Monday, January 31, 2011

బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టానురా భగవంతుడా?

బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టానురా భగవంతుడా? అని మీలో ఎవరైనా అనుకున్నారా?

బ్రాహ్మణుడిగా పుట్టడం చాలా గొప్ప విషయమని పూర్వ జన్మ సుక్రుతమనీ భావిస్తాను నేను..ఎందుకు అని ప్రశ్నిస్తే.. నాదగ్గర దానికి లాజిక్కు లేదు.. నమ్మకం తప్ప.. నిజానికి ఎవ్వరికీ నా నమ్మకాన్ని వెల్లడి చెయ్యాలని మునుపెన్నడూ ప్రయత్నం చేయలేదు కూడా..ఇప్పుడూ నా ప్రయత్నం అది కాదు..

కానీ..కొన్ని సంఘటనలు మాత్రం భలే ఆశ్చర్య పరుస్తాయి.. చిన్నప్పుడు నా స్నేహితుడి వాళ్ళ అమ్మ గారు అనే వారు.."నీకేంటి బాపనోళ్ళ పిల్లోడివి..చదువు యిట్టె వచ్చేస్తుంది" అని, నాకు అర్ధం అయ్యేది కాదు.. చదువు కి నేను జన్మించిన కులానికి మధ్య సంబంధం నాకు ఇప్పటికీ తెలియడం లేదు.. ఆ తరువాత రిజర్వేషన్లు నన్ను తగలడం మొదలయినాయి.. APRJC గురించి వినే ఉంటారు. అందులో రాష్ట్ర స్థాయి ర్యాంకు వచ్చినా (154) OC అవడం చేత సీటు దొరకలేదు. బతిమలాడి తక్కువ మొత్తానికి ఓ చిన్న ప్రయివేటు కాలేజీలో చదువుకున్నా.. తరువాత ICET (921) కూడా అదే పరిస్థితి..రాంకులు వచ్చినా "అగ్ర కులాల వాళ్ళు " అనే ముద్ర వేసి వేరే ఏదో కాలేజీ అంట గట్టారు..ఇది ఇక్కడితో ఆగలేదు.. ఏ గవర్నమెంటు ఉద్యోగం రాసినా ఇది మళ్ళీ పునరావృతమౌతుంది.. OC అంటే "అదర్" కాస్ట్ ఇక్కడే.. ఈ పేరు లోనే వేరు చేయబడ్డం జరిగి పోయింది..
నోట్: ఇది ఓపెన్ కేటగిరి కూడా..ఈ కేటగిరిలో మళ్ళీ వేరే ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు.. కనుక ఎవరైతే OC అని భావిస్తున్నారో వారు విరమించుకోవడం మంచిది.. లేక పోతే నిరాశే మీకు మిగిలేది..

అన్నీ దాటుకునొచ్చినా లంచాలు అనే మరో కాన్సెప్టు ఉంది.. నేను దాని గురించి మాట్లాడ దలుచు కోలేదు..

కేవలం బ్రాహ్మణుడిగా పుట్టినందుకు..అందరికంటే ఎక్కువ చదివినా.. మార్కులు సంపాదించినా .. నన్ను(నా లాంటి వాళ్ళని ) ప్రియారిటీ లిస్టుకి దూరం గానే ఉంచడం జరిగింది. పోనీ డబ్బులు మూలిగి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో వున్నా ఏ కుటుంబమయినా ఇలాంటి పరిస్తుతులను తట్టు కాగలదు.. కాని ఆశలు.. ఆశయాలు ఉండి.. ఏదో చెయ్యాలని కలలు కనే వాళ్ళు కష్ట పడ్డా..వారికి కోరుకున్నది దొరకనప్పుడు వారు ఈ కులం నుండీ ఏమి అబ్ది పొందుతున్నారు..? వారి కలలను ఎవరు దెబ్బ కొట్టినట్టు? కులమా? ఇంకా ఇంకా ఎక్కువ చదవని చేతకాని తనమా? లేక వేరేవారి స్వార్ధమా? చేతకాని తనమా?

మనషికి ఇంత చదువు.. బ్రతకడానికో ఉద్యోగం ఇవే సమ కాలీన సమాజంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి వాటిమీద వేటు పడితే...? ఎలా?

ఇంకా ఏదో దొరకలేదు..ఇంకా ఏదో కావాలి..ఇంకా ఏదో తక్కువైందనీ సో కాల్డ్ బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నారు..? ఇంకేమి తీపి తీసింది వాళ్లకి?

అయితే నా ప్రశ్న నేను అసలు ఎందుకు ప్రతి సారి నన్ను ఎక్కువగా నిరూపించుకోవాలి..? సమానత్వం అనే పదం ఎప్పుడూ వింటుంటాను.. అది ఎవరికి కావాలి? సమానత్వమంటే రిజర్వేషానా ?

"ఇప్పుడు నేను అగ్ర కులమా కాదా?" అయితే ఎలా?

