Wednesday, December 28, 2011

ఒక మౌనం.. ఒక మాట.. ఒక భావన.. ఒక యుద్ధం..

నిశ్శబ్దం పరుచుకు పోయింది..
ఒక శవం పుట్టినట్టు..
లోపల చలనం లేనట్టు..
ఒక లోకం చలించనట్టు..
ఒక రాత్రిని ఒక రాతిరి కమ్మేసినట్టు..

శబ్దం ఓపిక పోసుకుంటోంది..
ఒక అణచివేతను అడ్డుకున్నట్టు..
లోతున అలజడి రేగినట్టు..
ఒక లోయన రాయిని విసిరినట్టు..
ఒక కదలికను కదిలించినట్టు..

ఎలాగో అంతర్గతం బయటపడుతోంది..
ఒక యుద్ధం ఆగి ఆగి జరుగుతున్నట్టు..
సూర్య చంద్రులు వచ్చి వెడుతున్నట్టు..
ఒక దూరం దూరమవుతున్నట్టు..
ఒక సగంతో ఒక సగం సరిపడుతున్నట్టు ..

ఒక మౌనం..
ఒక మాట..
ఒక భావన..*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, December 27, 2011

బొంబాయిలో బొక్కలో అప్పాయింట్మెంటు - 2

ఉదయం అలారం మోగుతోంది.. మోగింది.. మళ్ళీ మోగింది.. 3.00 కి .. 3.30 కి .. 4.00 కి..

నోట్..
ఈ గడియారం లో టైం చూడ కండినేను నిద్ర లేచి మళ్ళీ పడుకున్నాను.. విపరీతమైన చలి.. అలసిపోయి పచ్చడి అయి పోయిన మనిషి ఏమీ అడగడు.. ఒక్క నిద్ర తప్ప.. నేనూ అదే సర్కిల్ లో మూవ్ అవుతున్నాను..కానీ లోపల బుద్ది చెపుతోంది.. నువ్వు ఇక్కడ ఈ హోటల్ లో అసహ్యమైన పరిస్థితులలో ..రెస్టు తీసుకోవడానికి కాదు.. వచ్చింది.. నీకు వేరే పని ఉంది అంటూ నిద్ర లేపేసింది..

లేచి లైట్ ఆన్ చేసాను.. పెద్ద వెలుతురు ఏమీ లేదు.. ఏదో ఉన్న వస్తువులు చూడడానికి కొంచెం కళ్ళను చిట్లించి ఉపయోగించాల్సి వచ్చింది..
రాత్రి సరిగా కనపడలేదు (చూడలేదు అనడం కరెక్ట్ ఏమో!).. గోడకి రంగులు వెలిసిపోయాయి.. కొన్ని సంవత్సరాలయి ఉంటుంది ఇవి వేసి.. నేనిచ్చిన ఒక పూట రెంటు తో రెండు సార్లు వెయ్యొచ్చు రంగులు ఇక్కడ... వీడి కమర్షియలిసం మండిపోనూ.. టీవీ వైరు తెగి పోయి ప్లగ్గు పక్కన ఉరి తీసిన శవంలా వేలాడుతోంది.. ఒక ఎర్ర వయిరు ఒక నల్ల వయిరు.. నాలిక బయట పెట్టి భయంకరంగా ఉన్నాయి.. దానికి ఎక్కడా ఒక కేబుల్ లైను కనెక్టు అయినట్టు కనిపించలేదు..ఆ టీవీ కి remote కూడా లేదు.. దాని కింద నా బాగ్ పెట్టి ఉన్న ఒక ఎరేంజ్మెంట్ ఉంది.. ఒక పక్కన దులపని షెల్ఫ్ కూడా ఉంది. అందులో ఒక సాలీడు ఫ్యామిలీ .. వై ఆర్ యు డిస్టర్బింగ్ అస్ అన్నట్టుగా చూస్తున్నాయి.. వాటికి opposite లో ఒక టెలిఫోన్ .. అది యాన్టిక్ పీసు.. తరువాత ఆ బెడ్ .. ఇప్పుడు దాని గురించి రాయక పోవడమే మంచిది..తరువాత స్నానానికి ఒక సోప్ ఇచ్చాడు.. దాన్ని సోప్ అంటారా????? అర చేతికి పావు సైజు కూడా లేదు... ఓ లావు పాటి మనిషి అర డజను సార్లు స్నానం చేసినా కూడా ఒక మామూలు సబ్బు ఈ సైజుకు రాదు.. దానికి పెద్ద పెట్టె లో పేకింగు ఒకటీ..!!! అదీ అంతంత సౌందర్యం గానే ఉంది.. ఇక సౌందర్యాల గురించి సౌకర్యాల గురించి పట్టించుకో కూడదని గట్టి నిర్ణయం తీసుకుని..గబాల్న చన్నీళ్ళు స్నానం చెయ్యడానికి పరిగెత్తాను..

