
వర్షాలతో సరిగ్గా నడవడానికి కూడా లేకుండా రోడ్లు..
ఎక్కడానికి లేకుండా బస్సులు..
అవసరానికి లేకుండా కరెంటు..
అవకాశాలు పెరిగిన ఆటోవాలాలు..
జీవనాధారం పోగూడని ఉసూరుమంటూ ఉద్యోగస్తులు..
సెక్యూరిటీ లేని సెక్యూరిటీ గా పోలీసు సోదరులు
ధరలు పెరిగి నెత్తి నోరూ బాదుకుంటున్న సామాన్య జనం తో..
మీరు బాగున్నారా ? అంటూ దూరవాణి ప్రశ్నలు..
ఆశలు ఆశయాలు..
కలిసిలేక.. కలవలేక..
తినడానికి..
వినడానికి..
ఉండడానికి..
ఊరట చెందడానికి..
భయానికి..
భాద్యతకి..
తరుణోపాయంలేక..
తప్పక..
బ్రతకడానికి..
మొత్తంగా హైదరాబాదు క్షేమంగానే ఉంది..
Monday, October 3, 2011
హాపి హైదరాబాద్...
Posted by శివ చెరువు at 10:58 PM
Subscribe to:
Post Comments (Atom)

3 comments:
narakam hyd lane untundi tappadu :)
ఇదే! నేటి రాష్ట్ర స్థితి! 'అన్నపూర్ణ' దుస్థితి! అసహాయ స్థితిలో యంత్రాంగం,ఇనుమడించిన ఉత్సాహంతో తంత్రాగం!
kotha vishyalu narchukovadaniki..mundu untundi alaga narakam ela untundo chupinchataniki kuda munda vuntundi
Post a Comment