భగవంతుని వల్ల ప్రయివేటు సెక్టారు ఇంకా ఆ రేసేర్వేషన్లు గురించి మాట్లాడడం మొదలు పెట్టలేదు.. సంతోషం.. కానీ ఆ రోజు వచ్చినా కూడా నేను ఆశ్చర్యానికి లోను కానేమో.. ఎందుకంటే నేను అంతా ప్రిపేర్ చేయబడ్డాను..

ప్రభుత్వం వారికీ.. నాయకులకూ.. నాలాగే సమాజంలో బ్రతికే ప్రతి ఒక్కరికీ ఒక విన్నపం.. రేసేర్వేషన్లు కులాన్ని బట్టి కాకుండా... ఆర్ధికస్థోమతని బట్టి ఇవ్వగలిగితే అది లేని వాళ్లకి ఉపయోగ పడుతుంది.. ఎవోక్కరికీ నష్టం లేని సిస్టం కావాలి మనకి..

వెనుక బడ్డ వాళ్ళంటే..ఆర్దిక స్థోమత లేని వాళ్ళు.. చదవాలని ఉన్నా చదువు లేని వాళ్ళు చదవ లేని వాళ్ళు .. ఉద్యోగాలు లేని వాళ్ళు.. అవి క్రయిటీరియా అవ్వాలి కానీ.. కులాలు కాదు..

29 comments:

 1. well said boss. Everyone thinks that the brahmins are grabbing all the opportunities.

  Your narration should make them realise now atleast.

  ReplyDelete
 2. Good narration and nice post.

  ReplyDelete
 3. POORVA JANMA SUKRUTHAM NAYANA ..BADHAPADAKU..

  ReplyDelete
 4. బ్రాహ్మణుడిగా పుట్టి ఇంట బాధ పడుతున్నారే...
  ఒక్కసారి మాల, మాదిగ, డక్కలి, బుడుబుక్కల, పిచ్చకుంట్ల వగైరా వగైరా కులాల్లో
  పుట్టిన వాళ్ళ బతుకులు మన సమాజం లో ఎలా వున్నాయో ఆలోచించండి.
  రిజర్వేషన్లను కాదు మొత్తం మనవ సమాజాన్ని, మానవ సంబంధాలని అమానవీకరించిన పరమ దుర్మార్గమైన
  కుల వ్యవస్థను దానిని సృష్టించిన వాళ్ళను, పెంచి పోషిస్తున్న వాళ్ళను వ్యతిరేకించాలి,
  ఆర్ధిక అసమానతల కంటే కుల పరమైన అసమానతలు దుర్భారమైనవి.

  ReplyDelete
 5. @ Goutham Navayan,

  Would you give away your wealth if we call you a higher caste guy? Enough of these movie dialogues, do they make any sense?

  ReplyDelete
 6. hi..chala baga cheparu..baga rasaru..keep going...

  ReplyDelete
 7. కులమేంటి అన్నది పక్కన పెడితే... ఇలాంటి అనుభవం నాక్కూడా ఒకటి ఉంది...
  PG ఎంట్రన్సు రాసినప్పుడు... నాకంటే నా స్నేహితురాలికి ఎక్కువ రాంక్ వచ్చింది. కానీ రిజర్వేషన్ వలన తనకి సీట్ వచ్చింది... నాకు రాలేదు.
  PG చదవలేనేమో అని చాలా బాధ పడ్డాను... ఒక సంవత్సరం వృధా అయిపోతుందని బాధ పడ్డాను... నన్ను బాగా చదివించాలని ఎప్పుడూ అనుకునే మా నాన్నగారు కూడా చాలా బాధ పడ్డారు.
  ఇంకా బాగా చదివి ఇంకొంచం మంచి రాంక్ తెచ్చుకుని ఉండాల్సింది అని చాలా ఫీల్ అయ్యాను.
  వేరే university కి ఎంట్రన్సుకి prepare అవుతుంటే... అదృష్టం బాగుంది రెండో counselling లో సీట్ వచ్చింది. కాకపోతే మిగిలిన ఒకే ఒక కాలేజీలో సీట్ తీసుకోవాల్సి వచ్చింది... choice ఏమి మిగల్లేదు.
  దొరికిందే మహా ప్రసాదం అని అలాగే కానిచ్చేసాను.