చక చక రెడీ అయి దేవుడికి దణ్ణం పెట్టుకుని..అందం గా తయారయి (అనుకుని) .. మూడో అంతస్తు నుండీ మెట్లు దిగాను.. అందరూ పడుకుని ఉన్నారు.. మార్నింగ్ 6 .00 అవుతోంది.. ఇలా నిద్ర పోయి ఎంత కాలం అయ్యింది.??? ఒక్క సారి నా మీద నాకే జాలేసింది.. లగేజీ రిసెప్షన్లో పెట్టి.. ఇక వచ్చిన పనికి బయటకు బయలు దేరాను..

వీధిలో చీకటి.. పొద్దున్న ఆరు అయినా ఇంకా సూర్య భగవానుడు ముంబై లో ఫ్లయిటు దిగలేదు.. ఆయన కూడా ఎయిర్ ఇండియా ఎక్కుంటారు.. ఆటో ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుంటూ వెళ్తుంటే.. వీధిలో చక్కగా నిద్ర పోతున్న కుక్కలు కనపడి.. నీకు మాకున్న సుఖం కూడా లేదు అని వెక్కిరించి.. (బావ్ బావ్ అని..) మళ్ళీ నిద్రకు ఉపక్రమించాయి... వాటికి నా మీద ఉన్న జాలిలో పావు వంతు కూడా మా మేనేజర్కి నా మీద లేదు.. అది నా ఆలోచన.. అనుమానం.. నమ్మకం.. నిజం..


కొంచెం దూరం నడిచాక ఒక ఆటో దొరికింది..
"బయ్యా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కో జానాహే.." - అడిగాను ఆటో అతన్ని..
"బైటో జాయేంగే.." కాన్ఫిడెంట్ గా అన్నాడు..

ఒక రెండు నిమిషాలు అయ్యాక..
"కిత్నా టయిం లగేగా.. జానేకేలియే..?" అని అడిగాను..
"కహా జానా హే." అన్నాడు..
"బోలా నా.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ " - సమాధానం చెప్పటం నా వంతు అయ్యింది..
"ఇదర్ హీ హే...జాసక్తే హే.. జల్దీ " - అన్నాడు.
నాకు "వీడు తేడా.. (నేను బకరా..)" అనే ఆలోచన.. అనుమానం.. నమ్మకం.. ఒకే సారి కలిగాయి అతని మీద.. వాటిని నిజం.. చేస్తూ.. టప్పని ఆపేసాడు..


ఏమైంది ? - అడిగాను..
నేను వేరే రూట్ లో వెళ్ళాలి. "ఇక్కడి నుండీ మీకు వేరే ఆటో దొరుకుతుంది.." అని చెప్పి డబ్బులు నొక్కేసి వెళ్ళిపోయాడు..

నేను వెళ్ళ వలసిన చోటికి తీసుకు వెళ్ళడం మానేసి.. వాడు వెళ్ళే దారిలో నన్ను దింపేసాడు ... వావ్.. day started .. సరే.. ఇంకో ఆటో తీసుకుని ముంబై US Consulate కి వెళ్ళాను.. అక్కడ పెద్ద లైను..ఇంత మందీ అమెరికా వెళ్ళడానికేనా ? అందరూ టిప్ టాప్ గా తయారయి.. పొద్దున్నే వచ్చేసారు.. వివాహ వేదికలలో అమ్మాయిల కోసం అబ్బాయిలు వచ్చినట్టు.. ఆ లైన్ అంత పొడుగు ఉంది ఏంటి..? ఈ గుంపులో కేవలం వీసా అప్ప్లయి చేసే వాళ్ళే కాదు.. వాళ్ళ బంధువులు.. పక్కింటి వాళ్ళు.. అమ్మమ్మలు తాతయ్యలు.. పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న.. పెళ్లి కానీ వాళ్ళకి వాళ్ళ ..... అందరూ వచ్చి నుంచున్నారు. ఇక్కడ టీ కొట్టు వాడిని చూస్తే నాకు కొంచెం కుళ్ళు వచ్చింది.. నా మంత్లీ శాలరీ ఈజీగా వాడో వారం లో కవర్ చేసేస్తాడు..లాగుంది.. అయినా నాలో ఒక మెరుపు లాంటి..అయిడియ వచ్చింది. ఉద్యోగం వదిలేసి.. ఇక్కడ ఒక బడ్డీ కొట్టు .. పాన్ డబ్బా పెట్టుకుంటే.. early గా లైఫ్ లో రిటైర్ అయిపోవచ్చని.. ఇంతలో వెనక వాడు పద పద అని కదలని లైన్ లో నను ముందుకు తోసే ప్రయత్నం చేస్తున్నాడు.. ఎప్పుడైనా చదువు కున్న మూర్కులను ఎక్కువగా ఒక్క సారిగా చూడాలని పిస్తే ఇక్కడికి వచ్చేయచ్చు..పొద్దున్నే పళ్ళు తోముకోవడం రాదు కానీ... వీసా కోసం ప్రతి ఒక్కళ్ళూ పరిగెత్తుకొని వచ్చేసారు. పెద్ద పెద్ద అయిడియాలు !!! ఏం చెయ్యలా.. ఎక్కడెక్కడ తిరగాలా అని.. చర్చలు.. వెళ్ళేది కంపనీ పని అని ఒక్కడికీ ధ్యాస లేదు.. ఇదేదో విహార యాత్ర లాగుంది వాళ్లకి.. నాకేమో చిరాగ్గా ఉంది..నాకు నచ్చనివి మూడు..

ఒకటి : అప్లికేషన్లు ఫిల్ చేయడం
రెండు: లయిన్లో వెయిటింగ్ చెయ్యడం
మూడు : ప్రయాణం చెయ్యడం..

ఇప్పుడు ఈ మూడు నాకు మా కంపనీ వాళ్ళు పేకేజీ కింద ఇచ్చి పండగ చేసుకోమన్నారు.... ముందు ఎంత లైను ఉన్నది అని చూడకుండా.. వెనక ఎంత మంది ఉన్నారని చూసి నన్ను స్వాంతన పరచుకుంటూ.. మొత్తానికి లోపలి వెళ్ళాను.. నేను.. అనుకున్న దానికన్నా చాలా తొందరగా పని అయిపోయేటప్పటికి.. నేను మరో బిల్డింగ్కు మరో బిల్డింగ్కు కి.. తిరిగి.. పని పూర్తి కాకుండా... హోటల్ కు వెనుకకు వచ్చేసాను.. పని ఎందుకు కాలేదు అని చెప్పాల్సి వస్తే కొంత మంది గురించి నిజాలు రాయాలి. అలాంటివి పబ్లిగ్గా రాయక పోతే నేను సేఫ్ గా ఉంటాను.. ఇక్కడ మరో మాట చెప్పాలి.. US Consulate లో మనుషుల కన్నా.. నేను దిగిన హోటల్ ఓనర్ చాలా మంచి మనిషి (ఇతని గురించి మీకు ఆల్రెడీ అవగాహన ఉన్నదని నమ్ముతున్నాను.. లేని యెడల పైనుండీ మళ్ళీ చదవండి..).

హోటల్ కు వచ్చి కూలబడ్డాను.. బట్టలు సర్దుకుని.. మా travelling agent కి ఓ నాలుగు సార్లు కాల్ చేశాను.. మూడు సార్లు వాళ్ళ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి .. ఆయన పక్కనే ఉన్నారు. కాసేపాగి ఫోన్ చెయ్యమని చెప్పి పెట్టేసింది.. ఇంతలో నలభై missed కాల్స్ .. ఎవరా అని చూస్తే .. రియల్ ఎస్టేట్ వెంకట రావ్.. పోనీలే అని ఫోన్ చేస్తే. నా బాలన్సు మొత్తం ఊదేసే దాకా మాట్లాడాడు.. మీరు బడ్జెట్ చేంజ్ చెయ్యాలి సార్.. మీరు లొకేషన్ మారాలి సార్.. మీరు అపార్ట్మెంట్ అయినా adjust అవ్వాలి సార్.. permissions దేముంది సార్. మీరు దిగింతరువాత వచ్చేస్తాయి.. ముందు మాత్రం payment ఇచ్చేయాలి.. అని ఏవేవో చెప్పి తను entertain అయ్యి.. ఫోన్ పెట్టేసాడు..

