Tuesday, March 8, 2011

"కాదు జీవించనట్టు.." అని ఎక్కడినుండో ఓ వాణి వినపడుతుంది..





ఏమిటో ఈ జీవితం?

ఒకరికి మంచి
వేరొకరికి చెడు అవుతోంది..

ఒకరి గెలుపు
వేరొకరిని ఓటమిపాలు చేస్తోంది..

ఒకరి ఆశ
వేరొకరికి నిరాశనే మిగులుస్తోంది..

ఈ రోజు నాకు జరిగిన చెడు.. ఓటమి వలన నిరాశ మిగలడమే..!

అయితే..
రేపటి రోజు..నా గెలుపు కూడా వేరొకరికి ఇదే అనుభావాన్నిస్తుంది ..

అప్పుడే నాలో ఈ ప్రశ్న జనిస్తోంది..
నాకు మంచి జరిగినట్టా..?
నేను చెడు చేసినట్టా?


పోటీలకు..
పంతాలకు..
పరుగులు పెట్టీ పెట్టీ...

స్పృహ 'అనుభూతి' చెందడాన్ని మర్చిపోయింది..
జీవితపు కధనాన్ని వదిలి అధ్యాయాంతాలకే విలువనిస్తోంది..

లాభ నష్టాల బెరీజులో..
లభామనుకుని.. ప్రతి సారీ నష్టాన్నే జమ చేసుకుంటోంది..




*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

8 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మంజు గారు థాంక్స్ అండీ..

    రాహుల్ గారు.. with pleasure..

    ReplyDelete
  3. జీవితం పోటీలమయం కావడం ఎంత దురదృష్టమో బాగా చెప్పారు...

    ReplyDelete
  4. కెక్యూబ్ గారు థాంక్స్ అండీ..

    ReplyDelete
  5. చాలా చాలా బాగారాసారు

    ReplyDelete