  ReplyDelete
 8. నాదీ ఇలాటి కధే, టెన్త్ లొ సుమారు 80% వచ్చింది. మా కుటుంబ పరిస్థితుల వల్ల పాలిటెక్నిక్కి అప్లై చేసా. (సివిల్) కాని అప్పుడే రిజర్వేషన్ శాతం ఓ ఐదుకి పెంచాడు అప్పుడున్న ముఖ్యమంత్రి (ఓట్ల కోసం). మన సీటు గోవిందా..తర్డు క్లాసులో పాసయిన వాళ్ళకి సీటు వస్తే నేను నిస్సహాయంగా వుండి పోయా. ఇటు ఇంటర్ కి కూడా కనీసం ఎప్లై చెయ్యలేదు.ఇప్పట్లా ప్రైవేట్ కాలేజీలు లేవు. ఇష్టం లేని కోర్సులో పడవేస్తే, ఈ పాతికేళ్ళుగా నా మనస్తత్యానికి పడని వృత్తిని చేస్తూ ఏదో బండిని లాగించేస్తున్నా. మనం ఇన్ని బాధలు పడుతుంటే అడ్డదారిలో పైకెళ్ళిన వాళ్ళు మనవాళ్ళని హేళన చేస్తూ, వాళ్ళ యొక్క కుచిత(నీచ) బుద్దిని చాటుకుంటూ ఉంటారు. మన నిజాయితీ, పెద్దలు మనకి ఇచ్చిన సంస్కారం, వాళ్ళు చేసిన పుణ్య ఫలం మనల్ని ముందుకు నడిపిస్తోంది. ఈ ప్రైవేట్ కంపెనీల వల్ల మన వాళ్ళకి తిండికి లోటు లేకుండా వుంది. ఎక్కడో అక్కడ కాస్త హాయిగా బతుకుతున్నారు.

  ReplyDelete
 9. నాదీ ఇలాటి కధే, టెన్త్ లొ సుమారు 80% వచ్చింది. మా కుటుంబ పరిస్థితుల వల్ల పాలిటెక్నిక్కి అప్లై చేసా. (సివిల్) కాని అప్పుడే రిజర్వేషన్ శాతం ఓ ఐదుకి పెంచాడు అప్పుడున్న ముఖ్యమంత్రి (ఓట్ల కోసం). మన సీటు గోవిందా..తర్డు క్లాసులో పాసయిన వాళ్ళకి సీటు వస్తే నేను నిస్సహాయంగా వుండి పోయా. ఇటు ఇంటర్ కి కూడా కనీసం ఎప్లై చెయ్యలేదు.ఇప్పట్లా ప్రైవేట్ కాలేజీలు లేవు. ఇష్టం లేని కోర్సులో పడవేస్తే, ఈ పాతికేళ్ళుగా నా మనస్తత్యానికి పడని వృత్తిని చేస్తూ ఏదో బండిని లాగించేస్తున్నా. మనం ఇన్ని బాధలు పడుతుంటే అడ్డదారిలో పైకెళ్ళిన వాళ్ళు మనవాళ్ళని హేళన చేస్తూ, వాళ్ళ యొక్క కుచిత(నీచ) బుద్దిని చాటుకుంటూ ఉంటారు. మన నిజాయితీ, పెద్దలు మనకి ఇచ్చిన సంస్కారం, వాళ్ళు చేసిన పుణ్య ఫలం మనల్ని ముందుకు నడిపిస్తోంది. ఈ ప్రైవేట్ కంపెనీల వల్ల మన వాళ్ళకి తిండికి లోటు లేకుండా వుంది. ఎక్కడో అక్కడ కాస్త హాయిగా బతుకుతున్నారు.

  ReplyDelete
 10. deeniki antham antoo ledaa?mana prathibha ilaa vatti povalasindenaa?

  ReplyDelete
 11. బాసు!
  చాలా తెలివిగా (దీనినే ..తెలివి అంటారు) - కేవలం ఒకే కోణంలో చదువరుల గుండె నీరై పోయేంతగా వ్రాసారు. కాని రిజర్వేషన్ పుణ్యమా అని ఉన్నత పదవి పొందినా తన క్రిందివారు తనను ..........గానే చూడటం తెలిసినా- తెలీనట్టుగా -రహస్య క్షోభ అనుభవిస్తున్న దళిత సోదరుల ధీన గాధకు మీ టపాలో చోటేది?

  రెక్కలున్న పక్షి ఏ ఆకాశాన్ననైనా ఎన్నుకోగలదు.రెక్కలు పీకి వెయ్యబడిన పక్షిని క్లైడరులో పంఫినా..పారా చూట్ తొడిగినా ..ఫ్లైట్లో పంపినా అది అనుభవించే మానసిక క్షోభ -అబద్రత - మానసిక వత్తిడి ఏమో మీ టపాలో చోటుండదని తెలుసు.
  అందుకే నా బ్లాగులోను పెడుతున్నా.

  ReplyDelete
 12. I can feel your true pain brother!
  That's so unfortunate!
  But see you still survived though struggled with those adversities, Thus feel proud of your courage to stand and acclaim what you are.

  There is only ONE question that I am fearing to ask myself that "Where I would be now when NO software industry?".

  I cant cast down your anguish over reservations by saying blaah..blah.., But would say helping each other to next generations would resolve this partially at someextent Since the other options would take longer to get resolved the issue at this political casteX.

  Cheer up bro!

