Monday, January 3, 2011

నా రాతలకు ఏడేళ్ళు.. ఆన్ లైన్ లో రెండేళ్ళు..

నారాతలు నా డిగ్రీ కాలంలో మొదలయినట్లున్నై..ఒక చిన్న సస్పెన్స్ స్టొరీ .. రాసినట్టుగుర్తు..ఎక్కువగా కొటేషన్లు అవీ రాసేవాడ్ని..మొదట్లో ..ఏవో కాగితాల్లో రాసుకోవడం.. అవి ఎక్కడో పెట్టి మర్చిపోవడం..ఏమిరాసామో కూడా గుర్తులేకపోవడం.. ఇదే పరిపాటి గా జరిగేది.. తరువాత ఒక పుస్తకం పెట్టాను.. నా ఆశ ఏంటంటే.. సబ్జెక్టు పరంగా ఏ ఒక్క రకమైన కవితలకే.. అతుక్కుపోకూడదు అని.. రక రకాలు రాసేవాడిని.. అయితే నాకు పెద్ద సమస్య ఏంటంటే.. నేను రాసినవి తిరిగి నేనే వివరించి చెప్పుకోవలసి వచ్చేది.. "అవునా ఇంత అర్ధం ఉందా అనే వాళ్ళు.. విన్న వాళ్ళంతా.." అది వెక్కిరింతో.. లేక నిజమో తెలిసి చచ్చేది కాదు.. చాలా ఘాటుగా వాడుతున్నావు పదాలు అనే వాళ్ళు ఎక్కువమంది వుండేవాళ్ళు.. అందంగా రాసినా అసహ్యం గా రాసినా మొత్తానికీనా రాతలు ఆగలేదు.. దీనికి ముఖ్య కారణం మాత్రం నా స్నేహితులే.. నచ్చినా నచ్చకున్నా నన్ను భారించేవాళ్ళు.. మధ్యలో మాటీవి వాళ్లకు నా కోడి కెలుకుడు లిపిలో ఒక కవిత రాసి పంపా.. (అప్పట్లో ఓ ప్రోగ్రామేదో వచ్చేది లెండి) పాపం కొత్త భాష నేర్చుకోలేక ఎక్కడో నా ఉత్తరం దాచిపెట్టి తరువాత పాత సామానుల వాళ్లకి ఉచితంగా ఇచ్చేసారు..

ఇప్పుడేదైనా రాయాలని కూర్చుంటే వెంటనే ఆలోచన రాదు, కలం కదలదు .. ఒక్కోసారి ఆలోచన వచ్చిన వెంటనే కలం తిరిగే మెలికలు నేనుసైతం ఆపలేను.. ఇలా రాస్తున్నామా.! పారేస్తున్నామా..! అని రోజులు కదులుతుంటే..

మొట్ట మొదట 'నేను -లక్ష్మి ' అనే బ్లాగు గురించి పేపరులో ప్రచురించిన ఆర్టికల్ చదివి మా స్నేహితుడొకడు మనకీ ఓ బ్లాగు ఉంటే బాగుంటుంది కదా..అని స్టార్ట్ చేసాడు.. అప్పటికి బ్లాగంటే కూడా తెలీదు నాకు.. సరే అని ఒకటి మొదలు పెట్టా.. ఇప్పుడు కూడలిలో రిజిస్టరు చేసుకో..అన్నాడు.. అలా నా రాతలు ముందు నలుగురిలోకి వచ్చాయి.. మా స్నేహితుల ప్రోత్సాహం తో.. ఈ బ్లాగు మొదలు పెట్టి రెండు సంవత్సరాలు..అయ్యింది.

అప్పటి నుండీ ఇక రాయడంలో వెనక్కి చూస్కోలేదు.. రాయాలనిపిచినప్పుడు అప్పటికప్పుడు ఆలోచనల్ని బ్లాగెక్కిస్తూ వుండే వాడిని.. తోటి బ్లాగర్లు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియ చేసే వారు..

నా ఎచీవ్మెంట్స్.. (అని నేను భావించేవి.)

