Wednesday, May 23, 2012

నీవు లేని నేను.. నేను లేని నీవు..







ఎటువంటి ప్రమాద హెచ్చరికలు లేవు..
ఏదో జరుగుతుందనే లెక్కలూ లేవు..
మరి ఎందుకిలా అయ్యింది?
మనం ఎందుకు విడిపోయాం..?

ఎటువంటి స్పర్దలు లేవు..
వెనుక ఏదో దాచుకున్న పరదాలూ లేవు..
మరి ఏం జరిగింది?
ఒకరికొకరు ఇలా లేకుండా పోయాం?

పెంచిన దూరం..
ఏమిచేసుకోను?

మిగిల్చిన శోకంలో
ఏమైపోను?

పగిలిపోయిన అద్దానికి..
కాలిపోయిన జీవితానికి ..
మిగిలిపోయిన గురుతులను
ఏమని దాచుకోను?

మూసుకు పోయిన ఖంఠానికి
కూలిపోతున్న ఈ శిధిలానికి
కొత్తగా ఇంకా..
ఏం మెరుగులు కోరుకోను..?

వెళ్ళిపోతున్నానని ఒక్కమాట అనలేదే?
వస్తున్నావా అని ఒక్కసారైనా అడిగి చూడలేదే?
నువ్వు!!

ఈ నరకం చూడలేక..
ఈ శవాన్ని ఉరి తీయలేక!
నీవు లేక..
నాలో నేనే మాట్లాడుకుంటున్నాను
ప్రశ్నలు వేసుకుని సమాధానాలు దొరకక నన్ను నేనే నిందించుకుంటున్నాను..

నీవు లేని నేను..
ఇలా వున్నాను..
నేను లేని నీవు
ఉన్నావో లేదో?
నాకు తెలియదు..


బాగున్నావని అనుకోని.. స్వాంతన చెందనా?
ఏమయ్యావో నని మరింత మధన పడనా.. ?
ఇంతకంటే బాధకు నిర్వచనం ఉంటుందా?

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

8 comments:

  1. హుమ్మ్.. చాలా భారంగా అనిపించిందండీ..

    ReplyDelete
  2. మధుర వాణి గారు..
    నా బ్లాగులో ఇలా బాధకి (negative) సంభందించినవి రాయద్దనుకున్నాను.. చాలా కాలంగా రాసినట్టుగా కూడా.. గుర్తులేదు :)
    ఎలాగో కలం కదిలింది. ఎందుకో అక్షరాలు అలా పరిగెత్తాయి..

    ReplyDelete
  3. నేను అదే అందమానుకున్నాను... ఇటువంటివి ఈ మధ్య రాసినట్టులేరు కదా అని... మీరు పాజిటివ్ గా రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం

    ReplyDelete
  4. తప్పకుండా చైతన్య గారు..

    ReplyDelete
  5. బాగున్నావని అనుకోని.. స్వాంతన చెందనా?
    ఏమయ్యావో నని మరింత మధన పడనా.. ?
    ఇంతకంటే బాధకు నిర్వచనం ఉంటుందా?



    ఈ వ్యాక్యాలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  6. శివ గారూ,
    రాయొద్దని నా ఉద్దేశ్యం కాదు. మనసుని కదిలించేంతగా కమ్మేసింది భావం. అన్నీ రకాలూ రాస్తూ ఉండండి. అసలా మాటకొస్తే వేదనే మరింత అందంగా కవిత్వంలో ఒదిగిపోతుందేమోననిపిస్తుంటుంది నాకైతే.. :)

    ReplyDelete
  7. చాలా బాగుంది. మనసుకు హత్తుకునేలా ఉంది.

    ReplyDelete