Monday, April 18, 2011

దూరంగా మనిషి..





చరిత్రకి నిన్న..
నిన్నటికి నేడు..
చాయలు పడనంత ...దూరం..

డబ్బుకు ఆకలి..
ఆకలికి అన్నం..
రుచి తెలియనంత.. దూరం..

కండకు తగ్గ కష్టం..
కష్టానికి ప్రతి గా.. ఫలం..
బ్రతకడానికి అందనంత దూరం..

ఆశకు నిజం..
నిజానికి ఊపిరి..
జరిగిపోతున్న దూరం..

ప్రేమకు ఆకర్షణ..
ఆకర్షణకు తొందరపాటు..
ఆలోచించలేనంత.. దూరం...

వయసుకు అనుభవం..
అనుభవానికి గౌరవం..
గౌరవార్ధమైన..దూరం..

శబ్దానికి నిశ్శబ్దానికి..
నిశ్శబ్దానికి భాషకు..
మనసు దూరం..

మనిషి మనిషికి..
అందడు..

కంటికి కనపడే వాడు..
వాడు కాక వేరొకడు..

ఒక్క మాటలో..ఎవడికి వాడు..
పెంచుకునే దూరం..
దూరం..

1 comment:

  1. భరత్ నూనెపల్లిApril 24, 2011 at 9:15 AM

    శబ్దానికి నిశ్శబ్దానికి..
    నిశ్శబ్దానికి భాషకు..
    మనసు దూరం..

    ఈ వర్ణన చాలా బాగుంది...
    మీ కవితలలో ఏదో తెలియని భావం మనసుని ఆకట్టుకుంటుంది ....

    ReplyDelete