Tuesday, May 31, 2011

నేను మారలేను..మారాలనుకుంటాను..
నిన్నటి నాడు ఏదో జరిగిందని ఈరోజూ బాధ పడతాను..
ఈ నాటి తప్పుకు.. రేపటి రోజు అద్దం పడతాను..
చింతనతో..చింతలతో..
చిన్న చిన్న తప్పులేనని నాకు నేను సర్ది చెప్పుకుంటూ..
నన్ను నేను క్షమించేసుకుంటూ..
కాలంతో కలిసి ముందుకు వెడతాను..
జీవితంలో మళ్ళీ మళ్ళీ వెనక పడిపోతాను..

నేను నేనే ..
నేను మారలేను..

అప్పుడప్పుడూ.. అంతంత మాత్రం ఆలోచన వచ్చిందా..?
ఆగిపోయానని గుర్తుచేసుకుంటాను.! అక్కడే ఉండిపోకూడదనుకుంటాను..!
అలసిపోయినా .. స్వేదం ఆవిరవకూడదని..
మెలి మెల్లిగా.ఓపికకు కొత్త ఊపిరి పోసుకుంటూ .
అప్పటికప్పుడు..బలాన్నంతా కాళ్ళకిచ్చేసి..
ఒక్కో అడుగూ ముందుకు వేస్తాను..
వెనుకనుండీ ఏదో రోజు.. అనుకున్నంత ఎదుటకూ వస్తాను..

నేను నేనే..
అయినా నేను మారాలనుకుంటాను..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

9 comments:

Lakshmi Raghava said...

మీరు రాసింది ఎంత నిజమో!! ప్రతి వోక్కరి జీవితాల్లోనూ ఇలా అనుకున్నా రోజు రానే వస్తుంది

శివ చెరువు said...

లక్ష్మీ రాఘవ గారూ..థాంక్స్ అండీ.

చైతన్య said...

చాలా బాగుంది :) :)

Praveen Sarma said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు

శివ చెరువు said...

థాంక్స్ చైతన్యగారు..చాలా కాలమైనట్టు ఉంది.. మీరు ఇటువైపు వచ్చి..:)

good said...

నేను మారాలనుకుంటాను..

అవును అలా అనుకునే రోజులు గడిపెస్తుంటాను
రొజులూ,కాలం ఆగవు! గమ్యం ఎప్పడూ బెత్తెడే దూరం!
అలాని ఆలోచనలని ఆపలేను,కాలాన్నీ నిలపలేను

Anonymous said...

chala bagundi..prathi okalu adho oka roju anukuntuna untaru..kani chaiaru

Ramki said...

చాల బాగా రాసారు, మనిచి ఆలోచనని అండ్ ఆచరణ ని ... అదుర్స్
మీరు మీరే .. మేము మేమే
చాల mandiki వారు చేసిన పనులు తప్ప లేక ఒప్ప అన్నది తెలుసు
కానీ సర్దిచేప్పు కుంటారు, అది వారి వారి ఆలోచన ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది..
ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే..
మార్పు మాత్రమే శాశ్వతం, మిగతావి శాశ్వతం కాదు
మార్పు & మరపు మనిషికి దేవుడు ఇచిన వరాలు. సరిగా ఉపయోగిస్తే సికరగ్రాలు చేరవచు

bharath said...

చాలా అద్భుతం గా వ్రాసారు....నా జీవితం లో కూడా ఇలా ఎన్నో సార్లు అనుకున్నాను