Sunday, April 10, 2011

ఇప్పటివరకూ!

అద్దంలో చూసుకుంటే మరకలు కనిపిస్తున్నాయి
తాకి చూసుకుంటే.. రంగులంటుతున్నాయి
ఎన్ని వేషాలు వేశానని ఇప్పటి వరకూ..

ఒక నిజమే అబద్దమౌతుంది..
ఒక అబద్దమే..నిజమనిపిస్తుంది..
ఎన్ని మాటలు మాట్లాడానని ఇప్పటి వరకూ!

కలవని కలల ఎడబాటు ఉండిపోతోంది..
తలవని తలంపుల అల ఎదురుపడిపోతోంది..
ఎన్ని ఆశలు రాశులు పోశానని ఇప్పటివరకూ?

ఎన్ని..
ఎన్ని..!
ఎన్ని..?

నీడ లేదు నాకు
ఇక ఏ పగలూ లేదు నాకు
నేనే నీడనైపోయాను..
రాతిరిగా నే మిగిలిపోయాను..
మెలకువ రాక
వెలుతురు లేక..

కారణాలు వెతుక్కుంటే ..
మరి...
నాకు మత్తుపై మక్కువా లేదు..
చీకటి పై విసుగు తాలూకు కన్నీళ్ళూ ఆగవు..

No comments: