Tuesday, June 28, 2011

అన్నిటికన్నా ఉత్తమమైన జ్ఞాపిక..





కాసేపు ఏకాకిలా అనిపిస్తాను..
కాసేపు ఒక్కడినే కాను అని గుర్తు చేసుకుంటాను..

కాసింత నిద్ర..
కాసేపు మెలకువ..
కాస్తంత చీకటి..
అంతలోనే వేకువ..
అన్ని అధ్యాయాలను కూడుకుని ఇదే నా జీవితమని తెలుసుకుంటూ ఉంటాను.

తల ఎత్తి పైకి చూసినప్పుడల్లా..
కోరుకునే రేపటి రోజు ఎంతో ఎత్తులో కనపడుతూ ఉంటుంది..
మొదటలో తడపడినా ..
నెమ్మది నెమ్మదిగా ఆకాంక్షలకు ఆచరణలను జోడించి
నిచ్చెనను తయారు చేసుకుంటాను.. పై పైకి వెడుతుంటాను..

మధ్య మధ్యలో ..
ఆశలు ఆంక్షల దెబ్బలు తగిలి జబ్బు పడతాయి..
తిరిగి తేరుకున్నాక తూరుపుని చూస్తాయి..
అటుపై..
అటువైపే పయనిస్తాయి..

పయనపు ప్రారంభంలోని దూరాలు..
ఆఖరుకు చేరువవుతాయి..
చేరుకున్న శిఖరాగ్రాలు..
చుట్టూ ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తాయి..
సాధించిన విజయాలు..
ప్రపంచానికి నన్ను కొత్తగా పరిచయం చేస్తాయి...

అన్నిటినీ మించి..
నాకు నాపై గల నమ్మకం గొప్ప తృప్తినిచ్చి అభినందిస్తుంది..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

1 comment:

Ramki said...

కలవార పెట్టింది మీ కవిత
కనిపిస్తోంది కవిత రాయడానికి మీరు పడిన కష్టం
అర్థమైంది మరిచిపోలేని జ్ఞాపిక ఏమిటో ..
ఎవరికైనా మర్చిపోలేని జ్ఞాపిక వారి జీవితమే ..