ఇంతలో మా agent ఫ్రీ అయ్యి.. నాకు కాల్ చేసాడు.. నేను చెప్పడం మొదలు పెట్టాను..ఏం లేదండి.. మిమ్మల్ని disturb చేసాను ఏమనుకోవద్దు.. రాత్రి 8 .50 ఫ్లైటు హైదరాబాద్ కి బుక్ చేసారు కదా.. ఏమైనా ప్రీ పోన్ చేయించ గలరా? నేను వచ్చిన పని అయిపోయింది..

మా agent జగన్నాద్.. జాతక చక్రాలు వేసి.. తారాబలం, లగ్న బలం..తిది అన్నీ చూసి.. కన్య కింగ్ ఫిషేర్ లో.. ఇంద్రుడు ఇండిగోలో .. సూర్యుడు ఎయిర్ ఇండియా లో ఉన్నారు... కనుక కొంచెం కర్చు ఎక్కువ అవుతుంది.. ఏం చేయ మంటారు? అన్నాడు.. మనసు కన్య వైపే వెళ్ళినా .. మా HR ని అడిగి చెపుతాను అన్నాను.. అప్పటికి నేను రియలైజ్ అయ్యిన విషయం నా ఫోన్ లో బాలన్సు దాదాపు అయిపోయింది.. నేను రోమింగ్ లో ఉన్నాను.. అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది..

వెంటనే మా HR కి ఫోన్ చేసి ఉన్న కొంచెం బాలన్సు తో..ఇలా చెప్పాను..

A relation ship between employee and HR should be like fish and water and not like fish and fisherman..

ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను.. అర్ధం కాక పోతే మళ్ళీ అడుగు.. అసలు అర్ధమే తప్పనుకుంటే.... హలో.. హలో... హలో.. హలో... అక్కడ ల్యాండ్ లైన్ కి సిగ్నల్ కట్ అయ్యింది.. ఇక్కడ ఎకౌంటు నిల్ అయ్యింది. సో..

11 గంటల నుండీ 12 వరకూ తెలీకుండా టైం అయిపోయింది.. కానీ 12 దాటితే ఇంకో రోజు extra బిల్లు వేస్తాడు మా హోటల్ వాడు. సో.. అక్కడి నుండీ బయట పడీ.. ఏం చెయ్యాలో తెలీక .. ఏమీ చెయ్యక.. రాత్రి 8.50 వరకూ నేను ఏవో కష్టాలు.. ఎన్నో చికాకులు.. పడి పడీ.. సమయాన్ని వృధా చెయ్యడం ఎలా అనే కోర్సు నేర్చుకున్నాను.. చేతిలో కర్చు పెట్టడానికి డబ్బులు లేవు. laptop ఉంది battery లేదు.. ఫోన్ ఉంది బాలన్సు లేదు.. (అసలు దీనిమీదే ఒక పోస్టు రాయచ్చు) అయితే..ఇన్ని ఆనందాల తరువాత.. నా 8.50 ఫ్లైటు ఈ రోజు కూడా కేవలం గంటన్నర delay అవ్వడం తో.. పరిపూర్ణం గా నా కోర్సును పూర్తి చేయగలిగాను..

Happies.. Endings...
*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Saturday, December 24, 2011

బొంబాయిలో బొక్కలో అప్పాయింట్మెంటు - 1

ఒకే సరే. ఉంటాను.. వెళ్ళాక ఒక సారి ఫోన్ చేస్తాను... కాబ్ వాడు బయట వెయిటింగ్ చేస్తున్నాడు.. బయ్ బయ్.. అందరికీ చెప్పి బయలుదేరాను..సాయంత్రం 5 .30 కి కాబ్ ఎక్కాను.. ఆ బెంగళూరు ట్రాఫిక్ లో ఎక్కడైనా ఆలస్యమవుతుందేమో అని 9 గంటల ఫ్లైటుకు మూడున్నర గంటల ముందే బయలు దేరాను.. ఎవరైనా తొందరగా వెళ్ళు బాబు అని చెపుతారు.. నేను కాబ్ అతనికి క్లియర్ గా చెప్పను .. నాయన కాస్త తొందరగా కాకుండా మెల్లగా తీసుకుని వెళ్ళు.. అని.. కాసేపు నిద్రపోవచ్చు అని..

