Tuesday, June 7, 2011

కానీ.. నేను "ఇది.." అవునో కాదో అని..!




నోట్ల కట్ట వెనకో..
విలాసపు జీవన విధానాల కొరకో..
నన్నెవరో చూస్తున్నారనో..చూస్తారనే అప్రమత్తత వెనకో..
నేను అని..నన్నేమనుకుంటున్నానో దాని జాగ్రత్త కొరకో..
నేటి భయం వెనుకో.. రేపటి కొరకో..

యంత్రమల్లె..
మంత్రం వేసిన వాడికి మల్లె..
ఏదో ఏదేదో చేసుకు పోతుంటాను..

కాంక్షలు నావి..
కారణాలు నావి..
కొత్త కొత్త దారులు నావి..
కాంక్షల నావను అందుకోవాలని పరుగులే నావి..
కారణాలు వెతికే కొత్త దారులే నావి..
కొత్త దారులకు కారణాలే నావి..

తడబడుతుంటాను..
ఒప్పులని ఒప్పించేందుకు.. ఓపిక దారపోస్తాను..
ఏదో ఏదేదో చేసుకు పోతుంటాను..

కానీ..
కానీ..
అప్పుడప్పుడూ
అప్పటికప్పుడు..
ఒకింత అయోమయం
కాస్తంత అసంతృప్తి..
నన్ను కప్పేసినప్పుడల్లా..
అనుకుంటూ ఉంటాను..
నేను "ఇది.." అవునో కాదో అని..!

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

2 comments:

రాజేష్ జి said...

బాగుంది సోదరా

అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. రేపు తీరిగ్గా చదివి వ్యాఖ్యానిస్తా :)

సత్య said...

మనసుకు హత్తుకుంది.....
చాలా బాగారాసారు... అభినందనలు

సత్య