుమానం
నువ్వూ చూస్తున్నావని.
అదే మరింత ఆశ,
వెంట పడాలని.

మనసుకు తెలియదు
ఏది కలో ఏది నిజమో
దానికి తెలిసిందొకటే
నిన్ను మననం చేసుకోవడం

నయనానికి, హృదయానికి
వెలుగొక్కటే ..
నిను కలిసే సమయానికై పయనం 
అలాగే అస్థిత్వాన్ని కోల్పోవడం

Tuesday, January 23, 2018

పరిష్కారం

సమస్యను గుర్తిస్తే మరో సమస్య

సమస్యని సమస్యగా గుర్తించక పోవడం కూడా
ఒక సమస్యే...

ఒక్కోసారి తెలీనట్టు ఊరుకోవడమే
పరిష్కారం అనుకుంటా!!!


Monday, January 15, 2018

నువ్వే, నీతోనేనీ గురించి చెప్పాలనుకున్నా
నువ్వే ఉంటావు

నా గురించి చెప్పాలనుకున్నా
నువ్వే ఉంటావు

ఇంకా 
నేనేం మాట్లాడను?

నాకు పదాలు అంటే మన మాటలే
సమయం అంటే మనం కలిసున్నదే
జీవితం అంటే నీతో గడిపిందే
మిగతాదంతా ఊరికే... వట్టి అబద్ధం !

ఎప్పుడు చూసినా,
నాలా లేనంటూ, ఇదివరకటిలా లేనంటూ
అందరూ చెప్పే మాటలు
నవ్వు తెప్పిస్తున్నాయి

ఎలా చెప్పాలో తెలీడం లేదు
నా నుంచి ఎదురు చూడడానికి వాళ్లకి ... ఏమీ మిగల లేదని!

నువ్వేనా విప్లవం
నువ్వేనా విడుదల
నువ్వేనా సత్యం
నువ్వేనా ఆఖరి మజిలీ

వాళ్లకి ఎలా చెప్పాలో తెలీడం లేదు
నేను అనే వాడిని నాకైనా లేనని

నీతోనే సంగతి
నీతోనే సంతోషం
నీతోనే పంతం
నీతోనే విరమణ
నీతోనే ప్రయత్నం
నీతోనే నిష్క్రమణ

నువ్వే,
నీతోనే