అప్పటికి పడుకుని .. కాస్తంత కంటికి నిద్ర దొరికి చాలా రోజులైంది.. థాంక్స్ టు మై ప్రాజెక్ట్..ఇంత చెప్పినా.. ఆ కాబ్ డ్రైవర్ మంచి బిజీ ట్రాఫిక్ రోడ్డ్లు వదిలేసి.. తన పనితనమంతా చూపించి.. అడ్డ దారిలో ఒక గంట ఇరవై నిమిషాల్లో పట్టుకొచ్చేసాడు.. వెనకాల మత్తుగా పడుకున్న నన్ను సర్ సర్.. ఐర్పొర్ట్ వచ్చేసింది అని నా దగ్గర ఇచ్చేలోపే డబ్బులు లాగేసుకుని లగేజితో సహా కార్లోంచి తోసేసాడు.. నాకు బిల్లు ఇవ్వలేదు. ఇక మా కంపెనీ వాడికి నేను ఎక్కడినించి క్లయిం చేసుకోవాలో అని ఆలోచిస్తుంటే.. ఆ డబ్బులు ఇంక రావని అర్ధం అవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు. మరి ఫ్లయిటు వచ్చేదాకా ఎలా టైం వేస్టు చెయ్యలా అని అనుకుంటూ లోపలకు నడిచాను ..

అప్పుడే నా చేతిలో ఫోను గుర్తుకు వచ్చింది .. చాలా రోజులుగా నాకు ఎవరు ఫోన్ చేసినా నేను ఎత్తి మాట్లాడలేదు.. వాళ్ళందరికీ ఫోన్ చేసి.. క్షమాపణలు చెప్పాలని (టైం పాస్ కి..అంతే..) డిసైడ్ అయ్యాను.. అయితే ఇప్పుడు వాళ్ళందరూ ఫుల్ బిజీ.. ముందు పనికి మాలిన పాటలు తరువాత అవి పెట్టుకోవడానికి డబ్బులు అని ఏవో వంకర వాయిసులు వినపడడం తప్ప ఒరిజినల్ గా ఎవడికి ఫోన్ చేసానో వాళ్ళకి నేను కనక్ట్ కాలేక పోయాను.. ఇక్కడినుండీ నాకు అవమానాలు మొదలైనాయి..హలో.. హా బయ్య.. "మైన్ శివ బోల్ రహహూ.. గ్యార బజేతక్ వహా రహూంగా" అని హోటల్ రూం వాడికి ఫోన్ చేసి నా అందమైన హిందీని పరీక్ష చేసుకున్నాను.. ఎయిర్ పోర్ట్లు లో దిగంగానే.. అక్కడ పిక్ చేసుకోవడానికి నాకోసం వెయిట్ చేస్తాడు అన్న మాట.. ఇది మా ఇద్దరి మద్య undarstanding . కానీ తరువాత అర్ధం అయ్యింది.. వాడి understanding వేరే ఉందని..

ఏం చెయ్యాలో తెలియక అక్కడ పిజ్జా, burgerల కేసి చూడ్డం.. పెప్సి బాటిళ్ళ కేసి చూడ్డం.. వీటిలో ఏవి కొంటే మా కంపనీ వాళ్ళు రిఎమ్బర్స్ చేస్తారో లేదో అని చూడ్డం.. ముసలి వాళ్ళ కేసి చూడ్డం.. చిన్న పిల్లల కేసి చూడ్డం.. అమ్మయిల కేసి (ఇదే ఫస్ట్ రాయాలేమో..??? రాయకూడదా..???) చూడ్డం..ఇలా ఏదోలా కాలం నడిపిస్తున్నా.. బాగా పని చేసి చేసి. ఒక్క సారి ఏం చెయ్యాలో తెలియక పోతే.. ఎంత ప్రోబ్లేమో అప్పుడే అర్ధం అయ్యింది..

ఒక అనౌన్సుమెంటు వస్తోంది.. మీరు ఎక్కవలసిన ఫ్లైటు ఒక గంట లేటు.. అని.. సినిమాకోసం ఎదురు చూసే ప్రేక్షకుడికి "వర్మ బెజవాడ" చూపించి టార్చర్ చేసినట్టు అయ్యింది.. నా పరిస్తితి..ఎన్నో చూసాం .. ఇది చూడలేమా అని.. ధైర్యం చెప్పుకున్నా.. కానీ .."ఇది జస్ట్ ట్రైలెర్ అంతే.. తరువాత సినిమా చూపిస్తాం" అని దాని అర్ధం అని నాకు తెలియలేదు..

