Tuesday, May 31, 2011

నేను మారలేను..మారాలనుకుంటాను..
నిన్నటి నాడు ఏదో జరిగిందని ఈరోజూ బాధ పడతాను..
ఈ నాటి తప్పుకు.. రేపటి రోజు అద్దం పడతాను..
చింతనతో..చింతలతో..
చిన్న చిన్న తప్పులేనని నాకు నేను సర్ది చెప్పుకుంటూ..
నన్ను నేను క్షమించేసుకుంటూ..
కాలంతో కలిసి ముందుకు వెడతాను..
జీవితంలో మళ్ళీ మళ్ళీ వెనక పడిపోతాను..

నేను నేనే ..
నేను మారలేను..

అప్పుడప్పుడూ.. అంతంత మాత్రం ఆలోచన వచ్చిందా..?
ఆగిపోయానని గుర్తుచేసుకుంటాను.! అక్కడే ఉండిపోకూడదనుకుంటాను..!
అలసిపోయినా .. స్వేదం ఆవిరవకూడదని..
మెలి మెల్లిగా.ఓపికకు కొత్త ఊపిరి పోసుకుంటూ .
అప్పటికప్పుడు..బలాన్నంతా కాళ్ళకిచ్చేసి..
ఒక్కో అడుగూ ముందుకు వేస్తాను..
వెనుకనుండీ ఏదో రోజు.. అనుకున్నంత ఎదుటకూ వస్తాను..

నేను నేనే..
అయినా నేను మారాలనుకుంటాను..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, May 25, 2011

నేనొక డబ్బింగ్ పాట రాసాను.. హి హి హి.. మీ దగ్గర ట్యూన్ ఉంటే.. పాట కట్టుకోండి.. ఎంజాయ్.. హ హ హ...

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం..
నాకు ఒక ఐస్క్రీం.. నీకు ఒక కూల్డ్రింక్..
చూసేవాళ్ళు కుళ్ళుకుంటే.. కడుపునింపుకుందాం..

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ.. (2)

ఇంత కాలము మనమేం చేసాం..?
నీకు నేను..నాకు నువ్వు.. దూరమున్నాం..
ఇప్పుడైతే మరి ఏం చేద్దాం..?
కలిసి ఉన్న ఒక్కో రోజు.. కలిసి తిందాం ..
దూరమున్నా.. దగ్గరున్నా...
ఎవ్వరైనా.. ఏమనుకున్నా..
మనమిద్దరమూ ఒక్కటేలే.. మనకిద్దరికీ మనమేలే...

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం.. (1)

ఇంత భారమూ మనకెందుకంటావ్ ?
నువ్వో వైపు.. నేనో వైపు.. ప్రేమ పంచుకున్నాం..
ఇప్పుడైతే మరి ఏం చేద్దాం..?
పంచుకున్న ప్రేమనింక కొంచెం దాచుకుందాం..
ఎప్పుడైనా.. ఎక్కడైనా..
ఎన్నడైనా.. ఎలాగైనా..
మనమిద్దరమూ మనమేలే.. మామూలుగా మనకిది మామూలే....

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం..
నాకు ఒక ఐస్క్రీం.. నీకు ఒక కూల్డ్రింక్..
చూసేవాళ్ళు కుళ్ళుకుంటే.. కడుపునింపుకుందాం..
......................................................................................


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

అడగమని నాతో.. అడుగేస్తుంది..
అవునో కాదో ఆశలకి.. ఊపిరి పోసే ఊహ ఇది..
అంతో ఇంతో మాటలకి.. మాటలు మోసే మౌనమిది..
ఆకాశమిలా అప్పటికప్పుడు అందివచ్చిన అనుభవమే ఇది..
ఆనందంలో ఆసాంతమిలా.. మునిగి తేలిన మనసు నది..

ఏమైందో ఏమని చెప్పను?
నాకైనా తెలియని ముప్పును..
నాకే నే గుర్తుకు రాను..
చూశాక ఈ కన్నియను..

మెరుపులను వెలిగించి..
మబ్బులను తడిపేసి..
చీకటికి చలి తెచ్చే..
తరుణమా ఇది?

ఉప్పెనే అయినా అది..
ఉలుకు పలుకే లేదు..
తీరమందాకైనా మరి..
భాష బదులే రాదు..

తెలిసినా ఆ తెలియని తనమే..
తళుకుమనే ఆ తలపే..
నీతో ఉంటే.. అడుగు అడుగు లో..
అడగమని నాతో.. అడుగేస్తుంది..

