Wednesday, January 19, 2011

తెలియక పోవడం కూడా ప్రేమే..!

అంతరాల అడ్డుగోడల కట్టడాలు..
ప్రేమకు తెలియవు..

ఆశలు..
అవసరాలు..
అవకరాలు..
లేవు ప్రేమకు..

తడబాటులుండవు..
నిజానిజాల అక్కరలుండవు..
నిండిపోయిన ఆలోచనలు ఉండవు..
నిండుకున్న మనసులు ఉండవు..
ప్రేమలో..
అంతా పరిపూర్ణతే..

నాకు తెలిసి..నాతో మొదలవుతుంది
నను నింపుతుంది
నను మించి ఎదుగుతుంది..
మరలా నను వేరొకరిలో చూసుకోవడం జరుగుతోంది..

అవును..
ఇదే ప్రేమ..

అయితే..!
ప్రతి క్షణం ప్రేమను అనుభూతి చెందుతున్నానని..
నాకు తెలియలేదు..నేను మునుపెన్నడూ.. తెలుసుకోలేదు..

నిజమే మరి..
తెలియక పోవడం కూడా ప్రేమే..!

3 comments:

Anonymous said...

chala baga cheparu prema gurinchi..nice..

భరత్ said...

namaskaram shiva gaaru...
mee blog eroje modati saari ga chusanu.. mee kavithalu chadivina ventane mee blog ki nenu fan ayanu.. mee kavithala to meeru palikinchae bhavalu, varnana adbhutam...

చైతన్య said...

Good one!

నాతో మొదలవుతుంది
నన్ను మించి ఎదుగుతుంది
నాలో నేను లేననిపిస్తుంది
నీలో నన్ను చూపిస్తుంది

మరి నువ్వు నాతో లేకపోతే... !?
నాలోనూ లేని నేను... నీలోనూ లేకుండా.... ఏమైపోయాను!?