ఇంతలో ఫోన్ వస్తోంది..
సర్ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు????? సర్.. ప్లాట్ చూస్తానన్నారు.. రెట్లు చాలా తక్కువ లో ఉన్నాయి.. సర్ .. ఇప్పుడు తీసుకోక పోతే.. మీకు ఇళ్ళు దొరకవు.. మీరు ఇళ్ళు కొనలేరు.. మీకు సొంత ఇంటి భాగ్యం లేదు అనీ.. ఆల్రెడీ అన్నీ బుక్ అయ్యిపోయాయి..అనీ.. మీరు బుక్కవ్వడమే మిగిలింది అనీ.. చెప్పుకుని వస్తున్నాడు.. సరే ఇన్కమింగ్ ఫ్రీ అని నేనూ.. ఏదో మాట్లాడడం మొదలు పెట్టాను.. ఇల్లు కట్టారా? ఎంత? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? పేపర్లు ఉన్నాయా.. ?పనికొస్తాయా..?అని పది ప్రశ్నలు వేసాను. మీరు రండి సర్ .. వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం.. అని పెట్టేసాడు.. రియల్ ఎస్టేట్ వెంకట రావు..

ఇంతలో కరుణించిన ఎయిర్ ఇండియా అనుకున్నంత ఆలస్యానికీ వచ్చేసింది.. ఇక హడావిడి మొదలు.. చిన్నప్పుడు స్కూలు వదలగానే.. పిల్లలు పరిగెత్తినట్టు.. ఫ్లయిట్ రెడి అనీ.. మీల్స్ రెడీ .. అన్నంత అందంగా చెప్పగానే.. అందరూ పోలో అనీ పరిగేతారు.. నేనూ నలుగురిలో (తో)నారాయణ.. :)

ఫ్లైటులో ..
తినడానికి మంచి తిండి లేదు..
ఎదురుకుండా టీవీ లేదు..
చదువుకోవడానికి పేపరు లేదు..
వినడానికి ప్లేయర్ లో battery లేదు..
టోటల్ గా ఇలా .. Enternaining గా నా ప్రయాణం మొదలయింది....ఆ తరువాత ఒక గంటన్నర లేని.. రాని .. మర్యాదలు చేసి.. వెళ్లిపోయేటప్పుడు .. ఇంక దిగు.. కూర్చుంది చాలు.. అనీ పంపించేసారు ఎయిరిండియా వారు.. మనలో మన మాట.. మొదటి సారి ఒక యంగు ఎయిరు హోస్టెస్ కనపడింది.. ఆ విమానంలో ఇలాంటివి చాలా అరుదు.. పెద్ద సినిమా హీరోలకు హిట్టు లాగ.. హి హి హి..

దిగి మా హోటల్ (హెల్ హోల్) వాడికి ఫోన్ చేసాను..

నేనూ :- "బయ్య. మే ఆయాహూ.." (ఆ...నేను తగలడ్డాను.. )
హోటల్ సోదరుడు : -హా కహా హి ఆప్ (దేశంనుద్దరించినట్టు ఎందుకంత కంగారు.. ఎక్కడున్నావ్ ???? )
నేనూ :- ఎయిర్ పోర్ట్ మే హూ.. ఆప్ కహా హి.. (తొక్కలో హిందీ .. నాకు రాదు.. నీకు అర్ధం కాదు.. )
హోటల్ సోదరుడు : - మేరె బంధ ఆగాయ వాహ.. అభి కాల్ కారేగా... (నీకు చుక్కలు చూపించడానికి ఒకడిని పంపాను వస్తాడు.. రెడీ గా ఉండు.)
నేనూ :- జి..జీ .. (సరే... ఏడు..)

అర్ధ రాత్రి.. ఏమో.. ! బాగా చలిగా ఉంది.. కానీ పట్ట పగలు లాగా జనాలు తెగ తిరుగుతున్నారు.. ఇక్కడ ఎవడూ నిద్ర పోడా..లేక నిద్దర పట్టని వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేస్తుంటారా..? ఎయిర్ పోర్ట్ అనీ కూడా లేకుండా.. గుప్పు గుప్పు మని సిగరెట్లు తాగుతున్నారు ఒక్కొక్కళ్ళు..

