Tuesday, December 13, 2016

తాపత్రయంతాపత్రయం,
ఏదో చెప్పాలని
కానీ నాకేం తెలుసని చెప్పడానికి ... శూన్యం

తాపత్రయం,
ఏదో చెప్పాలని
కానీ ఎవరున్నారిక్కడ వినడానికి.. నిర్మానుష్యం

'ఊరికేదో' చెపుదామని ఉంటుంది
'ఊరికే' ఏదో చెప్పడం ఎందుకని ఆగిపోతాను

ఊహలు, ఉద్దేశాలేమైనా చెపుదామని ఉంటుంది
ఊహలు నిజాలు కావు
ఉద్దేశాలు నిలబడవు
మళ్ళీ ఆగిపోతాను

ఏమీ లేకపోతే, లేదని
ఉంటే ఉందని
ఏదో ఒక మాట పంచుకుందామనుకుంటాను
కానీ ఏదో అభద్రతా భావం .. మళ్ళీ ఆగిపోతాను
అదికూడా చెప్పలేను ఎవ్వరికీ .. హాస్యాస్పదం

బహుశా..
ఇక్కడ చెప్పడానికి ఏమీ లేక కాదు (Content)
చెప్పుకోవడానికి లేక ఆగిపోతాను కాబోలు (Situation)

బహుశా..
ఇక్కడ వినే వాళ్ళు లేక కాదు (availability)
ఎలా చెప్పుకోవాలో తెలీక ఆగిపోతాను కాబోలు (Expression)

ఇక్కడకి,
నేను ఆగిపోతాను (Action)
కానీ తాపత్రయం కాదు (Thought)

అదే సమస్య
అదే పరిష్కారం


Saturday, November 26, 2016

Thank you - Sadhguru

You are the guide You are the Light You are the path You are beyond my words You are behind my experience of life You have told me that I am nothing You have reminded me, to not to become something that I am not Without you I am lost everywhere With you I am certain With you I am clear Thank you is small and nothing But I don't know what else I can say and I don't know what I can give you back, for the grace you have showered for the care you have taken for being my mother and father and for everything that you have done to me I wish I will have tears flooded out of happiness, when ever I think of you I wish I will have gratitude filled in me, whenever I see you I wish I will have nothing to speak , other than you Thank you, Thank you, Thank you !!! Sadhguru

Friday, November 25, 2016

నోటు కోసం - మనం - మార్పు కోసం

ఒక్కోసారి ఏం చేస్తున్నామో తెలీదు
ఒక్కోసారి ఏం చెయ్యాలో తెలీదు
ఒక్కోసారి, చేసేది ఎందుకు చేస్తున్నామో తెలీదు

ఏం తెలీకుండా
ఏదోటి చేసుకుపోతే
భవిష్యత్తును ఎదుర్కొనే ధైర్యం లేకుండా పోతుంది.
భవిష్యత్తు ఉందా అనే అనుమానం కలుగుతోంది ..

భవిష్యత్తు మనది కాదు
తరువాత తరాలది !!

తెలిసింది చెపుతాం , తెలియనిది తెలీదని ఒప్పుకుంటాం - ఇది విద్య
ఆదుకున్న వారిని గుర్తు పెట్టుకుంటాం, దణ్ణం పెట్టుకుంటాం  - ఇది సంస్కారం
అడిగిన వారికి ఉన్న దాంట్లో ఇంత పెడదాం, లేకుంటే ఊరుకుంటాం - ఇది సహాయం
ఆశయాల కోసం మన సామర్ధ్యాన్ని మనమే ప్రశ్నిస్తాం - ఇది సాహసం 

ఇదేదీ లేదు..
ఇదేదీ కాదు..
అనుకుంటూ

మనమే నిస్సిగ్గుగా నచ్చింది చేసుకుపోతూ
లాభాల కోసం ఏవో నినాదాలు వినిపిస్తూ
శూన్యం వైపు పరిగెత్తుకు పోతుంటే, వేగంగా
పాపం ఎవరో ఒకరిద్దరు..  ప్రగతి పేరున పంచే ఆ కాసిన్ని కరపత్రాలు, కాళ్ళ కిందేసి
భూతల్లి వడిలో కలిపేస్తుంటే మనం
కాలం తన మానాన తానూ పోతుంటే

ఏదో ఒక రోజు ..
నాకేమిచ్చావ్ అని నిలదీసేవాడుండడు మనని
నాకేమొచ్చిందని చూసుకునే వాడు తప్ప..