  ReplyDelete
 13. బగా అడిగారండి. "నేను అసలు ఎందుకు ప్రతి సారి నన్ను ఎక్కువగా నిరూపించుకోవాలి..? చాలా మంచి ప్రశ్న.
  ఏ కులరహిత సమాజం కావాలని గొంతు చించుకొనే పెద్ద మనుషులే,(కేవలం) కులం అధారంగా రిజర్వేషన్లు కల్పించటం :(. అన్ని కులాలు సమానమే అని భావించే వాళ్లు, అందరూ భావించాలని చెప్పేవాళ్లు, ఆ కులానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకిస్తారో అర్ధం కాదు. ఒకవేళ కొందరు జనాలు కులాలకు ప్రాముక్యత ఇస్తుంటే, అది తప్పు అని చెప్పాల్సింది పోయి, ప్రభుత్వమే అంతకంటే ప్రాముఖ్యత ఇస్తుంటే ఏమనాలి? descrimination, reverse descrimination రెండూ తప్పే!!

  ReplyDelete
 14. @த்தூர்.எஸ்.முருகேசன்,
  దళిత సోదరుల మీద మీ ప్రేమను చూసి చాలా ఆశ్చర్య మేసింది. అంత ప్రేమే ఉంటె మీరు తమిళ నాడులో జరిగే వాటి మీద ఎక్కడైనా నోరు మెదిపారా? బ్రహ్మణులు తప్ప అరవనాట అందరు వెనకబడిన కులాలకు చెందిన వారేగదా! ఇన్నీ రోజుల ద్రవిడపార్టి పాలనలో ఇంకా రెండు గ్లాసుల పద్దవి ఉంది. నల్ల కల్లద్దాల వారికి కనపడదా. మరి దేవర్లు, మొదలియార్లు, వన్నియార్లు దళితులను నేత్తిన పేట్టుకొని చూసుకొంట్టున్నారా? ఆ వర్గాల సంగతి తెలియాలి అంటే కింద లింక్లు కత్తి గారి బ్లగులొ నుంచి చదువుకో. పాపం పెరియార్ గారు బతికి ఉన్నప్పుడే ఈ మూక ఆయనని కూరలో కరివేపాకులా తీసి పారేశారు.
  http://parnashaala.blogspot.com/2008/11/blog-post_16.html
  తమిళజాతీయవాద స్ఫూర్తితో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మొదలైన ద్రవిడ/తమిళ ఉద్యమం అగ్రకుల ఆధిపత్యానికి సవాలుగా జరిగినా, బ్రాహ్మణేతర కులాలు దళిత అజెండాని ఈ పోరాటంలో భాగం చెయ్యక దళిత ఉనికిని మరుగుపరిచారని దళితమేధావుల వాదన. దీంతో సామాజిక, ఆర్థిక,రాజకీయ పరంగా దళితులు వెనక్కునెట్టబడి, ఇప్పటికీ (కనీస) మానవహక్కులకోసం నిత్యజీవన పోరాడటం సాగిస్తున్నారు.తమిళ అస్థిత్వసాధనలో, హిందీ hegemony కి వ్యతిరేకంగా తమిళసంస్కృతి పునర్జీవనం జరిగినా, అందులోనూ దళితులకు సముచిత స్థానం లభించలేదు. ఇదే నియో-అగ్రకులభావజాలం ఒకవైపు రాజకీయ వ్యవస్థలో ప్రతిఫలిస్తే, మరోవైపు అధికారవ్యవస్థ నిర్మాణానికి ఇదే మూలంకావడంతో పరిస్థితి విషమించింది. ఒకవైపు సమాజం, మరో వైపు ప్రభుత దళితవ్యతిరేక భావజాలానికి ఆధిపత్యం వహిస్తే, ఒకమూలకు త్రోయబడ్డ దళితులు ప్రతిఘటించడంతప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయులయ్యారు. ఈ నిస్సహాయతలోని ఉక్రోషం ఒకవైపు అడుగడుగునా తక్కువచెస్తున్న అగ్రకులాలపై కోపం మరోవైపు, ఇవన్నీ చూస్తూకూడా నిమ్మకునీరెత్తినట్లుండే ప్రభుత్వం,రాజకీయవ్యవస్థపై తిరుగుబాటు ధోరణి ఒకవైపూ ఏకమై ఈ ఘర్షణలు జరుగుతున్నాయి.
  ప్రస్తుతం జరిగిన ఘటనకు మూలం కాలేజి పేరులోని ‘అంబేద్కర్’ పేరుతొలగించి దేవర్ కులస్థులు ఒక కరపత్రాన్ని పంచడం. దళిత ఆత్మగౌరవానికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుకీ విడదీయరాని సంబంధం ఉందని తెలిసీ ఈ పని చెయ్యడం దేవర్ కులస్థుల అహంకారానికి ప్రతీకైతే, హింసకుపూనుకోవడం పల్లవర్ కులస్తుల పోరాటస్ఫూర్తిలోని లోపాలను ఎత్తిచూపుతుంది. ఈ రెండు సామాజిక పార్శ్వాలకూ వారికారణాలు వారికుంటే, ఉద్రిక్త పరిస్థితి తెలిసీ ముందస్తుజాగ్రత్తలు తీసుకోని కాలేజీ యాజమాన్యం(ప్రిన్సిపాల్), ఘర్షణ సమయంలో అక్కడుండీ చోద్యం చూసిన పోలీసుల పాత్రమాత్రం సిగ్గుపడేలాగా ఉంది. ఇలాంటి ఘర్షణలకు ఊతమచ్చి తమ రాజకీయ పబ్బంగడుపుకునే రాజకీయ పార్టీల తీరు అత్యంతహేయం.