సిగరెట్టు అయితే.. కంపు గానీ.. వీళ్ళ స్టయిలు చూస్తే.. మాత్రం అబ్బబ్బ.. ఏముంది! అనీ పించింది.. దీని కోసమైనా ఒక సిగరెట్టూ పట్టుకోవాలి అనిపించింది.. అలవాటు లేని పని అవసరమా అనీ ఆగిపోయాను..

ఒక గంట.. తరువాత మా (నాకు.. బయ్యకి..)మధ్య.. కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గాక.... నా ఫోన్ లో బాలన్సు , ఒంట్లో ఓపిక.. అయిపోయాక.. నెమ్మదిగా ఒంటిగంటకు వచ్చాడు ఒకడు.. వాడి పేరు మనిష్ (వాడు మనిషా??).. క్లారిటీ ఉన్నవాటికి ఇప్పుడు చర్చలు వద్దు.. ముందుకు వెళ్దాం..వెళ్లి కాబ్ లో కూర్చున్నాక.. ఎయిర్ పోర్ట్ పార్కింగ్ డబ్బులు నా చేత కట్టించుకున్నాడు. ఆ డబ్బులు నాకు హోటల్ బిల్లో కట్ చెయ్యాలని.. చెప్పి మొత్తుకున్నాను.. ఇంతలో ఒక కార్డు తీసి ఇచ్చాడు.. కార్డులో సింఫనీ హోటల్ అనీ ఉంది.. నాకు అర్ధం కాలేదు.. అదేంటి. నేనూ మాట్లాడింది ఈ హోటల్ వాళ్ళతో కాదు అనీ. అడగ బోతే.. మీ హోటల్ వాడు నాతో మాట్లాడాడు.. భయ పడకండి అనీ.. భయపెట్టి తీసుకెళ్ళాడు.. ఆ హోటల్ కి ఈ హోటల్ కి నక్కకి నాగ లోకానికి ఉన్న తేడా.. నాకు అర్ధం అయ్యింది దెబ్బబడింది అని. వాడితో ఇంకో గంట చర్చ చేసి చిరాకు చేసి.. వేసి.. ఇద్దరం ఏదో ఒప్పందం కొచ్చాం.


హోటలుకు రాగానే.. రిసెప్షన్ లో కొన్ని ప్రశ్నలు.. టపి టపి మని వేసాడు.

నీ పేరు.. శివ చెరువు
ఊరు.. బెంగళూరు..
ఎందుకొచ్చావ్.. పనిలేక..
ఎన్ని రోజులున్తావ్? .. అదృష్టం బాగు పడేవరకూ..
ఈ హోటల్ కే ఎందుకొచ్చావ్ ..? దిక్కు లేక..
ఐడి కార్డు? - ఉంది..

నేనూ కొన్ని ప్రశ్నలు అడిగా.. ఊరికే ఉంటే.. అమాయకుడనుకున్తారని...

నీళ్ళు ? వాడుకోకూడదు ..
కర్రెంటు ..? గారంటీ లేదు..
ఇంటర్నెట్ ? పెట్టించలేదు ..
రూం ? నీట్ గా ఉండదు..
టీవీ ? ఉంది పని చేయదు..
కేబుల్ ? పైన సమాధానం చెప్పాను కదా..?
AC ? చలి కాలం లో అవసరమా?
హీటర్? మొదటి ప్రశ్న చూడు..

అక్కడితో అతని సమాధానాలకు నేనూ సంతుష్టుడనై.. తదుపరి చర్చలకి ముందుకు కదిలాను.. ముంబాయిలో ఏ హోటల్ అయినా మధ్యాన్నం 12 నుండీ తరువాత రోజు 12 వరకు మాత్రమే కవుంటు చేస్తాయట.. అంటే.. నేనూ రాత్రి రెండు గంటలకి వచ్చినా మధ్యాన్నం 12 గంటలకి వెళ్లిపోవాలి అనీ అర్ధం.. ఇప్పుడు అసలు చికాకు.. మొదలయింది..

ఫ్లయిటు లేటు..
కాబూ లేటు..
వచ్చిందా మాట్లాడుకున్న హోటలుకు కాదు.
డబ్బులా నాకే బొక్క..
టైమా మధ్యాన్నం 12 వరకే..
ఇంక.. ఆనందం నషాళానికెక్కి.. "సిగరెట్" అని గట్టి గా అరిచాను.. (దీనికి పెద్ద relevance లేదు.. ఇంటర్వెల్ అని చెప్పటానికి తప్ప..)
అలవాటు లేని వాడికి సిగరెట్లు ఇవ్వరు అని.. పంపేసారు.. నేనూ కూడా డిసెంట్ గా వాళ్లకి రెస్పెక్ట్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోయాను..----------------------------------------------------
ఇంతకీ నేనూ బొంబాయి ఎందుకు వచ్చానన్నది.. తరువాత బాగంలో విపులంగా చెపుతా.. ;)


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, December 20, 2011

కాలానికి ఇంత ప్రాముఖ్యత..?

