Monday, July 18, 2011

అదే అర్ధం కాని ..నన్ను నేను కనుగొంటున్నాను





నిరంతరం అంతరాయం లేని..
ఒక శబ్దం .. ఒక హోరు.. లోపల నుండీ..
ఆ సముద్రం యేమని చెపుతోందో.?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని సంగీతం వినపడుతోంది..

అలుపు, విసుగు లేని ..
ఓ స్పర్శ.. ఓ పలకరింపు.. లోపల నుండీ..
ఆ సముద్రం ఎందుకు ఓదారుస్తోందో?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని చనువు దగ్గరగా అనిపిస్తోంది..

ఆగిపోవడం ఆగడం లేని
ఆ నడక.. ఆ నాట్యం.. లోపల నుండీ..
ఆ సముద్రం ఎటువైపుకు పయనిస్తోందో?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని దృశ్య కావ్యం గోచరిస్తోంది..

తిరగపడ్డ పడవలు
విసుగుపడ్డ సుడులు
ఎగసి పడే కెరటాలు
కాన రాని నిధుల శిధిలాలు
నురగలు కడిగే అరుగులు

తెలుసుకుందామని ప్రయత్నిస్తే..
నన్ను నేను కనుగొంటున్నాను





*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

4 comments:

మధురవాణి said...

బావుందండీ.. మనసనే మహా సముద్రాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట! :)

మనసు పలికే said...

అద్భుతంగా రాసారు. నాకైతే చాలా బాగా నచ్చింది శివ గారు:))

రాజశేఖరుని విజయ్ శర్మ said...

మీ అంతరంగపు అలల సవ్వడిలో ఆర్ద్రతేదో గోచరిస్తోంది. మరింత తపించండి మిత్రమా! అద్భుత రత్నాలకు నిధి అది. త్రవ్వేకొద్దీ వెలికి వచ్చే నిధులెన్నో.

శివ చెరువు said...

thanks to all :)