  ReplyDelete
 15. ఆర్థికస్థోమతని బట్టి తప్ప వేరే reservation కల్పించడం సబబు కాదనే నా అభిప్రాయం. నిజంగా బడుగువర్గాల వారికి separate పాఠశాలలను పెట్టి - అందులో మాత్రమే ఉచిత-seatలను కల్పించాలి. మామూలు కళాశాలల్లో ఈ reservation ఉండకూడదు. దానివల్ల merit కు ఉన్న విలువ పోతుంది.

  ReplyDelete
 16. naaku english bhasha raadu.telugu typing raadu.kaani mithrulandariki oka maata cheppali.brahmana kutumbam matrame kaadu,ara varnaalalo puttina andariki dalithula bathuku badhalu theliyavu.endukante, agra kula mithrulaki dalitha vaadalani chuse avakaasam raadu.endukante prathi manisee thanu unna chotu ninchi paiki chusthade thapp kindiki chudadu.kanuka agra varnaala mithrulaki dalitha mithrula jeevana chirtaalu kaneesam uuhakaina andavu.pandulni meputhu elakalni paduthu agra varnasthulu neelu thagadaniki bavulu thavvuthu aa bavullone neellu thage avakasam kooda kolpothoo ,agra kula mithrula kaallaki mullu gucchukokunda cheppulu kuduthoo ,aa cheppulu thodukkune mithrule thamani enduku antaraanivaariga chusthunnaro theliyaka thamalo thame kumilipothu,chivariki bharimparaani aathma nunatha bhavaniki lonavuthoo...ilaa raasthoo pothe manishi loni maanavathvam emaipoyindi inni vela samvathsaraaluga nidrapoyindaa? ane prasna kalagakapothe manam manushulame kaadu.manushule kaani manam chaduvukunna vidyavanthulam ela avuthaamu?ambethkar pattubatti eemathramyna chesi undaka pothe mana bhaartheeya samaajamlo dalithulu eemaathramyna kanipisthunnaru.maro baadhaakaramyna vishayam emitante,chaduvukoni udyogaalu chesthunna dalitha mithrulu kooda, thama kante kindi mettu meeda unna mithrulaki cheyyi andinchakunda thamakante pai mettu meeda unna mithrula sarasana thama sthaanaanni bhadra parachukovadaanike praadhanyathanisthunnaru.thamakante kindi mittumeedi vaariki cheyoothani ivvacchu kada ante maakevaru sahaayam chesaaru vaallani kooda maalaage kasta padi payki rammanandi antunnaru,ide braahmaneeya bhaavajaaln ante.chaduvukonnavaariki samajamlo a okka manishee ontari kaadu,a okka manishee ontarigaa edi saadhinchaledu ane vishayam okaru cheppa valasina avasaram ledu.saamajika anyaayaaniki a okka vyakthee ela baadhyudu kaado,alaage a okka vyakthi samasyakee samajika samskaranalu baadhyatha vahinchavu.kanuka,chaduvukonna naa mithrulaaraa,vyakthigatha samasyal konam lonchi leda gumpu swabhaavaala drisstilonchee choodakunda,samasyala moulika swaroopa swabhaavaalni ardham chesukune prayathnam cheyyandi appudu aalochanalu padunekkuthayi.aalochene aavesaanni jayinche aayudam ani gurthisthe meelonchi oka buddhu oka ambethkar pudathaaru-abhivandanaalatho-murthy

  ReplyDelete
 17. మంజుగారు ధన్యవాదాలండి..

  గౌతం గారూ..
  "బ్రాహ్మణుడిగా పుట్టి ఇంట బాధ పడుతున్నారే... ఒక్కసారి మాల, మాదిగ, డక్కలి, బుడుబుక్కల, పిచ్చకుంట్ల వగైరా వగైరా కులాల్లో పుట్టిన వాళ్ళ బతుకులు మన సమాజం లో ఎలా వున్నాయో ఆలోచించండి." నిజమే నేను బ్రాహ్మణులొక్కళ్ళే సమస్యల్లో వున్నారు మిగిలిన వాళ్ళు "ఎక్కడా ఇబ్బంది పడడం లేదని" అనలేదు. కాని కుల వ్యవస్థ ఒక అర్హత ఎలా అయ్యిన్దనేదే నా ఆవేదన.
  "ఆర్ధిక అసమానతల కంటే కుల పరమైన అసమానతలు దుర్భారమైనవి."
  సందర్బాన్ని బట్టి చెప్పగలమండీ.. అంటే మనమున్న పరిస్థితిని బట్టి మనం దేని వలన ఎక్కువ సమస్యలు ఎదుర్కొంతామో అదే మనకు బూతద్దంలో కనపడుతుంది.. కానీ రెండూ వ్యతిరేకిన్చవలసినవే..


