Wednesday, April 27, 2011

ఎదురుచూపులు కొనసాగుతూనే ఉంటాయి




ఓపికకు.. ఓటమి దగ్గరవుతున్నా..
సడలి పోదు ఆశల సత్తువ కొస వరకూ..

కన్నులు వాలిపోతున్నా
అరచి అరచి గొంతుకలు పూడుకుపోతున్నా
కదలి పోదు.. కల కడలివైపుకు..

ఏదో కావాలి..

అందుకే తెలిసీ తెలియక..
నిరంతరాయం..ఎదురుచూపులు కొనసాగుతూనే ఉంటాయి
అవిశ్రాంతంగా..

మనిషి కోసమో
మనసు కోసమో
అవకాసం కోసమో
ఆధిపత్యం కోసమో
నిజాల కోసమో
నిశి తిమిరాల కోసమో

కావలసిన..
రావసిన క్షణాలకోసమో ..


*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

Friday, April 22, 2011

ఇక.. నీతోనే..





నన్ను చేరే ఏ చిన్న స్వరమైనా
నీదే..

కన్నులు చూసే వేల రూపాలూ
నీవే..

ఒంటరితనం వెళ్ళిపోయింది
నీవల్లే..

ఏకాంతం మిగిలిపోయింది
నీలాగే..

ఎదురుచూపుల దారులలో ఊహల చారులు..
నీతోనే..

ఇక.. నీతోనే..

Monday, April 18, 2011

దూరంగా మనిషి..





చరిత్రకి నిన్న..
నిన్నటికి నేడు..
చాయలు పడనంత ...దూరం..

డబ్బుకు ఆకలి..
ఆకలికి అన్నం..
రుచి తెలియనంత.. దూరం..

కండకు తగ్గ కష్టం..
కష్టానికి ప్రతి గా.. ఫలం..
బ్రతకడానికి అందనంత దూరం..

ఆశకు నిజం..
నిజానికి ఊపిరి..
జరిగిపోతున్న దూరం..

ప్రేమకు ఆకర్షణ..
ఆకర్షణకు తొందరపాటు..
ఆలోచించలేనంత.. దూరం...

వయసుకు అనుభవం..
అనుభవానికి గౌరవం..
గౌరవార్ధమైన..దూరం..

శబ్దానికి నిశ్శబ్దానికి..
నిశ్శబ్దానికి భాషకు..
మనసు దూరం..

మనిషి మనిషికి..
అందడు..

కంటికి కనపడే వాడు..
వాడు కాక వేరొకడు..

ఒక్క మాటలో..ఎవడికి వాడు..
పెంచుకునే దూరం..
దూరం..

Friday, April 15, 2011

అంతా రెప్పపాటులో..నే ?




రెప్పపాటులో..
పోయిన ప్రాణం..

రెప్పపాటులో..
రాలిపోయిన కలలు..

రెప్పపాటులో..
పరుచుకుపోయిన దూరం..

రెప్పపాటులో..
అంతుపట్టని అఘాదం..

అదే రెప్పపాటుకు సర్దుకోవు...
ఎందుకు?

ఆశలు.. వెనుక భయాలు.. ఇక ఉండవు ..
ఎందుకు?

సులభంగా సమాధాన పడలేక..
రేపటికి అంత త్వరగా సిద్ద పడలేక..
సర్ది చెప్పుకోలేక ఇబ్బంది పడడం ఎందుకు? ఎందుకు?

Sunday, April 10, 2011

ఇప్పటివరకూ!

అద్దంలో చూసుకుంటే మరకలు కనిపిస్తున్నాయి
తాకి చూసుకుంటే.. రంగులంటుతున్నాయి
ఎన్ని వేషాలు వేశానని ఇప్పటి వరకూ..

ఒక నిజమే అబద్దమౌతుంది..
ఒక అబద్దమే..నిజమనిపిస్తుంది..
ఎన్ని మాటలు మాట్లాడానని ఇప్పటి వరకూ!

కలవని కలల ఎడబాటు ఉండిపోతోంది..
తలవని తలంపుల అల ఎదురుపడిపోతోంది..
ఎన్ని ఆశలు రాశులు పోశానని ఇప్పటివరకూ?

ఎన్ని..
ఎన్ని..!
ఎన్ని..?

నీడ లేదు నాకు
ఇక ఏ పగలూ లేదు నాకు
నేనే నీడనైపోయాను..
రాతిరిగా నే మిగిలిపోయాను..
మెలకువ రాక
వెలుతురు లేక..

కారణాలు వెతుక్కుంటే ..
మరి...
నాకు మత్తుపై మక్కువా లేదు..
చీకటి పై విసుగు తాలూకు కన్నీళ్ళూ ఆగవు..