కానీ మనమేం చేసామో అది తిరిగొస్తుంది
తరువాతి తరం రాత మారుతుంది
అది చూసి కన్నుల వెంట నీరు ధారాలై కారుతుంది
చివరికి తుడిచేవారు లేక, చేసింది చారికలై
చెంపకు చేరుతుంది

అందుకే ..
నిలబడదాం మన కోసం
మన కుటుంబాలు నిలబడడం కోసం
ఊరికోసం, దేశం కోసం
కాస్త కష్టపడదాం

ఒక మార్పును ఆహ్వానిద్దాం
ఒక గెలుపుకు సహకరిద్దాం
కలిసి గెలుద్దాం 

Wednesday, October 5, 2016

తప్పనిసరి ప్రయాణంవెళ్లక తప్పదని తెలిసి
ఉండకూడదని ముందే నిర్ణయం తీసుకుని
వెళ్లే సమయానికి మాత్రం
ఎంత విల విల లాడుతుంది?! ప్రాణం

యేవో జ్ఞాపకాలు,
ఉన్నట్టుండి వెక్కిళ్లు..
ఎవరో పట్టుకుని ఆపేస్తున్నట్టు
అడుగడుగు కి ఆగిపోవడం
ఎందుకో ఈ అల్లరి !?

మాటి మాటికీ తల్చుకోవడం 
ఏవో మాటలు చెప్పాలనుకోవడం
ఊరికే ఉండలేకపోవడం
ఉసూరుమనడం
తప్పని ప్రయాణానికి
తప్పని సరి అలంకరణలేమో !?

Monday, September 26, 2016

ఊసుపోక - 7ఈరోజు 68వ కంచి కామ కోటి పీఠాది పటులైన, చంద్ర శేఖర సరస్వతి స్వామి వారి పుస్తకం "నడిచే దేవుడు అని పుస్తకం చదువుతున్నాను " 

పుస్తకం లో ఒక చోట "ఖహారము"  అనే పదం చదివాను.. అంటే infinity అని అర్ధం అట . 

స్వామి వారిని నమ్ముకున్న వారిని కష్టాలనుండి కాపాడిన అనుభవాలు,  స్వామి వారు చేసిన అనుగ్రహ భాషణలు.. చదవడం లో గొప్ప ఆనందాన్ని పొందాను..  దానితో పాటు ఈరోజు ఒక కొత్త పదం నేర్చుకున్నాను .. 

Thursday, September 22, 2016

కవి - సాన పట్టిన కత్తిఈతని కలం 
మౌనం వహించదు 
మకిలిని కడిగేస్తుంది 
మనుగడను ప్రశ్నిస్తుంది 
దిక్సూచిలా పని చేస్తుంది 
హృదయం ధ్వనించినట్టు 
మనసు వర్షించినట్టు 
తన పని తాను చేసుకుపోతుంటుంది 

ఇతనో extremist .. 
ప్రమాదకారి 

ఇతనో ఉద్యమ కారుడు 
స్వయంభు మేలుకొలుపు 

ఇతనో పిచ్చోడు 
మూడో కన్ను తెరిచిన శివుడు 

మనలో ఉన్నా.. 
మనతో లేడు  

ఇతనో కళాయుధధారి  
స్వేచ్చా విహారి 

ఎప్పుడు చూసినా భాష చిత్తరువు పెట్టుకుని 
పదాల వరాల కోసం  
తపస్సు చేస్తుంటాడు 

ఇతగాడికి 
చెప్పినా చెప్పుకున్నా వినపడుతుంది 

కనపడని ఈతని కంట్టద్దం   
ఏ అడ్డం లేకుండా చూస్తుంటుంది 
సూర్య చంద్రులను దాటి మరీ 

కట్టడి లేదు 
కట్టుబాట్లు లేవు 
ఈతనికి 

ఏమవుతుందో గానీ 
ఆవేశం జనిస్తుంది ఉన్నట్టుండి. 
ఎందుకో అతగాడే చెప్పాలి.. 
ఒక్కోసారి, చెప్పినా అర్ధం కాదు అనుకో!

