Wednesday, February 9, 2011

ఆయన సర్వాంతర్యామి ఎలా అవుతాడు?

ఏది నిజం ..?

దేవుడి పేరు మీద వాడులాడుకోవడానికి ఒక రెండు వర్గాలు..ఎప్పుడూ ఉన్నాయ్.

1 . దేవుడు ఉన్నాడు.
2 . దేవుడు లేడు.

భగవంతుడున్నాడా ? అనే ప్రశ్న నాకు లేదు.. కనుక నేను తప్పక మొదటి వర్గం లో ఉంటాను. కాని నాకు వాదులాట నచ్చదు. కొన్ని విషయాలలో లాజిక్కులు మాట్లాడడానికి ఇష్టపడను. అయితే ఒక తిక మక మాత్రం మిగిలి ఉంది చాలా కాలం గా..

దేవుడికి సంభందించి రక రకాల చర్చలలో నేను విన్న విషయాలు ఈ విధం గా వున్నై .. బహుశా ఇది చదివే మీలో చాలామంది కూడా వినే వుంటారు..

1 . దేవుడు సర్వాంతర్యామి..అని అంటారు. నీలో నాలో అందరిలో ఉన్నాడు.. ఉదాహరణ : ప్రహ్లాదుని కోసమై వచ్చిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు (స్తంభోద్భవం).
2 . దేవుడే సృష్టి కర్త.. సృష్టి మూలం. వివరణ: ఎక్కడో.. ఎప్పుడో మనం చూస్తున్న ఈ ప్రపంచం మొదలయి వుంటుంది. అయితే దీనిని ఎవరో సృష్టించి ఉండాలిగా? అతడే దేవుడు.

ఈ రెండూ వినడానికి ఎంత బాగున్నా.. ఒకదానిని ఒకటి ఖండిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే..

నేను ఒక గడియారం తయారు చేసాననుకుందాం. అప్పుడు నేను తయారు చేసిన గడియారం లో నేను ఉంటానా..? కచ్చితం గా ఉండను. నేను వేరు నా గడియారం వేరు. అది కేవలం నా సృష్టి. అంతే..
అయితే నేను ఆ గడియారాన్ని సమయమెంతో తెలుసుకోవడం కోసం వాడతాను .. లేక మరెవరి అవసరం కోసమో అందజేస్తాను.. తప్ప నేనే గడియరాన్నని చెప్పను. చెప్పలేను.

అలాగే దేవుడు సృష్టి కర్త అయితే ఆయన సర్వాంతర్యామి ఎలా అవుతాడు? మరి ఈయన సర్వాంతర్యామి అయితే సృష్టి (ఈయన) ని ఎవరు చేసారు?

7 comments:

 1. Thats the difference between Man and GOD.

  Man creates the things say a mud pot, all the materials are taken from the nature...which is external, so the product is also external.

  But in case of GOD is the both the maker and material is HIM. There is nothing outside. So the starting from raw materials to the end product, HE is there. So Omnipresent.

  This is something I got to understand from elders, which I find very convincing.

  RANI

  ReplyDelete
 2. God is there. This is 100% true. I am telling this with my own experience. I am not telling lies. Now a days, due to anti god forces, people are getting confused about god. God is there everywhere. But we do not have that much power,goodness,'Bhakti".

  svk

  ReplyDelete
 3. @svk,

  I did not question about GOD's existence. Getting confused is starting stage. And its the people's own analysis of different thoughts will eventually lead to their own convincing TRUTH.

  Its true that we do not have power, goodness & 'Bhakti'. Antiforces always exist. But saying so will not develop any qualities. We have try learning from the learned elders and analyze and have to give to our future generation. Right?  RANI

  ReplyDelete
 4. భగవంతుడిని x తయారు చేసారనుకుందాం... భగవంతుడిని సృంష్టించడానికి X ’కారణం’ అనికుందాం.
  అయితే ఆ x లెకపోతే భగవంతుడు లేడు
  x ఉంటేనే భగవంతుడున్నాడు ...

  x లెకపోతే భగవంతుడు లేడు
  x ఉంటేనే భగవంతుడున్నాడు ...  ఇలా ఒకరి మీద కారణంగా ఆధారపడినప్పుడు భగవంతుడెలా అంవుతాడు? (అనుమాన ప్రమాణం)(x will become superior than God, which is not true)

  కాబట్టి.
  "తనకి తనే కారణమైన" వాడు భగవంతుడు.

