Monday, June 11, 2012

నువ్వు నాకు.. ఒక వ్యసనానివి..







నువ్వు నాకు..
ఒక అందమైన సమస్యవి..

చేరాలనిపించే నరకం..
కావాలనిపించే వ్యసనం..
చెయ్యద్దనుకునే ఒక తప్పు..
నువ్వే నాకు..

రావాలనిపించే వేసవి
నేనెదురుచూసే చీకటి..
వద్దనిపించే ధ్యాస ..
నాలో ఈ ద్వంద్వం
నీవల్లే..

వడగళ్ళ వాన
నిశ్శభ్దపు భంగిమ
అర్ధం తెలియని మననం 
తప్పుకోలేని వాస్తవం
తప్పని ఇష్టం
ఇదే నాకు నువ్వు..

వద్దు వద్దు అనుకునే..నువ్వు ..
వద్దనుకున్నపుడల్లా దగ్గరగా అనిపిస్తావు..

కావాలనిపించే నువ్వు..
అంతకు అంత దూరంగా నిలబడతావు..

ఒక "అవును".. ఒక "కాదు" మధ్య..
ఎప్పుడూ నువ్వే కనిపిస్తావు..

ఒక తట్టుకోలేని ఆనందం..
ఒక తరమలేని భాధ..

నాతో..
నాలో..
నేనై..
ఒక నువ్వు..


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

7 comments:

సాయి said...

:)

Padmarpita said...

"ఒక "అవును".. ఒక "కాదు" మధ్య..
ఎప్పుడూ నువ్వే కనిపిస్తావు..
ఒక తట్టుకోలేని ఆనందం..
ఒక తరమలేని భాధ..
నాతో..
నాలో..
నేనై..
ఒక నువ్వు.."
ఎంత అద్భుతంగా రాసారండి! అభినందనలు

భరత్ said...

తన ప్రియురాలి గురించిన ఆలోచనలు తనకి ఒక వ్యసనం గా మారినపుడు ఒక అబ్బాయి పడే తపన ని చక్క గా వర్ణించారు...

శివ చెరువు said...

సాయి గారు. పద్మర్పిత గారు.. ధన్యవాదాలు..

భరత్ గారు.. ధన్యవాదాలండి.. అసలు విషయం ఏంటంటే.. ఎంత కాదనుకున్నా ఏదో ఒక పని లో కూడా మళ్ళీ ఆలోచన వస్తూనే ఉంటుంది.. which runs from subconscious mind.. that can not be stopped.. still it is a amazing feeling.. which makes that someone's presence with us always.. .. అందుకే.. వ్యసనం అన్నాను..

:)

భరత్ said...

you are absolutely rite. We want to stop thinking about the gal, but in sub conscious mind we still like the thoughts of her...

చైతన్య said...

చాలా బాగుంది శివగారు... మీ స్టైల్ లో సింపుల్ గా స్వీట్ గా ఉంది :)

మధురవాణి said...

Absolutely brilliant.. Just loved it!