
నాయకుడా..
నాయకుడా..
ఒకటే..
కష్టాలు..
కష్టాలు..
కష్టాలు..
ఆరుస్తావా.. బాధ తీరుస్తావా..?
లక్షలు పోగు చేసుకుంటూ నువ్వు..
అక్షరాలు లేక నా పిల్లలు
తప్పులను కప్పుకుంటూ.. ఒప్పుల అతుకులతో నువ్వు..
ఎప్పుడు చినుగులు పడుతుందోనని వేసుకున్న బట్ట భయంతో.. నా యాలి
విద్యుత్ బిల్లుల పని లేని పేద్ద.. పేద్ద.. ఇండ్లలో నువ్వు...
చీకటి నిండిన గూడులో నేను
ఎక్కడికెళ్ళినా పది.. పాతిక మంది మూకతో నువ్వు..
అరక్షతో వీధిలో నేను..
టీవీలలో ఠీవిగా ప్రచారంలో నువ్వు..
కనీస గుర్తింపు కార్డు దొరకక నేను..
సర్కారు ఇచ్చే వాహనాలలో విహారానికి నువ్వు..
కర్చులకు జడిసి అటు ఇటూ కదలలేని నేను..
మిద్దెల మీద మిద్దెలతో ఇంకా విత్తు మత్తులోనే నువ్వు..
పన్నులకు.. నీ పంపకాలకు, .. ఇంకా పంతాలకు అప్పుల పాలైన నా కుటుంబం
పొరపాటున కాలం చెల్లి.. వెళ్లి పోయావా నువ్వు.. ?
బందులు.. పనికిమాలిన సెలవులు.. బలవంతపు అంజలి ప్రకటనలు...నాకు
నువ్వు ఉన్నా పోయినా ..
నష్టం నాకే ..
ఎందుకయా నువ్వు..?
ఉన్నది?
ఎవరికీ ప్రతినిదివి నువ్వు..?
నాకా?
నిన్ను ఎన్నుకుని నేను చేసిన తప్పుకా?
.
.
అయివుంటుంది..
అందుకే.. ఈ పశ్చాతాపం..
ఈ శిక్ష..
అవునూ..!
నువ్వు కాక పోతే.. మరొకడు వచ్చాడే అనుకో?
నా పిచ్చి గాని..
వాడు నన్ను ఉద్దరించేవాడని నమ్మకమేముంది..?
పట్టించుకోకు నేనన్న మాటలు..
ఏవో ప్రేలాపనలు..
చిన్నప్పుడు పెద్దవాళ్ళెవరో చెప్పారు..
తెలియని దైవం కన్నా.. తెలిసిన దెయ్యం మేలట
నేను మారను..
నువ్వూ మారకు..
మనమింతే..
మనకింతే..
*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.
Saturday, October 8, 2011
నిన్ను ఎన్నుకుని నేను చేసిన తప్పుకా?
Posted by శివ చెరువు at 8:45 PM
Subscribe to:
Post Comments (Atom)

3 comments:
good one siva
రాజ్యాంగంలో లోటు! మననుఏలేదిమనమెన్నినవారా......? మెజారిటీ ప్రాదిపతిక!
100 ఓట్లలో 60 మంది ఓటేస్తే ఆ ఓట్లని ముగ్గురు పంచుకుంటే అందులో5చెల్లకుంటే గెలిచినవారికి 35 ఓడినవారికి 20 ఓట్లు పడితే మిగతా 65 మంది ఓట్లు విలువ లేనివే! ఇదే స్థితి రాష్త్రంలోనైనా కేంద్రంలోనైనా! ఇక మిగిలింది పాలితులకి కడివెడు కన్నీళ్ళే!
గుర్తింపు కార్డు (ఆధార్)దరఖాస్తు సమర్పించేందుకు కుక్క తిరుగుడు తిరుగుతున్నా
అందుకునే నాధుడే లేదు!
chala baga vishyani cheparu..chala bagundi..
Post a Comment