  అజ్ఞాత గారు మీరూ కాస్త సున్నితం గా మాట్లాడి ఉండవచ్చు.. వచ్చినందుకు ధన్యవాదాలు ..

  చైతన్య గారూ మీక్కూడా ఇలాంటి అనుభవం ఎదురైందన్న మాట.. నాకైతే అప్పటిలో ఎవరినడిగితే నా కాలేజీ సీటు నాకు ఇస్తారో తెలియదు..సెకండు కౌన్సిలింగు గుర్నిచి తెలియదు. ఇప్పుడిక అడగలేను :)

  వోలేటి గారు..
  "టెన్త్ లొ సుమారు 80% వచ్చింది, తర్డు క్లాసులో పాసయిన వాళ్ళకి సీటు వస్తే నేను నిస్సహాయంగా వుండి పోయా" నిజంగా విచారించ దగ్గ విషయం. కేవలం ఒక కులం అనే పారామీటర్.. మనం చేయాలనుకున్న దాని నుండీ మనల్ని దూరం గా తీసుకెల్లిపోతుంటే..ఏమనలేక ఎవరినీ అడగలేక మిగిలిపోవడం .. ఎంత భాదాకరం. గల్లా పట్టుకునడగడం మనకి చేతకాదు. ఎందుకంటే చిన్నప్పటినుండే పెద్దలు.. గొడవల జోలికి వెళ్ళకు.. మరొకరిని బాధపెట్టకు అని..బోలెడు నూరి పోసి మనల్ని మంచి వాళ్ళ కింద తయారు చేస్తారు.. అదే మన చేత కాని తనమౌతుంది.

  ధరణిజ గారు..
  లేదండీ ..ఏమి జరిగినా మంచికే అంటారు పెద్దలు.. ఎవరికోసమే మంచి ఎదురుచూస్తుందో..?దయచేసి నిరాశ పడొద్దు..

  சித்தூர்.எஸ்.முருகேசன் గారూ..
  "కాని రిజర్వేషన్ పుణ్యమా అని ఉన్నత పదవి పొందినా తన క్రిందివారు తనను ..........గానే చూడటం తెలిసినా- తెలీనట్టుగా -రహస్య క్షోభ అనుభవిస్తున్న దళిత సోదరుల ధీన గాధకు మీ టపాలో చోటేది?" ఉన్నత పదవి పొందిన వారు రిజర్వేషన్ నుండి వచ్చిన వారు ఎలా అయి ఉండొచ్చో ..అలాగే కింద పదవిలో వున్న వారూ అయి ఉండొచ్చో కదా ..? నా ఉద్దేశం కింద పదవులు OC వాళ్లకి ఇస్తున్నారని కాదు.. అసలు పదవీ అర్హత మారుతోందని..మారిందని. ఇక మీరన్న రహస్య క్షోభ అంటారా .. అది అన్ని వర్గాల వారూ అనుభవిస్తున్నారు. ఇక తక్కువగా చూడబడడం గురించి చెప్పాలంటే అది కేవలం కుల పిచ్చి ఉన్న వాళ్ళు చేసే పని. అది కచ్చితంగ తప్పే..నేను దానికి పూర్తి వ్యతిరేకం. కానీ ఆ రకం వారు కూడా అన్ని వర్గాలలో వున్నారు.. లేరంటారా? నేనూ అవమానాలు పొందాను కాని ఇక్కడ వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.

  "రెక్కలున్న పక్షి ఏ ఆకాశాన్ననైనా ఎన్నుకోగలదు." అన్నారు.. ఆ రెక్కలేమిటో మీరే చెప్పాలి.

  రాజేష్ గారు..
  There is only ONE question that I am fearing to ask myself that "Where I would be now when NO software industry?". You are very much right. I don't even dare to get an answer for that. Probably I would have worked so hard double or triple than that what I could normally able to.

  krihana గారు..
  అవునండీ.. సమానత్వం అని నా చిన్నప్పటి నుండీ వింటున్నాను. ఇంత వరకూ చూసింది లేదు. :(

  సందీప్ గారు..
  "నిజంగా బడుగువర్గాల వారికి separate పాఠశాలలను పెట్టి - అందులో మాత్రమే ఉచిత-seatలను కల్పించాలి. మామూలు కళాశాలల్లో ఈ reservation ఉండకూడదు. దానివల్ల merit కు ఉన్న విలువ పోతుంది." ముత్యాల్లాంటి మాటలన్నారు..

