Wednesday, March 23, 2011

ఈ కవితకి పేరు పెట్టండి ప్లీజ్..


మిల మిల మని మెరుపేదో..
మనసున పడి వెలిగింది..
అలికిడి అనిపించిందీ..అపుడే..

గల గల మని వరసేదో..
వెంట వెంట నడిచొచ్చిందీ ..
అలజడి మొదలయ్యిందీ ..అపుడే..

పరి పరి పరిగెడుతూ..ఆనందం..
ఉన్న చోట ఉండనట్టు ఉంటోంది..
ఆశలు విడుదలయ్యిందీ .. అపుడే..

గుట్టు చప్పుడవ్వకుండా గొంతు గుప్పిటలో
అంతకాలం ఆపుకున్న ఆ మాటలే ..
ఆగనంటే ఆగనంటు ఒక వరదౌతూ..
ఆపకుండా నీ ఆలాపన చేస్తోంటే..

నా కనులకు నవ్విచ్చి..
నా అడుగుకు నిన్నిచ్చీ...
మౌనాన్నే మింగేసాను..
చూస్తూ చూస్తూ ..

కలలే మానేసాను..
ఊహలనే తరిమేసాను..
నాతో నేనుంటాను..
ఇకపై ఎపుడూ..




*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

9 comments:

anu said...

కల నిజమైన వేళ- ఈ పేరు ఎలా ఉంది?

సోమార్క said...
This comment has been removed by the author.
సోమార్క said...

గుప్పెడంత గుండెలోన.......

Anonymous said...

peru leni kavita :)

Anonymous said...

chala bagundi..

సత్య said...

title :అపుడే!

మీ కవితా ఝరి మంచి మలుపు తిరుగుతున్నది...కొనసాగించండి!

భరత్ నునేపల్లి said...

ఆలోచనల గుప్పిట నేను -- ఈ పేరు మీ కవిత కి సరిపొతుంది అని నా అభిప్రాయం

Satish Kumar Dhanekula said...

కవిలో మెదిలిన కల.....



శివ గారు చాలా రోజులయింది ఎలా ఉన్నారు....?

శివ చెరువు said...

స్పందించిన అందరికీ నా మనః పూర్వక ధన్యవాదాలు..