Wednesday, May 25, 2011

నేనొక డబ్బింగ్ పాట రాసాను.. హి హి హి.. మీ దగ్గర ట్యూన్ ఉంటే.. పాట కట్టుకోండి.. ఎంజాయ్.. హ హ హ...





నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం..
నాకు ఒక ఐస్క్రీం.. నీకు ఒక కూల్డ్రింక్..
చూసేవాళ్ళు కుళ్ళుకుంటే.. కడుపునింపుకుందాం..

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ.. (2)

ఇంత కాలము మనమేం చేసాం..?
నీకు నేను..నాకు నువ్వు.. దూరమున్నాం..
ఇప్పుడైతే మరి ఏం చేద్దాం..?
కలిసి ఉన్న ఒక్కో రోజు.. కలిసి తిందాం ..
దూరమున్నా.. దగ్గరున్నా...
ఎవ్వరైనా.. ఏమనుకున్నా..
మనమిద్దరమూ ఒక్కటేలే.. మనకిద్దరికీ మనమేలే...

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం.. (1)

ఇంత భారమూ మనకెందుకంటావ్ ?
నువ్వో వైపు.. నేనో వైపు.. ప్రేమ పంచుకున్నాం..
ఇప్పుడైతే మరి ఏం చేద్దాం..?
పంచుకున్న ప్రేమనింక కొంచెం దాచుకుందాం..
ఎప్పుడైనా.. ఎక్కడైనా..
ఎన్నడైనా.. ఎలాగైనా..
మనమిద్దరమూ మనమేలే.. మామూలుగా మనకిది మామూలే....

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం..
నాకు ఒక ఐస్క్రీం.. నీకు ఒక కూల్డ్రింక్..
చూసేవాళ్ళు కుళ్ళుకుంటే.. కడుపునింపుకుందాం..
......................................................................................


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

4 comments:

  1. Dubbing cinemalu ekuva chudaku james....... adi vastondi................... :P

    ReplyDelete
  2. " నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం.."
    "నేను ఒక మగ .. నువ్వు ఒక అడ ..రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం.."
    అని కవి భావం అనుకుంటా ! వ్యంగ్య రచన అయినా
    ఆధునిక యుగళగీతాల ధాటికి కృంగిన కవిహృదయం
    ఇలా నిట్టూర్చిన్దనుకుంటా! కలాన్ని ఝళిపించి నడిపిస్తే
    ఈ నాటి ఆధునిక వ్యంగ్య సినీ రచయిత అయ్యే అవకాశాలు
    ఓ నాటికి వస్తాయ్! అనుకుంటా! ఇంకేమన్నా అది ఓ తంటా!

    CH. K. V. Prasad

    ReplyDelete
  3. పాటలకు ట్యూన్ కట్టే రోజులు కావు బ్రదర్, ట్యూన్ కి పాటలు రాసే కాలం
    మీరు తప్పకుండ ఒక మంచి ట్యూన్ ని ఎంచుకుని పాట రాస్తే చూడాలని ఉంది
    నా కోరిక త్వరలోనే తీరుస్తారని ఆసిస్తూ ...
    మీ సహోదరుడు ...

    ReplyDelete