చెప్పు మరి ..!
ఇప్పుడేమని చెప్పను?

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Thursday, May 19, 2011

Tuesday, May 10, 2011

రేపటి నుండీ ...Short film by Siva Cheruvu
This is the third short film I have taken. However, this one got completed with editing a bit earlier than the second one. This is a about a man who misuses his time and wanted to prepare himself ready from tomorrow all the times. What happens at the end? is the movie all about.

Details :

Camera Used - Nokia 5230
Editing done using - Windows Movie Maker
No. Of people worked on this video - 2
Entire length of raw video before editing - 15:20
After editing : 8:50
Resolution : 740 * 480

ఏదైనా ఎన్నాళ్ళు?
ఎక్కడీ మనుషులు?
ఎక్కడ బంధం?
ఇక ఎక్కడిదీ బలం?
ఎక్కడికెళ్ళాయి నిన్నటి రోజులు?
ఏదైనా ఎన్నాళ్ళు?

పసి పాపగ పసిడి రోజులు
పరువాన పరుగులున్నన్నాళ్ళూ
పైన పడ్డాకా ఆ మిగిలిన వయసు..
ఏదైనా ఎన్నాళ్ళు?

అయిపోవా కాసిన్నినవ్వులు..
ఆగిపోవా ఓనాటికి కన్నీళ్ళూ..
ఆనక ..
ఏదైనా ఎన్నాళ్ళు?

*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

Monday, May 9, 2011

ఈ సినిమాలో పాటలు విన్నారా? విధేయుడు..ఎప్పటి నుండో అనుకుంటున్నాను.. విధేయుడు సినిమా పాటలగురించి రాద్దామని.కానీ మర్చి పోవడమో.. లేకపోతే బద్దకిన్చడమో .... ఇవాళ కాదు రేపు అని ఇలా చాలా రోజులు గా రాయలేక పోయాను. లాస్ట్ వన్ అండ్ హాఫ్ యీయర్ గా ఈ సినిమా పాటలు వింటున్నాను. వివరాలు తెలియదు కానీ సినిమా ఇంకా విడుదల అయినట్టు లేదు. ఈ సినిమాకి నిర్మాత ప్రేమ్ కుమార్ పాత్ర. సంగీతం కార్తిక్ m . దర్శకత్వం సాయి మీరా..

పాటల వివరాలలో కి వెళితే..మొత్తం అయిదు పాటలు ఉన్నాయి ఈ సినిమాలో.

1. పాహి శంకర : ఈ పాటని చిత్ర పాడారు. రచన వేటూరి. ఈ పాట వింటే అయ్యబాబోయ్.. ఇంత కష్టమైన పాట ఎంత అవలీల గా పాడేసారు ఈమె.. అను కోక మానరు. లిరికల్ గా అద్భుతమైనిపించక మానదు. ఇందులో ఒక లైన్.. "మనసంటే మనిషికి గల విలువే. కలిసుంటే కలలకు ఇక సెలవే.కదిలేది కదిలించేది యదలోని ప్రేమ నువ్వే "

2. మనసా : మనసా నువ్వెందుకు ముడి వేస్తావే ప్రతి ఇరువురిని.. ? అని ఒక అబ్బాయి అంటే.. దానికి సమాధానం చెప్పే ఒక అమ్మాయి పాట ఇది. ఇడి టీసింగ్ సాంగ్ అనుకుంటే పొరపాటే. ఇది మంచి మెలోడి. కార్తిక్ ఇంకా సుమంగళి పాడిన ఈ పాట రాసింది వనమాలి గారు. మంచి పదాలు పడ్డాయి..ఒకరి ప్రశ్న ఒకరి సమాధానం..

3. వయ్యారం ఇస్తా కానీ..: ఈ పాట ప్రియదర్శిని అనే గాయని పాడారు. ఈ పాటకు కూడా రచన వేటూరి గారే. అయితే..ఈ పాట మాస్ పాట.. ఐటెం సాంగ్ అనొచ్చో లేదో నాకు తెలియదు. కానీ వింటే అదే కోవకి వచ్చే పాటలా ఉంటుంది. అయితే పాట పాడిన విధానం బాగుంది. నాకు lyrics అర్ధం కాలేదు.