  ఒక తోట పూలవనం అందంగా శుభ్రంగా పద్దతి ప్రకారం పెరుగుతుందంటేనే , కనబడకపోయినా ఒక తోటమాలి తప్పనిసరిగా వుండి వుంటాడని లేకపోతే నీరుపొసి కలుపుతీసి శుభ్రం ఎవరుచేస్తారు? అని ఇట్టే ఊహించ గలుగుతాం !(అనుమాన ప్రమాణం)
  ఒకడు కసరత్తుతో శరీరాన్ని పుష్టిగా దారుడ్యంగా తయారు చేసుకుంటే ’వాడే’ దానికి కారణమంటాం (ప్రత్యక్షప్రమాణం)

  అలా కాకుండా సృష్టికి ఇంకొకరి సహాయం తీసుకుంటే అతను భగవంతుడే కాడు.
  అలా కాకుండా సృష్టికి ఇంకొక కారణం తీసుకున్నా అతను భగవంతుడే కాడు

  గడియారం ఎవరూ సృష్టించ లేరు కేవలం తయారు చేయ గలుగుతారు అది చిన్న చిన్న భాగాల సముదాయం, ఆ భాగాలూ వస్తువులె....పకృతిలో ఉండే అన్ని వస్తువులు తయారు కాబడతాయ్ సృష్టించ బడవు.
  కాని సృష్టించడం భగ వంతునికే సాధ్యం , ’కార్యం-కారణం’ ఒకటే కావడం సృష్టి.

  "కార్యం కారణం ఒకటే అయ్యేవాడు భగవంతుడు"

  ఎక్కడో మొదలు వుంటుంది అంటారు ...అసలు మొదలు(ఆది) ’అంతం’ అనేవి వుండవు. సృష్టి కార్యం లో ’అనాది’ గా ’అనంతం’ గా సాగుతుంటుంది.

  శక్తిని కొత్తగా సృష్టించ లేం.
  సృష్టికి శక్తి కారణం - శక్తికి సృష్టి కారణం కాదు.
  (ఒక స్థాయిలో (one state) సృష్టి శక్తిగా మారిపోతుంది...దానినే ప్రళయం అంటాం...తిరిగి శక్తి సృష్టి గా మారుతుంది)

  సృష్టిలో భగవంతుడుండడమే కాకుండా భగవంతుడే సృష్టిగా వుంటాడు.
  -satya

  ReplyDelete
 5. ఇది చాలా sensitive టాపిక్ సుమండీ. వాదులాడుకోటం మొదలెడితే యుగాలే గడిచిపోతాయి. ఈ విషయం మీద నేనూ ఒకప్పుడు చిన్న టపా రాశాను. ఓపికుంటే చూడండి http://prasanna-dommu.blogspot.com/2008/07/blog-post.html

  ReplyDelete
 6. దేముడు ఉన్నాడి నేను నమ్ముతాను అంటూనే నాకో సందేహం అంటున్నారు. ఇంతకీ మీరు సందేహంగా నమ్ముతున్నారా? నమ్మకంగా నమ్ముతున్నారా? :)

  మీ స్థాయికి మీరు ఒక గడియారం తయారు చేయగలరనుకుందాం. మీకంటే సీనియరు ఓ షిప్ తయారు చేయగలడనుకుందాము. మరి ఈ సీనియర్లందరికీ సీనియర్ మోస్ట్ దేముడు ఏమి చేయగలడు? అతడు ఆదినుండి, అంతం వరకూ ఉండేవాడు. అండపిండబ్రహ్మాండమంతా నిండిన వాడు.అతను ప్రకృతి నంతటినీ సృష్టించినవాడు. అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతమూ అతని దివ్య సంకల్పమాత్రము చేత సృజించబడినదే. కాక పోతే అతని సృష్టిలోని విచిత్రమేమిటంటే తన ప్రతి సృష్టిలోనూ తననే సృష్టించుకున్నాడు. తనని అనేక రూపాలలో చూసుకోవలని అతని ఆంతర్యమేమో. అందుకే బహువిధాలుగా తానే వ్యక్తమైనాడు. కనుక నే అతను భగవంతుడైనాడు.

  ReplyDelete
 7. @ సత్య గారు and రామ రాజ్యం గారు..
  ధన్యవాదాలు..
  నాదగ్గర నమ్మకముంది అండీ.. కానీ.. క్లారిటీ లేదు.. అర్ధం చేసుకుంటారనుకుంటాను ...

  ReplyDelete