  ReplyDelete
 18. మూర్తి గారు నమస్కారం.
  మీరు చెప్పినవి నేను కాదనను.. కాని ఒక చెప్పులు కుట్టే అతనిని అవమానంగా చూసేది కులం కాదు ఒక మనిషి లోని వ్యక్తిత్వం అని నా అభిప్రాయం. నాకు తెలిసి కుల వ్యవస్థ వృత్తిని బట్టి మొదలయింది. ఎవరేమి వృత్తి చేపడతారో వారు ఆ వృత్తి ధర్మాలను పాటిస్తారు. అది కేవలం facilitator మాత్రమే. దానిని బట్టి ఒకరు అగ్ర కులస్తులు.. ఒకరు తక్కువ కులస్తులు అనడం కూడా తప్పే. ఎందుకంటే ప్రత్యక్షంగా .. పరోక్షం గా ఒకరిపై ఒకరు ఆధార పడి ఉన్నారు కదా? దీనిలో ఒకరిని ఎక్కువ.. మరొకరిని తక్కువ అని ఎలా అనగలరు... చదువు కున్న వారిలో కూడా ఈదురాచారం ఉన్నందుకు బాధపడాలి..

  ReplyDelete
 19. In "okeokkadu" movie arjun will tell that i will completely remove the column caste from the application forms.
  Instead of that there will backward etc options.
  So prati okkaru edo oka cateogery lo ki vastaru ga antadu.
  Nenu anukonedanni ilantidi pedite bagundu ani

  ReplyDelete
 20. sivacheruvu gaaru,mee spandanaku dhanyavaadaalu.mana desam loni prathyekatha ade.BHINNATHVAM LO EKATHWAM.ee bhinnathwaaniki kaaranaalanu vethakadam antha sulabham kaadu.endukante mana samaajamlo vruthini batti kulamaa kulaanni batti vrutthulaa anedaanni ippudu manaki andubaatulo unna jnaanaanni upayoginchi kolava koodadu. endukante kullaalu enduku erpaddaayi elaa abhivruddhi chendaayi ane vishayam gurinchi aalochinchadaaniki kharchu pette samayaanni,vela samvathsaraalu gadichi poyinaa eenaatkee patti peedisthunna kula vyavasthani roopu maapadam ela ane vishayam meeda kharchu pedithe daani valana prayojanam ekkuvaga untundi.
  mana bharatheeyula aalochanaa saamardhyam chaalaa ekkuva.ee vishayaanni vivekaanandu chicago lo eppudo niroopinchaaru.deenini obaamaa koodaa oppukunnaadante,adi mana yuva taram goppadanam.alaanti yuvakulu nadum bigisthe kulaanni samoolamgaa naasanam cheyya galrani manaki anipistunna kaalm lone andhra pradeshlo oka cinimaa hero kevalam kulam votlani nammukuni oka paary pettadam nijam kaadaa? aa paartyki aa kulam votlu gampa gutthaga padatam nijam kaadaa?aa paarty cheelchina votla valla eenaati raajakeeya asthiratvam erpadaleda?
  kondaru vyakthulu samaajaanni thappu daari pattisthaaru.samaajam aa thappu daarilo nadusthoo pothunnakoddie aa thappule tharuvaathi tharaalki oppulugaa maaripothaayi.chivariki ave aachaaraalugaa maaripothayi.aa aachaarallo manaki laabham kaliginche aachaaraalni sadaachaaraalani bhavisthaam. nastaani kaliginchevaatini duraachaaraaluga cheppukuntaam.aa vidhamga kondari laabham kosam andaroo mosagimpabaddaaru.aa mosaginchinavaaru agra kulasthulu.mosagimpabadinavaaru dalithulu.aa mosam ela jaruguthundo teliyaalante prasthutham andhra pradeshlo jaruguthunna raajakeeya parinamaale prabala saakshaym.BHINNATWAM LO EKATHWAANNI PRAPANCHAANIKI CHAATI CHEPPINA adbhutha jnaanula vaarasule EKATHWAM LO BHINNATHWAANI nissiggugaa pradarsisthunte prapancham manani choosi navvukodaa aalochinchandi-murthy

  ReplyDelete
 21. sravya gaaru,meeru oke okkadu ante naaku oka vishayam cheppalnipisthondi.mana raastramlo goppa vyakthigaa peru pondina sama samaaja abhilaashi okarunnaru.aayana thana samsthalalo udyogam kosam evaryinaa application pettinappudu andulo kulam perunu prasthaavisthe,aa applicationni thiraskarinchevaaru. aayana aadarsam gurinchi andariki telisipoyaaka aa samsthaki application pettevaaru kulam ane column ni vadilesevaaru.aa samstha 40 samvathsaraalugaa vundi. ippudu akkada pani chesevaaru anni kulaalavaaroo samanamga unnarani evarayinaa anukuntaaru.kaani aascharyam emitante aa samsthalo 90 saatham udyogasthulu aa samstha adhipathi kulaanikee praanthaanikee chendinavaare.endukilaa jarigindi? aa samstha adhipathi kulaanni prothsahinchakapoyinaa aa samsthalo andaru aayana kulam vaare ela cheraaru?elaagante kulanni aayana vyathirekinchinaa aayana chuttoo cherina vyakthulu koodaa aayana aadarshaalni ardham chesukoni paatinchaali kadaa?kaani vaallu paatinchaledu.endukante alaa aadarsaalani paatisthoo koorcunte thama vyakthigatha prayojanaalu debba thintaayi kada? gaandhi aadarsaala vishayamlo kuda ide jarigindi.anduke mana desamlo indira gandhi raajeev gaandhi soniya gaandhi ila boledumandi gaandheelu kanipisthaaru kaani gaandhi aadarsaalu maathram ekkadaa kanapadavu.-murthy