అసూయను అందంగా చెప్పినా 
కోపానికి పొగడ్తనద్దినా
అతడి కతడే సాటి 
సాన పట్టిన కత్తి

Sunday, September 18, 2016

ఆ సైనికుడెవరు ???

పుట్టడానికి 
తొమ్మిది నెలల యుద్ధం 

సాగే చదువుతో 
అంతంత మాత్రం ఆడే డబ్బుతో 
పోటీ తో 
ప్రత్యేకతలతో 
విధ్యార్థిగా యుద్ధం 

భాషతో 
ప్రాంతం తో 
రంగుతో 
వేరు చేసే ప్రతి గుర్తింపుతో 
పని కోసం ఆపని యుద్ధం 


కదలని ఆదాయానికి 
ఆగని ఖర్చుకు 
మారే పరిస్థితులకి 
కధలు చెప్పి నిద్రపుచ్చి  
మనుగడ కోసం యుద్ధం 

విద్యాలయాలలో కరువులు 
వైద్యారణ్యాలలో బలులు 
ప్రయాణాలలో లయమయే బరువులు 
దించుకునేందుకు యుద్ధం  

చూసే ప్రతిదీ 
కలిసే ప్రతి ఒక్కరూ 
ప్రత్యర్ధే అవుతుంటే 


ఏమి కావాలో వద్దో 
అసలెందుకో తెలియని 
తికమక తో 
అన్నిటికంటే పెద్ద యుద్ధం, తనతో .. చేస్తూ 
ఎంత అలిసిపోనీ 
ఆశకు చమురు పొసే ఆ సైనికుడు 
ఎవరు?

Thursday, September 15, 2016

ఊసుపోక - 6

If you want to get rid of Lazyness:

Doesn't matter you like it or not continue to do some good thing for you or for others for number of days..

May your interest will not allow you
May your body will not co-operate
May you have some other work
May someone is trying to interrupt

Doesn't matter you just keep going.. Your Lazyness will go away.

All that it needs is determination. But remember that the journey is not going to be smooth, till it reaches the end.

Wednesday, September 14, 2016

ఊసుపోక - 5వర్షపు రోడ్ల మీద వాహనాలు నడిపే వాళ్ళు కాస్త చూసి నడిపితే బాగుంటుంది..

వేగం గా వెళ్లిపోవడం లో ఎవరెవరి మీద నీళ్లు చిందిస్తున్నారనే విషయం చాలామందికి పెట్టనే పట్టడం లేదు.

ఉదా: ఒక ఇంటర్వ్యూ కి వెళ్లే వ్యక్తి మీద నీటి గుంటలో పడిన టైరు నీళ్లు కొట్టింది అనుకుందాం.. అది అతనికి ఎంత ఇబ్బంది?

నీటి నిల్వలు ఉన్న చోట రోడ్లపై కాస్త ఆచి తూచి వాహనాలు నడుపుదాం.. ! నిజానికి అలా నడపడం వాహన దారులకు కూడా శ్రేయస్కరం.

Tuesday, August 30, 2016

ఏం కావాలి???

మూడు కాలాలకు
గూడు

కంటి నిండా
నిద్దుర

తలా ఆంచుకునేందుకో
భుజం

తినేటప్పుడు పక్కన
తోడు

కావలిగా దేవుడున్నాడన్న
నమ్మకం

అప్పు , తప్పు, జబ్బు లకు
దూరం గా బతుకు

కాక
ఇంకేం కావాలి ??

Tuesday, July 26, 2016

ఆలోచన

గుర్రపు డెక్కల చప్పుడు లా...
పులి పంజాలా..

పదిహేను రోజులకోసారి,
సడి మార్చే
సంద్రపు అలజడి లా..

