Wednesday, November 7, 2012

నిన్నటి రోజు..!

..ఒక జ్ఞాపకం..
ఒక గడిచిపోయిన నిజం..
నిన్నటి రోజు..!

చెప్పలేని సంతోషం
చెప్పుకోలేని కష్టం
రెండూ భాగాలే అందులో..

ఎలా చూసినా ...!
వెళ్ళిపోయిన ఆరోజు ఎందుకో
ఇంకా గొప్పగానే కనపడుతోంది..
అది నాదేనని ఇంకా గర్వం గానే ఉంటుంది..

ఏం చెప్పను..?
ఎంత చెప్పినా ఇంక దాచుకోలేను
ఎంత అరిచినా మర్చిపోలేను

ఆరోజుకి...
ఈ రోజుకీ నేనంటే ఇష్టం.. కాబోలు..
అందుకే మళ్ళీ మళ్ళీ వెనక్కి పిలుస్తుంది..

చిన్న పాపలా...
అందమైన అమ్మాయిలా...
అమ్మలా

హితునిలా..
తిరుగుబాటుదారునిలా
దేవుడిలా...

వధువులా
క్రతువులా
నా ఏకైక శత్రువులా





3 comments:

  1. చాలా చాలా చాలా బాగుందండి... నాకు బాగా నచ్చింది...

    >>ఆరోజుకి...
    ఈ రోజుకీ నేనంటే ఇష్టం.. కాబోలు..
    అందుకే మళ్ళీ మళ్ళీ వెనక్కి పిలుస్తుంది..<<
    ఇది ఇంకా సూపర్

    ReplyDelete
  2. ఆదిత్య బాబు. ..
    నేనూ ఎందుకైనా మంచిదనే ఈ పోస్టు రాసా.. హ హ హ..

    థాంక్స్ చైతన్య గారు..
    ఈ కవితకు ఆత్మ అదే .. మీరు సరిగ్గా పట్టేశారు

    ReplyDelete