౧. కవితలు పొందుపరచుకోగాలిగాను..
౨. కధలు కూడా రాసాను..
౩. ఒక షర్టు ఫిల్ము తీసాను. ఈ జనవరిలో ఇంకోటి ప్లాన్ చేస్తున్నాను
౪.ముఖ్యంగా నలుగురు స్నేహితులను సంపాదించుకున్నాను..

సో..ఇప్పుడేమి చెప్పదలుచుకున్నానంటే.. నేను ఏమైనా రాసానంటే.. దానికి ముఖ్యంగా తోటి బ్లాగరుల ప్రోత్సాహమే కారణం.. రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో నేను నా నమస్సులు తెలియ జేయాల్సిన భాద్యత ఉంది.. ఆ లిస్టు ఇలా ఉంది..

"నేను-లక్ష్మి" గారికి
"వీవెన్" గారికి (కూడలి)
"రాజశేఖరుని విజయ్ శర్మ"
"క్రియేటివ్ కుర్రోడు మాధవ్"
"పరిమళం " గారు
"ఆత్రేయ " గారు
"చైతన్య" గారు
"కొత్త పాళీ" గారు
"సత్య " గారు
"మరువం ఉష " గారు
"సుజన మధురం"
"పద్మార్పిత" గారు
"తృష్ణ" గారు
"సాయి ప్రవీణ్" గారు
"తోట రాముడు " గారికి

ఇలా ఇంకెవరి పేరైనా మరచిపోయి ఉంటే క్షమించండి. "బాగుంటే బాగుందని.. లేకుంటే బాలేదని, అర్ధం కాలేదని .. అర్ధం లేదని.." కొంత సమయం తీసుకుని చదివిన వారికి .. చదివి వ్యాఖ్యలు వదిలిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా.. నా ధన్యవాదాలు.. నిజంగా ఈ బ్లాగు పెట్టక పోయి వుంటే. నా రొటీను లో పడి.. ఏమైనా రాద్దాం అన్న ఆలోచన కోల్పోయి ఉండేవాడినేమో.. ?
శివ చెరువు

11 comments:

anu said...

మీ బ్లాగ్ ప్రారంభించి రెండేళ్ళు పూర్తయిన సందర్భం గా అభినందనలు.మీ బ్లాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

Lakshmi P. said...

మీ బ్లాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సుజ్జి said...

Congratulations!

తృష్ణ said...

good work always yields appreciation.
congratulations..get going!

మధురవాణి said...

Congratulations!! keep rocking! :)

రాజశేఖరుని విజయ్ శర్మ said...

శుభాకాంక్షలు మిత్రమా... :-)

"ఇంకాస్త ముందుకు వెళ్లు కథ తెలుసునా!?"

Anonymous said...

congrats...mimalani encourage cheina valiki meru thanx chepadam chala bagundi...

శివ చెరువు said...

Thanks you all..

Siva Cheruvu

Ennela said...

congratulations siva garu..mee blaaguki puttina roju subhaakaankshalu...baagunnayi mee postlu...inka annee chadavaledu...nemmadiga instalments lo chaduvuta...

satya said...

మీ బ్లాగ్ రెండవ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు...
సాహితీ విశ్వ గ్రహ గొ్ళాలని దాటిపోయే
ప్రచండ కవితా కిరణంలా దూసుకు పో
అలోచనా భావాల హద్దుల్ని దాటుకుపో!

దయచేసి ఈ పోస్ట్, కామెంట్ లు చదవండి....కొంత సమాధాన పడతారని నమ్ముతున్నా.

http://sahitheeyanam.blogspot.com/2011/01/21.html

-satya

భరత్ said...

aalasyam ga aina mee blog chusinanduku chala anandam ga undi... naku kuda kathakudini kavalani chala korika.. a madya oka katha kuda rasanu.. kaani naa alochanalanni oka katha roopam lo cheyaleka badapadtunanu....mee laga oka blog create chesi na korika ni neraverchukune prayatnam chestanu....