గాడి తప్పిన సంగీతం లా
గొడవ గొడవలా

గడువు దాటి ఊగుతున్న ఊపిరిలా
ఊర కుక్క లా
ఊరికే శబ్దం చేస్తూంది ...

ఒక్కో రాయేస్తూ
రాళ్ళగుట్ట అయి 'పోయిన' కొలను లాగ
గుట్ట కింద బిగబట్టిన
లావా లాగ
ఒకదాని మీద ఒకటి పోగవుతోంది

తన,
మన,
పర
భేదాలతో
కారు తొక్కిన కాలు లాగ
గిల గిల కొట్టుకుంటోంది

Wednesday, July 20, 2016

ఊసుపోక - 4

చేతికందే ప్రతిదీ ప్రసాదంలా/అనుగ్రహంలా ఎందుకు తోచదో..?
అలా తోస్తే బావుణ్ణు ..

Sunday, July 17, 2016

ఊసుపోక - 3

భాధ గాని 
భయం గాని 
చెప్పుకోవడానికొకరుండాలి 

లేకపోతే 
కనీసం నచ్చజెప్పుకోవడం తెలిసుండాలి 

Tuesday, July 12, 2016

Lost in IDENTITY ?!,.

కలి వలనో
ఆకలి వలనో
ఖాళీ వలనో
కడుపు రగిలినందు వలనో

పరిచయాలకోసమో
పోలికల కోసమో
కలలు,
పొలిమేరలు దాటడం కోసమో

ఇంటితో
గుంపుతో
ఊరితో
భాషతో
మతంతో
అభిమతంతో

ముడిపడి
పడి పోతున్నట్టనిపిస్తోంది 

Tuesday, June 21, 2016

ఊసుపోక - 2

ఉన్నట్టుండి ప్రపంచం ఆగిపోయినట్టనిపిస్తోంది
ఉన్నట్టుండి ఈ వేగపు ప్రపంచంతో నేను పోటీ పడలేననిపిస్తుంది
నిజానికి రెండూ నిజాలు కావు ..

Monday, June 13, 2016

ఊసుపోక - 1

చాల విషయాల్లో తెలీకుండా సమయం వృధా చేసుకుని..
చాలా కాలం తర్వాత తెలివి తెచ్చుంటే
నా మీద నాకే నవ్వొస్తుంది.

వృధా చేసిన సమయం గురించి తెలివోచ్చిందేమో గాని
సరిగ్గా సమయం గడపాలంటే యే చెయ్యాలానే తెలివి రాలేదు .. 

Monday, June 6, 2016

So Called .. పెద్దలు

మార్పు కోసం ..
కొత్త తూరుపు కోసం

పాటలు పాడితే పిచ్చి ఎత్తిందన్నారు
కధలు చెపితే వట్టి కధలే అన్నారు
ఆటలు ఆడితే వెర్రి చేష్టలన్నారు

గొంతు చించుకు చెపుదామని
చేసిన ప్రయత్నాలని
'కలి' వెర్రి తలలు వేసిందన్నారు

కట్టి,
నోటికి పలు మాట్లు మాట్లెట్టి
గదికి తాళాలు పెట్టి
ఏదీ చేతకాక పోతే
చంపి, సమాధి చేసారు
సంవత్సరీకాలకు సంబరాలు చేసారు


ఎందుకని అడిగితే
పట్టింపులు
పట్టుదలలు
సంప్రదాయపు 'దళా'లు
అంటూ
వాదన చేస్తారు

సామ దాన దండోపాయాలను ప్రయోగిస్తారు
ఏది కాక పోతే
'చేత కాక'
ఎంత దాక అయినా వెళ్తారు
సంబరాలు మాత్రం చేస్తూనే ఉంటారు

ఎంత కాలం చేస్తారు?
ఉన్నన్నంత కాలం చేస్తారు..!
అంతా ఏదో రోజు పోతారు..
దానికే ఇంత గాబరా పడిపోతారు..