4. నిదుర లేచిన ఆమని.: ఈ పాట వనమాలి గారు రాసారు. గానం హరి హరన్. ఇది మంచి సూథింగ్ సాంగ్. ఇది సోలో సాంగ్. ఇది బహుశా బాక్గ్రౌండ్ సాంగ్ అయ్యుండొచ్చు ఈ సినిమాలో. నిశ్శబ్దంలో అలా కళ్లుమూసుని ఒక్కసారి ఈ పాట వింటే అయ్యబాబోయ్.. ఎక్కడో ఉన్నాను నేను అనిపించేస్తుంది అంతే..ఈ లైన్ నాకు ఈ పాటలో ఇష్టం."ఓ ఎటో పడే నా ప్రతి అడుగు ఓ ముడే పడీ నీ వెన్నంటే.. ఇలా ననూ నీ దరి చేర్చే ఓ వరం కదా ఈ ప్రేమంటే "

5.చేతుల్లో డప్పు : ఈ పాట పాడింది సాగర్. మంచి డప్పు బీట్ ఉన్న పాట. ఈ సినిమాలో వేటూరి గారు రాసిన మూడో పాట ఇది. పాట బాగుంటుంది కానీ నాకు నచ్చలేదు ఎందుకో. శివుడు అంటే ఏమిటి అన్న అర్ధం చెపుతూ పాడుతున్నట్టు ఉంటుంది ఈ పాట అర్ధం.

ప్రచారం లేకో మరి చిన్న సినిమా అని చాలామంది పాటలా వైపు చూడకో.. ఈ పాటలు అంతా ఫేమస్ అవ్వలేదు అనుకుంటాను. కానీ సాంగ్స్ ఆర్ వర్త్ లిసనింగ్ టు. అందుకే మీ అందరితో ఈ పాటల గురించి తెలియ చేసే ప్రయత్నం చేస్తున్నా.

పాటలు వినడానికి ఈ క్రింది లింకు క్లిక్కు చేయండి.

http://www.123musiq.com/Vidheyudu.htm

Friday, May 6, 2011

ఆ రాత్రి ఉదయమైంది..

సరిగ్గా ఇప్పటికి వారం రోజులు..

నేషనల్ హైవే.. హైదరాబాద్ టు బంగలుర్ APSRTC వోల్వో వేగంగా వెళ్తోంది.. అందులో నేను. నాతోపాటు బస్సు నిండా జనం (ఏదైనా మాట్లాడే టప్పుడు ముందు నేను తరువాతే మిగతా వాళ్ళు ముఖ్యం గా ఇలాంటి వి మాట్లాడే టప్పుడు ఇంకొంచెం ఎక్కువ నేను ).

అప్పటికి రాత్రి 12.40 అయింది. మామూలు గా బస్సులో ఘాడమైన నిద్ర రాదు నాకు. కానీ ఆరోజు నేను మంచి మత్తులో ఉన్నాను. ఒక్కసారిగా ఎవరో అరుస్తున్నట్టు వినపడుతోంది. ఏం జరుగుతోంది.. ? మత్తులోనే ఉన్న నేను ఇంకా ఏమిటి ? ఏం అవుతోంది ఇక్కడ అనే ఆలోచన పూర్తిగా చేయలేకున్నాను. బస్సు మాత్రం చిన్న పిల్లాడి చేతిలో ఆడుకునే ఆట బొమ్మలా రక రకాల వంపులు తిరుగుతోంది. ఏదో unusual గా జరుగుతోందన్న విషయం అర్ధం అవున్నంతలో.. బస్సులో అరుపులు ఇంకా పెరిగిపోతున్నాయి..
నేను పూర్తిగా తేరుకోలేదు. మత్తు దిగలేదు ఇంకా. బస్సు ఆగిపోయింది.

