Thursday, March 3, 2011

మూసిన తలుపుల వెనుక..?




ఆ తలుపులు ఏళ్ళుగా తెరుచుకోలేదు..
చీకటిలోనే పుట్టాయా? అన్నట్టు ఉన్నాయవి..
వాటివైపు ఏ చిన్న వెలుతురు నీడ కూడా వాలి లేదు..

పగిలిన గోడలకు అతికినట్టు..అమర్చిన తలుపులవి..
ఓ మూలన ఆ గదిని..మూలపడిన గదిని..
మూసేందుకు మాత్రమే వాడిన ముడిసరుకులవి..

ఆలోచన లేకో..
ఆచరణ చేత కాకో..
ఎందుకో ఎవరూ వాటివైపు చూడడం లేదు..

విసిరేసినట్టుండే ఆ తలుపుల నలుపు
ఎప్పుడో ఓ సారి.. ఏ ఒక్కరికో మాత్రమే..
మెరిసినట్టు కనపడి మాయమైపోతుంది

అనుమానం వల్లనో..
అనేక ప్రశ్నల వల్లనో..
అశ్రద్ద వల్లనో..
భయం వల్లనో..
అప్పుడుకూడా..అవి తెరుచుకుంటాయో లేదో తెలీదు
ఎవ్వరికీ..!

ఇంతకీ ఏమీ ఉందో ఆ తలుపుల వెనుక..?

తలదాచుకోవడానికింతని దొరకక..
కనీసం తలచుకునే వారు తారస పడక..
నిస్సిగ్గుకు మొహం చూపక..
ఆనవాలు మాత్రం బయట వదిలి..
ఆ తలుపుల వెనుకన మిగిలిపోయింది..వేరేదో కాదు..
"విలువల వలువలు"

చైతన్య గారి "మూసిన తలు(ల)పులు _ Oldoor" టపా నుండి ప్రేరణ పొంది రాసిన కవిత ఇది..

8 comments:

chaitanya said...
This comment has been removed by the author.
chaitanya said...
This comment has been removed by the author.
చైతన్య said...

OMG!!

నా పోస్ట్స్ కూడా inspire చేస్తాయా!! :O నమ్మలేకపోతున్నాను!!
ఇంకెవరో చైతన్య ఏమో అనుకున్నాను మొదట.... ఆ లింక్ క్లిక్ చేసి చూసాక కాని నమ్మలేదు!!

చాలా బాగుంది మీ పోస్ట్!!
మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు :-)

శివ చెరువు said...

చైతన్య గారు..
మీరు వేసిన ఆర్ట్ చాలా బాగుంది..సింపుల్ గా అనిపించింది కాని ఏదో ఉంది ఈ బొమ్మలో అనిపించింది.. నాకు అనిపించిన దానికి వేరే ఏదో యాడ్ చేసి.. రాసేసాను. అసలు నా పోస్ట్ కి పిక్చరు కింద అదే పెడదామనుకున్నా.. కాని కాపి రైట్లు అంటారేమో అని .. ఇలా కానిచ్చేశాను.. :)

Thank you..
Siva Cheruvu

మిరియప్పొడి said...

మస్తు రాసినవ్ బాసు.

శివ చెరువు said...

Thanks మిరియప్పొడి గారు..

Ennela said...

బాగుందండీ...

కెక్యూబ్ said...

వదిలేస్తున్న విలువల వలువల విలువగురించి చక్కగా చెప్పారు సార్..