Friday, May 27, 2016

ఒక చొక్కా తెచ్చుకున్నాను ... నేను మిగిలానువెంట తెచ్చుకున్నానో
లేక ముచ్చట పడి కొనుక్కున్నానో
లేక ఎవరైనా ఇచ్చారని వెంట తీసుకోచ్చానో ...
ఏమో ?
ఒక చొక్కా తెచ్చుకున్నాను ...

వేసుకుని తిరుగుతున్నాను.. చాలా కాలంగా
దాని మీద ఇష్టం పెరిగి
చక్కా నేను 'చొక్కా'ని పోయాను..
కొద్దిగా
కొద్ది కొద్దిగా
చిరగడం మొదలు పెట్టింది..


ఇంకా చుట్టూ పక్కల
రంగు రంగుల చొక్కాలు
కనపడ్డం మొదలు పెట్టాయి

కొన్నిటిని చూసి అలాగే రంగులద్దుకున్నాను
ఇంకొన్నిటిని చూసి అలమారలో దాచుకున్నాను

నెమ్మదిగా చొక్కాల సంఖ్యా పెరిగింది
అలమార పెరిగి పెరిగి ఒక ఇనుప రాతి గోడల భవంతి అంత అయ్యింది..

ఏదో భయం..
నా చొక్కాకి ఏం జరుగుతుందోని
ఏ చొక్కాని ఎవరెత్తికెళ్ళిపోతారోని

ఆలోచించి
ఆలోచించి
ఒక కాపలా వాడిని పెట్టాను
వాడికి జీతం ఇవ్వాలి కనుక
నేను అదనపు సంపాదన మొదలు పెట్టాను

కాలం
వెళ్ళిపోతోంది

అదనానికి సరైనన్నిసమస్యలు,
మధ్యలో చొక్కాకు వేసుకుంటూ వచ్చే కుట్లు
కాపలా వాడి అల్లరి
భవంతి మరమ్మత్తులు
అన్నీ
సర్వ సాధారణమై పోయినాయి..

చివరికి
చొక్కాలో కుట్లు తప్ప
గుడ్డ ముక్క మిగల్లేదు
ఇప్పుడు దీన్ని చొక్కా అనలేను

ఆ భవంతి చొక్కాని 'పాడై' పోకుండా ఆపలేదు
కాపలావాడు కనీసం చూడడు
వెంట తెచ్చుకున్న చొక్కాలు ఏ మాత్రం
ఈ మార్పు నుండీ నా చొక్కాని కాపాడలేవు

అయిపొయింది
కుట్లు విడిపోతున్నాయి..
దారపు తునకలు రాలి కింద పడిపోతే
ఊడ్చి భవంతి బయట పాడేస్తున్నారు..

ఇప్పుడు
చొక్కా లేదు
భవంతి లేదు
కాపలావాడు లేడు
కుట్లు కూడా లేవు

నేను మిగిలాను

===================

చొక్కా = శరీరం
చిరుగు = జబ్బు
కుట్లు = మాత్రలు
రంగులు = లక్షణాలు
భవంతి = నాది అనుకునే వైశాల్యం
కాపలా వాడు = జాగ్రత/భయం


Monday, May 23, 2016

పిచ్చితో 'కలిసి' పోతున్నానునిన్న వేసుకున్న చొక్కా
చిరిగిపోయింది

నోట వేసుకున్నకూడు
కింద నుంచీ వెళ్ళిపోయింది
మిగిలిన కూడు పాచి పోయింది
ఏదీ 'అలానే' ఉండిపోలేదు

రాతిరి చీకటి సూర్యుడితో వెళ్లి పోయింది
సూర్యుడి స్పర్శ సంధ్యతో చల్లారి పోయింది
ఏదీ 'అలానే' ఉండిపోలేదు

నీడ నిచ్చిన చెట్టు నేల రాలి
వెళ్లి పోయింది
ఎక్కడో బూడిదవ్వడానికి

చుట్టు పక్కల కొత్త చిరుగురులు మాత్రం
సంభందం లేనట్టు
ఎప్పుడు నీడ నిస్తామా అని ఎదురు చూస్తున్నై

జడన కూర్చిన పువ్వూ
దేవతార్చనకు చేర్చిన పువ్వూ
కోయక చెట్టుకు విడిచిన పువ్వూ
అన్నీ వాడి పోయాయి, కొంచెం అటు ఇటుగా
పోనీ..
కోసిన కత్తి వాడీ..???
"మిగల్లేదు ఏదీ.."

