Sunday, January 2, 2011

ప్రశ్నలు.. 'నేను'



ప్రశ్నలు వదలవు నన్ను..
ప్రశ్నిస్తాయి..
పది పది మార్లు..

తరగతి గదిలో ..
వెనుక వరుస విద్యార్ధిని కదూ..!
సమాధానాలూ అంత త్వరగా
దొరకవు నాకు..!

వెంట పడతాయి..
కారణం.. వాటికి నేనే వినోదం..
నిజానికి నాకూ అవే కాలక్షేపం..
అయినా ఎందుకో ..?
వాటికి దూరంగా జరగాలనుకుంటూ ఉంటాను ..

రవిగానీ..నిశి రానీ..
అవి రెప్పలార్పవు..
నన్ను నిద్దురమత్తుకు దగ్గర కానీవు....
'నేను' కాని వాటివద్దకు పొనీవు..
అమృతపానం గానీ చేశాఏమో?
అందుకే ఈ సురాసుర లక్షణాలు..

తిక మక పడితే..
నవ్విపోతాయని భయం..

తప్పించుకుపోదామా అంటే..
అంటి పెట్టుకు తిరుగుతున్నాయన్న ఆలోచన..

అనుమతి అడిగి బయట పడదామా అంటే..
అక్కడే ఆంక్షలు మొదలు..

అన్ని విఫల యత్నాల ఫలితాన
అలసిపోయాను..
అందుకే వాటికి ఎదురొడ్డే ఆలోచనలకు నీళ్ళోదిలేసాను ..
కలిసి తిరగడం మొదలు పెట్టాను..
సహవాస దోషం అంటింది కాబోలు..
ఇప్పుడు ప్రశ్నలకు ప్రశ్నలు మొదలయ్యాయి..
తాము వెనుక వరసకు వచ్చి కూర్చుంటున్నాయి..

మచ్చిక చేసుకున్నాక
మంచి స్నేహమయ్యాకా..
ఇప్పుడొకరికొకరం జాబులిచ్చుకుంటున్నాం..

నేను 'అవకాస'మివ్వనని మాట ఇచ్చాను..
తనూ 'అనుమాన'మవనని చెప్పింది..

ఇక ఇద్దరం కలిసే ఉంటున్నాం..
మరి నేనూ వేరుపడాలని అనుకోలేదెప్పుడూ ..

5 comments:

  1. శివగారూ! సమాధానం వెతుక్కోవడం కన్నా సమాధాన పడడం మంచిది....

    ReplyDelete
  2. తృష్ణ గారు.. ధన్యవాదాలండి..

    సత్య గారు.. సరిగ్గానే చెప్పారు.. సమాధానం మనచేతిలో లేనప్పుడు మాత్రమే మనం సమాదానపడాలి.. కానీ ప్రయత్నలోపముంటే.. మనని సమాధాన పరచే వారు కూడా అందుబాటులో ఉండరేమో..? ఏమంటారు?

    ReplyDelete
  3. baga rasaru bagundi..

    ReplyDelete