కావాలట
కావాలట
స్వాతంత్ర్యం కావాలట..
ఏడ్చారు..
గుండెలు బాదుకున్నారు..
పోరుకు పోయారు..
పోయారు..
మొత్తానికి తెచ్చుకున్నారు..
వద్దట..
వద్దట
దాస్యం వద్దట..
తపించారు..
తపస్సు చేసారు..
తన్నుకు చావద్దని..
తలఎత్తుకుని అడ్డుగా నిలబడ్డారు..
మొత్తానికి విముక్తులయ్యారు..
తరువాత ఆ కష్టాన్ని వారసులని చెప్పుకునేవారు అంది పుచ్చుకున్నారు..
ఇక్కడ..
ప్రతి ఒకడూ హిరణ్యకసిపుడే..
ప్రతి ఒకడూ రావణుడే..
ప్రతి ఒకడూ భస్మాసురుడే..
ప్రతి ఒకడూ దుర్యోదనుడే..
ప్రతి ఒకడూ కలి పుత్రుడే..
వీరి ఆద్వర్యంలో ఇపుడు..
ఆత్మ సాక్షిని కాలబెట్టే శ్మశాన వాటికల నిర్మాణం
నిర్విగ్నంగా కొనసాగుతోంది.
అంతర్ముఖంలో రాక్షస కోణపు నిర్యాణం
నిత్యం భగ్న పడుతూనే ఉంది..
తరానికి తరానికి అంతరాలు
పెరుగుతూనే ఉండేట్టు ఏర్పాట్లు చేసారు ..
నిస్సిగ్గుకు నాగరికత అనే
నామ కారణం చేసారు.
తప్పు ఒప్పులకు తేడాలను చూపే
త్రాసులో తక్కెడలను తుంచి వేసారు..
కర్తవ్యానికి ఓ రోజు సెలవు కోసం
స్వ'తంత్ర' వేడుకలు ఏర్పాటు చేసుకున్నారు
విలువలు వదిలి విహరించడానికి
సత్యానికి బిగిస్తున్న ఉరిని సరి చూడడానికి..
అభివృద్ధి పేరుతో నాశనం తెచ్చుకోవడానికి..
కాలానికి
కలానికి
నడకకు
నగ్నతకు
వాక్కుకు
వారసులకు
స్వాతంత్ర్యం ఇచ్చేస్తున్నారు..
స్వేచ్చగా
స్వేచ్చగా
స్వాతంత్ర్యం ఇచ్చేస్తున్నారు..
Tuesday, August 23, 2011
స్వేచ్చగా స్వాతంత్ర్యం ఇచ్చేస్తున్నారు..
Posted by శివ చెరువు at 10:10 PM
Subscribe to:
Post Comments (Atom)

3 comments:
"ఆత్మ సాక్షిని కాలబెట్టే శ్మశాన వాటికల నిర్మాణం
నిర్విగ్నంగా కొనసాగుతోంది. "
"నిస్సిగ్గుకు నాగరికత అనే
నామ కారణం చేసారు. "
మొదలైన వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి. చక్కటి పదాల అమరిక వ్యక్తమైనది. చాలాబాగుంది కవిత. చాలా రోజులు తరువాత ప్రేమ మీద కాక సమాజం మీదకు మళ్లింది మీ దృష్టి. ఇది అభిలషనీయం.
"అసత్యానికి బిగిస్తున్న ఉరిని సరి చూడడానికి.."
ఇది "సత్యానికి బిగిస్తున్న.." అని ఉండాలేమో!
చక్కటి కవిత అందించినందుకు మరో సారి అభినందనలు.
విజయ్ శర్మ గారు..
అసత్యమును సత్యముగా సవరించాను..
నా ప్రయత్నమునకు మీరు అందిచే ప్రోత్సహమునకు ధన్యవాదములు..
సామాన్య జనం ప్రతినిధిగా మనసుకి తగిలిన గాయాన్నిమాటల్లో (గీతాల్లో) పలకటం సహజమే!
కానీ ఈ జనారణ్య రోదనం వినిస్పంచించేది ఎవరు? క్రూర మృగాల బారి పడకుండా ఎవరి పరుగువారిది. ఎవరి స్వార్ధం వారిది!
Post a Comment