Monday, September 26, 2016

ఊసుపోక - 7ఈరోజు 68వ కంచి కామ కోటి పీఠాది పటులైన, చంద్ర శేఖర సరస్వతి స్వామి వారి పుస్తకం "నడిచే దేవుడు అని పుస్తకం చదువుతున్నాను " 

పుస్తకం లో ఒక చోట "ఖహారము"  అనే పదం చదివాను.. అంటే infinity అని అర్ధం అట . 

స్వామి వారిని నమ్ముకున్న వారిని కష్టాలనుండి కాపాడిన అనుభవాలు,  స్వామి వారు చేసిన అనుగ్రహ భాషణలు.. చదవడం లో గొప్ప ఆనందాన్ని పొందాను..  దానితో పాటు ఈరోజు ఒక కొత్త పదం నేర్చుకున్నాను .. 

Thursday, September 22, 2016

కవి - సాన పట్టిన కత్తిఈతని కలం 
మౌనం వహించదు 
మకిలిని కడిగేస్తుంది 
మనుగడను ప్రశ్నిస్తుంది 
దిక్సూచిలా పని చేస్తుంది 
హృదయం ధ్వనించినట్టు 
మనసు వర్షించినట్టు 
తన పని తాను చేసుకుపోతుంటుంది 

ఇతనో extremist .. 
ప్రమాదకారి 

ఇతనో ఉద్యమ కారుడు 
స్వయంభు మేలుకొలుపు 

ఇతనో పిచ్చోడు 
మూడో కన్ను తెరిచిన శివుడు 

మనలో ఉన్నా.. 
మనతో లేడు  

ఇతనో కళాయుధధారి  
స్వేచ్చా విహారి 

ఎప్పుడు చూసినా భాష చిత్తరువు పెట్టుకుని 
పదాల వరాల కోసం  
తపస్సు చేస్తుంటాడు 

ఇతగాడికి 
చెప్పినా చెప్పుకున్నా వినపడుతుంది 

కనపడని ఈతని కంట్టద్దం   
ఏ అడ్డం లేకుండా చూస్తుంటుంది 
సూర్య చంద్రులను దాటి మరీ 

కట్టడి లేదు 
కట్టుబాట్లు లేవు 
ఈతనికి 

ఏమవుతుందో గానీ 
ఆవేశం జనిస్తుంది ఉన్నట్టుండి. 
ఎందుకో అతగాడే చెప్పాలి.. 
ఒక్కోసారి, చెప్పినా అర్ధం కాదు అనుకో!

అసూయను అందంగా చెప్పినా 
కోపానికి పొగడ్తనద్దినా
అతడి కతడే సాటి 
సాన పట్టిన కత్తి

Sunday, September 18, 2016

ఆ సైనికుడెవరు ???

పుట్టడానికి 
తొమ్మిది నెలల యుద్ధం 

సాగే చదువుతో 
అంతంత మాత్రం ఆడే డబ్బుతో 
పోటీ తో 
ప్రత్యేకతలతో 
విధ్యార్థిగా యుద్ధం 

భాషతో 
ప్రాంతం తో 
రంగుతో 
వేరు చేసే ప్రతి గుర్తింపుతో 
పని కోసం ఆపని యుద్ధం 


కదలని ఆదాయానికి 
ఆగని ఖర్చుకు 
మారే పరిస్థితులకి 
కధలు చెప్పి నిద్రపుచ్చి  
మనుగడ కోసం యుద్ధం 

విద్యాలయాలలో కరువులు 
వైద్యారణ్యాలలో బలులు 
ప్రయాణాలలో లయమయే బరువులు 
దించుకునేందుకు యుద్ధం  

చూసే ప్రతిదీ 
కలిసే ప్రతి ఒక్కరూ 
ప్రత్యర్ధే అవుతుంటే 


ఏమి కావాలో వద్దో 
అసలెందుకో తెలియని 
తికమక తో 
అన్నిటికంటే పెద్ద యుద్ధం, తనతో .. చేస్తూ 
ఎంత అలిసిపోనీ 
ఆశకు చమురు పొసే ఆ సైనికుడు 
ఎవరు?

Thursday, September 15, 2016

ఊసుపోక - 6

If you want to get rid of Lazyness:

Doesn't matter you like it or not continue to do some good thing for you or for others for number of days..

May your interest will not allow you
May your body will not co-operate
May you have some other work
May someone is trying to interrupt

Doesn't matter you just keep going.. Your Lazyness will go away.

All that it needs is determination. But remember that the journey is not going to be smooth, till it reaches the end.

Wednesday, September 14, 2016

ఊసుపోక - 5వర్షపు రోడ్ల మీద వాహనాలు నడిపే వాళ్ళు కాస్త చూసి నడిపితే బాగుంటుంది..

వేగం గా వెళ్లిపోవడం లో ఎవరెవరి మీద నీళ్లు చిందిస్తున్నారనే విషయం చాలామందికి పెట్టనే పట్టడం లేదు.

ఉదా: ఒక ఇంటర్వ్యూ కి వెళ్లే వ్యక్తి మీద నీటి గుంటలో పడిన టైరు నీళ్లు కొట్టింది అనుకుందాం.. అది అతనికి ఎంత ఇబ్బంది?

నీటి నిల్వలు ఉన్న చోట రోడ్లపై కాస్త ఆచి తూచి వాహనాలు నడుపుదాం.. ! నిజానికి అలా నడపడం వాహన దారులకు కూడా శ్రేయస్కరం.