నిన్నటి ప్రశాంతత ఆకాశంలో నేడు లేదు
నేటి ఉదృతి రేపు కనపడదు
వెళ్ళిపోతుంది ఎక్కడికో..

చరిత్ర పుస్తకాలన్నీ
'జరిగి' పోయాయని చెపుతున్నాయి
భవిష్యత్తు పై ఆశలన్నీ
ఈరోజు "గడిచి" పోతుందని కోరుకుంటున్నాయి

ఎక్కడ చూసినా
ఒకలా ఏదీ లేదు..
నిలబడి లేదు ఏదీ, 'కదిలి' పోతోంది
ఎక్కడో 'కలిసి' పోతోంది

జనించి,
గడించి,
గతించి పోతోంది.. జగత్తు

ఇంత జరుగుతున్నా.. కళ్ళ ముందే
కల్ల అనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ
'నేను మాత్రం' మిగిలిపోతానన్న
పిచ్చితో 'కలిసి' పోతున్నాను ..Monday, May 16, 2016

ముసలి ప్రాణం వెళ్ళిపోయింది..

మండు వేసవిలో ఉంది, 'గుండె' 
బలవంతం గా కొట్టుకుంటున్నట్టు, ఎప్పుడో అప్పుడు ఆగిపోఏట్టు 

మండువా లోగిలి లాగుంది, 'మనసు' 
ఏదైనా వచ్చి మీద పడేట్టు, ఇప్పటికే పడీ పడీ శిధిలమైనట్టు 
 
ఆకలి మందు లేక మైకమౌతోంది, 'తనువు' 
వేసే అడుగు ఈడుస్తున్నట్టు, ఇప్పుడో అప్పుడో పడిపోఏట్టు 

శాశ్వత నిద్రకు సన్నద్ధమౌతోంది, 'నేను' 
గతం అఘాధమై, అనుభవాలు గాయాల పూలమాలలై,మనుషుల జ్ఞాపకాలు చారికలై,
సింహావలోకనం జరుగుతోంది. 
చెంపపై కన్నీరు జారుతోంది. 
ఇది భాధలకు సెలవనుకుంటూ .. 
ఓపిక లేని నవ్వు పెదాలకు చేర్చి.. 
ఎక్కడికెల్తోందో తెలీకుండా వెళ్ళిపోయింది.. 
 

Thursday, April 21, 2016

గురువుకు లేఖ

పంపించెయ్యండి చీకటిని నా నుండి 
కట్టి మీ ఛాయలకు తీసుకుపోండి 
తరిమికొట్టండి నేను అనే వాడిని
మీకు మోకరిల్లుతున్నాను 
మీకు మోకరిల్లుతున్నాను

పోలికలు సరిపోవు, ఎంచి చూపుతామంటే నాలా మరొకరిని 
అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుంటాను.. అలాగే 
కాస్త అటు ఇటుగా అయినా నడవను 
మీ కాలి అడుగుల గుర్తెరిగి 
మీ మాట జ్ఞప్తికి పెట్టి 

హాస్యాస్పదమనిపించినా,
నా చేతుల్లో లేని నేను 
నన్ను మీ చేతుల్లో పెడుతున్నాను.. 
సరి లేని ఈ వంకర బుద్ధికి దిక్కు చూపండి
మీకు మోకరిల్లుతున్నాను 
మీకు మోకరిల్లుతున్నాను

మాట దాటక ఉండే 
వినయం లేదు 

మీ పాటే పాడుకుంటాను 
పదే పదే మీ పేరే చెప్పుకుంటాను 
అనే భక్తీ నాది కాదు
అందుకే 
మీకు మోకరిల్లుతున్నాను 
మీకు మోకరిల్లుతున్నాను 

