Wednesday, October 5, 2016

తప్పనిసరి ప్రయాణం



వెళ్లక తప్పదని తెలిసి
ఉండకూడదని ముందే నిర్ణయం తీసుకుని
వెళ్లే సమయానికి మాత్రం
ఎంత విల విల లాడుతుంది?! ప్రాణం

యేవో జ్ఞాపకాలు,
ఉన్నట్టుండి వెక్కిళ్లు..
ఎవరో పట్టుకుని ఆపేస్తున్నట్టు
అడుగడుగు కి ఆగిపోవడం
ఎందుకో ఈ అల్లరి !?

మాటి మాటికీ తల్చుకోవడం 
ఏవో మాటలు చెప్పాలనుకోవడం
ఊరికే ఉండలేకపోవడం
ఉసూరుమనడం
తప్పని ప్రయాణానికి
తప్పని సరి అలంకరణలేమో !?

No comments: