
వెన్నెలా ఎప్పుడూ ఉండదు..
సూర్యుడు ఎప్పుడూ చూస్తూనే ఉండడు..
చలికి చలేసినప్పుడు తప్ప రాదు..
వర్షమా..! వచ్చి పోయే అతిధి అంతే..
వీటితో పాటూ శాశ్వతం కానివెన్నో..!
ఇసకను వొత్తిన అడుగులూ
అలుపూ..
మజిలీలు
దూరాలు..
పరిచయాలు..
పరిస్తితులూ..
సంబరాలు..
సంబారాలు..
అన్నిటినీ స్పృశించీ కదులుతూ ఉంటుంది.. ఈ ప్రయాణం.
కొన్ని తీరాలు కలిసినట్టే ఉంటాయి..
కానీ ఎక్కడా కలవవు..
అలానే కొన్ని ప్రయాణాలూ మొదలవుతాయి..
ముగింపు తెలియదు వీటికెక్కడో..
ఆ తెలియని తనమే
నేటిని నిదురపుచ్చుతుంది
రేపటికి మేలుకొలుపుతుంది..
Thursday, October 13, 2011
ముగింపు తెలియదు వీటికెక్కడో..
Posted by శివ చెరువు at 3:18 AM
Subscribe to:
Post Comments (Atom)

6 comments:
మీ కవిత చాలా బావుందండీ!
http://creativekurrodu.blogspot.com/2011/10/2_14.html
nice
nice poem :)
ఆ తెలియని తనమే?
మనిషిని బ్రతికిస్తుంది,
నిదుర పుచ్చుతుంది,
తట్టి లేపుతుంది,
ఆపుకోలేని దుఃఖానికి ఊరటనిస్తుంది!
ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉరకలేయిస్తుంది.
అదే........అదే........అదే...
నమ్మినా నమ్మకున్నా దైవం!
బాగుంది!
Post a Comment