చాలా మంది బస్సు డ్రైవర్ మీద అరవడానికి సిద్దమైపోతున్నారు. ఎవరో అన్నారు... అసలు ఏమైందో ముందు తెలుసుకుందామని.. కానీ అందరూ ముందు బస్ వెకేట్ చెయ్యాలని పరుగు పరుగున వెళ్తున్నారు. ఎస్.. ఇది ప్రాణ భయం. అప్పుడు నాకేదో అర్ధం అయ్యింది. బస్సు ఒక పెద్ద ఆక్సిడెంట్ మిస్ అయ్యి ఎక్కడో ల్యాండ్ అయ్యింది. అందరూ దిగేశారు... నేను ఒక్కడినే బస్సులో ఆఖరి వ్యక్తిని.. నా చెప్పులు ఎక్కడికో వెళ్ళిపోయాయి..కళ్ళు నులుముకుంటూ వెతుక్కోవడం మొదలు పెట్టాను. బహుశా నేను సేఫ్ అనే అభిప్రాయానికి వచ్చినట్టున్నాను. బస్సు దిగడానికి మరీ మిగతావాళ్ళ అంత తొందర పడలేదు నేను.ఇక నెమ్మదిగా కిందకి దిగిన నేను చాలా మందిని ఒక గుంపుగా చూసాను. బస్సుకు దూరం గా నిలబడి ఏమైంది అని చూస్తూ వాళ్ళు వాళ్ళా అభిప్రాయలు వెలిబుచ్చుతున్నారు..డ్రైవర్
క్లేఅనేర్ కొంత సేపటి వరకు కనపడలేదు.సమయం గడిచే కొద్దీ ఒక్కొక్కోళ్ళలో భయం తగ్గుతూ పోయింది. వాళ్ళు లోపలి వెళ్లి వాళ్ళ వాళ్ళ లగేజీలను తెచ్చుకుని నేను సేఫ్ అని సర్దిచేప్పుకోవడం మొదలు పెట్టారు. ఒక పక్క ఆవలింతలు వస్తున్నాయి. ఇంత సమయంలో పక్క వాళ్ళని నమ్మలేని వాళ్ళను చూసి కొంత నవ్వు వచ్చినా..ఆ అవులింతలో నవ్వు ఆపుకున్నాను. బస్సు డీసిల్ టాంకు ఒకటి పూర్తిగా డామేజి అయ్యింది. అందులో నుండీ పంట పొలాలకు నీళ్ళు పోసినట్టు అంత వేగంగా మొత్తం డీసిల్ పోయింది.ఒక అరగంట చర్చ తరువాత ఇక చేసేది ఏమీ లేదు ఎవరికీ ఏ బస్సు దొరికిఎతే అది పట్టుకుని వెళ్ళిపోవడమే అని తెల్చ్చి చెప్పేశారు. అందరూ ఆ ఆక్సిడెంట్ స్పాట్ నుండి మెయిన్ రోడ్డు కి రావడం మొదలు పెట్టారు. అప్పుడు నా మత్తు పూర్తిగా వదిలిపోయింది.మెయిన్ రోడ్డుకు వచ్చే దారిలో రాళ్ళు ఆ గోతులు.. పెద్ద పెద్ద గుంతను చూస్తే.. ఎలా ఇలా మేము కాపాడబడ్డాము అని అర్ధం కాలేదు. మనసులో మరో సారి భగవంతునికి నమస్కారాలు తెలియజేసుకున్నాను. When I look at the surrounding... I could not believe how I got saved from this and it a real miracle happened. As a human being I could not even see any possibility of getting out of this. Its just because of god's grace and blessings that made me to be alive that day. The most important point of it is we are not injured not even a single scratch.

బ్రేకు ఫెయిలు అయ్యిందని డ్రైవెర్ చెప్పడం. కొంతమంది డ్రైవెర్ నిద్ర పోయాడని అనడం.. ఇక్కడ రెండు రకాలైన వాదనలు జరిగాయి.
ఏమి జరిగిన ఎవ్వరికీ ఏమీ కాలేదు. అది ముఖ్యమైనది అని తోచింది నాకు. నేను వెళ్లి ఆ డ్రైవెర్ కి థాంక్స్ చెప్పాను. నీవల్లే మేము ప్రాణాలతో బయట పడ్డాం.. చాలా థాంక్స్ అని.. కానీ అతను ఏమి మాట్లాడలేదు. ఎందుకో నాకు తెలియలేదు కానీ నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు.
ఏవో చిన్న చిన్న సమస్యలో.. పెద్ద పెద్ద సమస్యలో వస్తాయి.. వాటిని గురిచి ఎంతో భాద పడి..సమయాన్ని .. జీవితాన్ని నిందలు వేస్తూ గడిపేయడం చూస్తుంటాము. ఆ క్షణం నాకు అనిపించింది .. అన్నిటి కంటే గొప్పది మన దగ్గర ఉంది. అదే ప్రాణం. బ్రతికి ఉంటే సమస్య చిన్నదో పెద్దదో ఏదైనా పరిష్కరించుకోవచ్చు అదే.. నేనే లేకపోతే. ఇక ఆ సమస్య ఉన్నా లేకున్నా.. అది పెద్దదైనా.. చిన్నదైనా.. నాకు దానితో అవసరమే లేదు కదా.. I should feel happy that I am live. I should be happy that I have been given with great energy to do what ever is given to me. My nature is to be happy and not to feel bad or sad about all the simple things and silly things that come across in life line.

