Thursday, June 21, 2012

ఇది కదా జీవితం..!


 
 
కొంత కాలం
కొన్ని  నిజాలు కొన్ని అబద్దాలు..
కొన్ని అనుభవాలు..
కొన్ని సన్నివేశాలు
నిండిన కొంత మంది మనుషులు..
ఇదేగా జీవితం..


కొంత కాలం
కాసిన్ని నమ్మకాలు..
లోపల కొన్ని భయాలు..
అణచలేని ఆవేశాలు..
నవ్వుకునేంత అమాయకత్వం
దాచుకోలేనంత ప్రేమ
ఇదేనేమో జీవితం..

ఎప్పటికీ 
ఒక నవ్వు..
ఒక తోడు..
కొంత ఆనందం..
కాసింత సంతృప్తి..
అప్పుడప్పుడూ.. ఎప్పుడూ.. నేను లేని నేను..
ఇది కదా జీవితం..!




*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

3 comments:

సీత said...

nice....chala bagumdi

మధురవాణి said...

So true.. అంతేగా మరి జీవితం!

రాజశేఖరుని విజయ్ శర్మ said...

అన్ని సందర్భాలలోనూ, అన్నిటా నీండి ఉన్న నా రామయ్యా! అదే జీవితం :)

చాలా బాగుంది.