ఎందుకేడుస్తున్నాడో తెలియని 
పసి పాపడి ఆర్తిని.. విని 
పరిగెత్తుకు వచ్చే అమ్మలా నన్ను దగ్గరకు తీసుకోండి 
మీ కారుణ్యపు దృక్కుల నుండీ నన్ను దూరం కానీకండి 
మీకు మోకరిల్లుతున్నాను 
మీకు మోకరిల్లుతున్నాను 


 

Monday, February 1, 2016

దూరంగా.. అన్నిటికీ దూరంగా


సూర్యుడు శుభోదయం చెపుతుంటే విని ఎన్నాళ్ళయింది
వర్షపు చుక్క
మట్టి వాసన మనని ముట్టి ఎన్నాళ్ళయింది..
చలిమంటలు కాచి ఎన్నాళ్ళయింది..
ఎన్నేళ్ళయింది
ఈ పరుగు మొదలయి
దూరంగా..
అన్నిటికీ దూరంగా

పరుగు
ఒకటే పరుగు..
నవ్వుకు దూరంగా
నచ్చిన వాళ్లకు దూరంగా
పలకరింపుకు దూరంగా..
ప్రతి మనిషికీ దూరం గా..
పరుగు
ఒకటే పరుగు.. దూరంగా

కేవలం నీడలు కదులుతున్నాయి
మనుషులు లేరు అనిపిస్తుంది
గొంతుకలు ఉన్నాయ్
జీవం లేదనిపిస్తుంది
చూసే ప్రతిదీ టీవీ చానెల్ మారినంత వేగంగా కదిలి పోతుంటుంది
అనుమానమే పెద్ద నమ్మకమై నడిపిస్తుంది.. పరిగెట్టిస్తుంది
దూరంగా..
అన్నిటికీ దూరంగా

పెదవి అంచులు పైకి జరిగి ఎన్నాళయిందో
ఆఖరి సారి ఒక మనిషిని నాలో ఎప్పుడు కలుపుకున్నానో
నాలా నేనేప్పుడున్నానో
నాకే గుర్తు లేదు
బిగ్గరగా నవ్వు కుందామంటే
నేను తప్ప మరే కారణం కనపడ్డం లేదు
అయినా ఆపడం లేదు ఈ పరుగు
నన్నొదిలి దూరంగా
అన్నిటికీ దూరంగా

ఏం చేద్దామన్నా సమయం లేదు
దేనికో తెలీదు

ఓ ప్రయత్నం చేద్దామనే కదలిక మాత్రం రాదు
ఎందుకో అర్ధం కాదు

అయినా పరుగులు తీసే రధం మాత్రం
ఆగడం లేదు..
వెళ్తోంది దూరంగా
అన్నిటికీ దూరంగా

Monday, January 4, 2016

నలిగే బుర్ర నాలుగు రకాలుగా ఉంది

ఒక మత్తు..
ఉన్న ఆలోచనలను సాగనివ్వదు
కొత్తవాటిని కంచె దాటి రానివ్వదు
స్తబ్దంగా
నిరాసక్తతగా
కదలనీక ఆపేస్తూ ఉంది

పోనీ అది నిశ్చల తత్వమా?
అదీ కాదు.. 
దాన్ని ఏమని పిలవను?

సమాధాన పడదు మనసు ఒక పట్టున
సమాధానమివ్వదు దేనికీ టక్కున
అస్పష్టంగా ప్రశ్నలు నేస్తూ
అనాలోచితంగా ఉంటూ
అర్ధరహితం గా లంకెలల్లుకుంటున్న 
ఈ స్థితి
తెలియని తనాన్ని తెలుసుకోవటమా ?
ఎంత మాత్రమూ కాదు..
దీన్ని ఎలా వదిలించుకోను?

పధం దొరకక
పదం పడక
అసంత్రుప్త్యావస్తతలో 
అసంపూర్ణంగా
సాగే ఈ పయనం
ఏదోరోజు అనంతాన్ని కలుసుకుంటుందా ?
ఏమో తెలీదు ..
దీన్ని ఎలా అర్ధం చేసుకోను?
ఉన్నది ఉన్నట్టుగా ఎలా తీసుకోను?