ఆ బస్సులో క్లీనేర్ తో మాట్లాడాను.. అతని జీతం 3000 అని చెప్పాడు. హ హ హ.. నాకు వచ్చే వేలకు వేలు చూసి నేను ఎప్పుడైనా సంతృప్తి పడ్డానో లేదో తెలీదు..కానీ ఇంకొంచెం ఇంకొంచెం అనే భావన మాత్రం నాలో ఉండేది. మూడు వేలకు అతను చేసే ఉద్యోగం కన్నా అంతకన్నా చాలా రెట్లు అయిన నా జీతం ఇచ్చే ఉద్యోగం తక్కువ Risk Factors ఉన్నది. ఇంకా వంకలు పెట్టడం మానేద్దామని అనుకున్నాను. ultimate గా నేను బ్రతుకుతున్నాను.. అతనూ బ్రతుకుతున్నాడు. జీతం డబ్బులు వేరైనా.


అయితే..జీతం వేరైనా.. పనులు వేరైనా..ప్రదేశాలు వేరైనా..జీవన విధానం వేరైనా.. మనుషులు అందరూ బ్రతకడానికి ఒక కామన్ రీసన్ ఉందని అనిపించింది నాకు ఆరోజు. అదే ప్రతి రోజునూ ఆనందంగా గడపటం. కొందరు అదే ఆనందం కోసం సమస్యలు తెచ్చుకుంటారు. కొందరు సమస్యలు వదిలించుకుంటారు..
The most important thing in life at the end of day..really is I am satisfied with my life or not.. no matter how much you are earning, how many people you have around, the kind of life style you are with.

ఒక రెండు గంటల తరువాత.. మరో బస్సు లో మెట్ల దగ్గర కొంత చోటు దొరికితే ... జాగ్రత్తగా బంగళూరు చేరుకున్నాను.

One Last word.. Thanks to you God..

Thursday, May 5, 2011

సూర్యుడోపక్కకు పడిపోతున్నాడని..సాయంత్రం సూర్యుడోపక్కకు పడిపోతున్నాడని..
పరుగు పరుగున వెళ్లాను..

ఆ చెరువు నీటి చప్పుడు లేదు..
తూనీగల రెక్కల చప్పట్లు లేవు..
ముడుచుకున్న పూల మొగ్గల మాటలు లేవు..

గాలి ఇటు నుండీ అటు వెళ్ళడం మానేసినట్టు వుంది..
అందుకే గడ్డి పరక కూడా నావైపు తిరగడం మానేసి ఎటో చూస్తోంది..

మేఘాలు ఎప్పటిలా కాకుండా నాకు కొంత దూరంగా జరిగి జరిగి వెళుతున్నట్టు తోస్తోంది..
అందుకే ఆకాశం నవ్వుతున్నట్టుకాక.. బుగ్గ గిల్లిన పసి పాపలా నావైపు చూస్తోంది..

ఇక..
గట్టు కూడా ఎందుకో ఈరోజు పిలుస్తున్నట్టుగా లేదు..

నిశ్శబ్దానికి అర్ధాలు చాలానే ఉన్నాయి..

శోకమా ..
కోపమా..
దూరమా..
భారమా..
ఏమయి ఉంటుందో యిది..
ఎటునుంచి అయినా ప్రమాదమే మరి..

అందుకే నేనే చొరవ తీసుకుని..
అడగడానికి అడుగు వేయబోయాను..

అంతలో ఆకాశం నుండి వర్షపు చినుకులు ప్రయాణమై నా వద్దకే వచ్చాయి..
ఇలా చెప్పడం మొదలు పెట్టాయి..

ఆత్రంగా నేను పరుగులెత్తి వచ్చినపుడు..
పడిపోయానని కట్టు కట్టిన మట్టి.. చెప్పిందట..
అయ్యిన గాయాల నుండీ కారిన రక్తపు చుక్కలు తాకిన నేల..
తను పడిన ఇబ్బందిని చెప్పిందట..
భాధకు తాళలేక నా గొంతుక నొదిలిన అరుపులు
ఎవరూ చెప్పకుండానే ఇక్కడి దాక..చేరినవట..

అయ్యో..
బిడ్డడు ఆయాసపడ్డాడే, బోలేడేసి ప్రయాస పడ్డాడే అని..
మాటలు రాక మౌనమోయిన ఎదురుచూపులు..
ఎక్కువ సేపు తమ భాదను తమలో దాచుకోలేక.
అశ్రువులు గా అంతా ఎత్తునుండీ.. నుండి బయట పడ్డాయి..

ఆ క్షణం నాకళ్ళు కూడా చెమ్మగిల్లాయి..


*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.