Sunday, July 10, 2011

అందుకే మనమధ్య ఏ మాటలూ మిగలలేదు







'నేను' అని అనుకున్నపుడల్లా..
'నీవు' అని తెలుసుకుంటున్నాను..
'నా' జాడ తెలియనపుడల్లా
'నిన్ను' వెతుకుతున్నాను..

నిలుపలేను నిమిషమైనా నా నడక
నీతో ..

క్షణ కాలం కనపడవు ఏమో?
గుండె చప్పుడు ఆగిపోయినట్టవుతుంది నాకు

మరి కాసేపటికి ఎదురవుతావా?
వేల సంవత్సరాలకు ఊపిరి పోసినట్టవుతుంది మళ్ళీ..

ఎన్ని లక్షల సార్లు జన్మించానో
ఎన్ని వేల కోట్ల ఊహలకు ఊపిరినిచ్చానో
నీవే నిండుగా..

ప్రతి ఉదయం రంగుల వెలుగై నిలిచింది.
చీకటికి ఎప్పటికీ సెలవే మిగిలింది..
నీవే నిండగా..

నిజముగా నిజం..
నువ్వు మాత్రమే నా నిజం..

నీతో నే చెప్పని ఈ మాటలు..
'నీ' 'నా' 'మన' దగ్గరతనంలో నీవెప్పుడో తెలుసుకున్నావన్న సంగతి నాకూ తెలుసు..

అందుకే మనమధ్య ఏ మాటలూ మిగలలేదు


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

2 comments:

Anonymous said...

chala bagundi...

మధురవాణి said...

చాలా చాలా బావుందండీ..ఆరంభం, ముగింపు మరింత బావున్నాయి.. ఒక మనసు భాష మరో మనసుకి అర్థమైపోతున్నప్పుడు ఇంకా మాటలతో పనేముంది! :)