  ReplyDelete
 22. మూర్తిగారు..క్షమించాలి..మనలని కుల వ్యవస్థ ఏమీ పట్టి పీడించడం లేదు. కారణం భాద కావచ్చు.. లేక లబ్ది కావచ్చు..అసలు మనమే ఈ కులం అనే విషయాన్ని వదలేకున్నాము. ఇక మీరు రాజ కీయాల గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు. అంటే... కులం ఎంత మందిని ప్రభావితం చేయగలదో మీకు అర్ధం అయ్యుంటుంది. అంటే అంతా శక్తీ గలదన్న మాట కులం అంటే.. మనం అదే కులాన్ని నిర్మూలించే బదులు.. దానిలో ఉన్న energy ని positive outputs కోసం వాడుకోవడం మంచిది అని నా అభిప్రాయం. జీవించు జీవించనీ.. నాకు తెలిసిన పరమ సూత్రం ఇదే..

  ReplyDelete
 23. $శివ గారు
  #..I..worked so hard double or triple than..I..normally able to..

  It's truely unfortunate situation that We have to burn the midnight oil all the time for bread and butter. Need a change!

  #నిర్మూలించే బదులు.. ఉన్న energy ని positive outputs..వాడుకోవడం మంచిది..

  Though my point of view gets contradict here, Very good possitve attitude bro!, keep it up.

  #నేనూ అవమానాలు పొందాను కాని ఇక్కడ వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.

  That's bad bro!. You may not expect solace from others, but that would let other's know the other side of the coin.

  @ voleti gaaru
  That's MUCH painful! Should we atleast imagine what could be the situation our next generations?

  ReplyDelete
 24. అదేంటీ అలా ఫీలై పోతున్నారు. మీరు ద్విజులు కదా . ఎంతో పుణ్యం చెసుకుంటేనే కదా బ్రాహ్మణ పుట్టుక పుట్టేది. అనుభవించండి

  ReplyDelete
 25. Mr,Anonymus
  మేమేం ఫీలవ్వడం లేదు. మీ వెక్కిరింపు ధోరణికి సిగ్గు పడుతున్నాం. ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టే సమాజంలో తలెత్తుకు తిరుగుతున్నాం. అందరినీ కలుపుకుని బతుకుతున్నాం, మీరే ఇంకా కుల గజ్జి ని వదులుకోలేక, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా ఇలా సిగ్గు లేకుండా......

  ReplyDelete
 26. sivacheruvu gaaroo,
  jeevinchu jeevinchanee ane mee anna mee parama soothram naaku baagaa nacchindi.aa paramasoothram lonche ee charcaki moola kaaranamyna reservtion ane aalochana puttindi.
  anonymous gaaroo,
  evaro vekkiristhe meeru siggu padakkaraledu.charchalu jaruguthunnappudu konni chilipi vyakhyanaalu sahajam.vaatini chusi anandinchaaligaani aagrahinchakoodadu-murthy

  ReplyDelete
 27. jeevinchu jeevinchanee ane mee parama soothram naaku baagaa nacchindi.aaparama soothram lonche ee charchaki moola kaaranamayina reservession ane aalochana puttindi.

  ReplyDelete
 28. "అయితే నా ప్రశ్న నేను అసలు ఎందుకు ప్రతి సారి నన్ను ఎక్కువగా నిరూపించుకోవాలి..?
  సమానత్వం అనే పదం-........... "

  Very nice!baagaa cheppaaru.
  అగ్ర వర్ణాల పేరుతో - బ్రాహ్మణులను)- విజ్ఞానాన్ని అణగదొక్కే విద్య పొలిటీషియన్ లకు బాగా ఒంటబట్టింది.
  పదవిలో ఉన్న తాము, తమ కుటుంబీకులూ మాత్రం- సామాజిక పరిణామానికి చేయీతను ఇవ్వరు,
  స్విస్ బ్యాంకులలో వారి డబ్బు చేరుతూనే ఉంటుంది, వారి కుటుంబీకులు విదేశాలలో నివసిస్తూనే ఉంటారు-
  రాజకీయ పార్టీలకు- విజయ సాధనగా ఇంత విచ్చలవిడిగా వాడుకోగలుగుతూన్న వికృత సంఘటనల పరంపర - ఈ మన దేశంలోనే మాత్రమే సాధ్యమౌతూన్నది, ప్చ్!!!!

  ReplyDelete