కాలానికి నిన్న.. నేడు.. రేపు..
లేవు..!
అవి వున్నవే నాకే..

నాది అనుకున్న కాలం నిలబడదు..
అలానే నేనూ ఆగిపోలేను..
కలిసి కాలం, నేను కాసేపు ప్రయాణం చేస్తాం..

ఏదో ఓ రోజు నేను లేనప్పుడు.. ప్రయాణం ఆగిపోతుంది..
అప్పుడు కాలం కూడా ఎటో వెళ్ళిపోతుంది..


నిన్నటిలోనూ నిలకడగా లేదు ..
నేటికి నడక సరిగాలేదు..
రేపటికి ఎప్పటికీ చేరుకోదు...

అయినా ఎందుకో ఈ కాలానికి ఇంత ప్రాముఖ్యత..?


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, December 14, 2011

మనుగడ!
అదిగో బొమ్మ కనపడుతోంది..
పాత్రలు లేవు
వస్తువులు లేవు
సంఘటనలు లేవు
లక్షణాలు లేవు
లక్ష్యాలు లేవు
అయినా అది బొమ్మే..!

ఎక్కడినుండో ఒక పాట వినపడుతోంది
స్వరాలూ లేవు
వాయిద్యాలు లేవు
అక్షరాల వరసలు లేవు
గాత్రం లేదు
గాయకుడు లేడు
అయినా అది వినసొంపైన పాటే..!

దూరంగా ఓ దారి ఎదురుచూస్తోంది
దిశ లేదు
దశతిరగడం లేదు
అడుగు పడదు
నడక సాగదు
అయినా ఇది ప్రయాణమే
పుట్టుక నుండీ చావు వరకూ..!


జీవితం ఇలానే కదులుతోంది..
అర్ధరహితమైనా
అర్ధవంతమైనా
ముగిసే వరకూ...
షరతులు వర్తించే మనుగడ!

Sunday, December 11, 2011

అతడు నేనేమిటో!?

ఆలోచనలకు పుట్టుకనిచ్చినవాడెవ్వడు..
చేతలకు చేవ అయినదతడెవ్వడు..
చేసినదెవ్వడు..?

ఊపిరిని వాక్కుగ మలచిన వాడెవ్వడు..
ఆ మాటకు బలమెవ్వడు..
బదులెవ్వడు?

నయనములకు చూపెవ్వడు..
దృక్కుకు దృశ్యమెవ్వడు..
స్పందనకు భావమెవ్వడు?

చీకటికి నలుపెవ్వడు..
వెలుగుకు వరమెవ్వడు..
రేపగలు వాడెవ్వడు?

ఎవడో..!
ఎవడో..?

అతడెవరో? నేనెవరో?
అతడికి నేనెవరో?
అతడు, నేను ఏమిటో?
అతడు నేనేమిటో!?*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, November 29, 2011

జ్ఞాపకం..!


వెళ్ళిపోయింది పేరుకే..
లేదు..! అనుకుంటోంది నామ మాత్రానికే..

కాసేపటికి ధ్యాస అటు ఇటు అవుతుందేమో?
కన్ను సేద తీరడం కోసం రెప్ప పడనిస్తుందేమో?

కానీ..!

గురుతులు మరపు రానీయకున్నప్పుడు
నేటి నుండీ ఇంకా.. నిన్నటినే చూస్తూనే ఉన్నప్పుడు ..
ఎవరు మాత్రం వెళ్ళిపోయినట్టు..?
ఏది లేకుండా పోయినట్టు..?

వినక..
చెప్పనీయక.. వెళ్లక.. వెళ్ళనీకయక.. కట్టేస్తుంది.. కదిలిస్తోంది.
తనతో తీసుకుని పోతోంది....

ఎన్ని సార్లు చేసినా ఈ కాలం తో ప్రయాణం..
మళ్ళీ మళ్ళీ..
తప్పదని తీర్పు చెపుతోంది..

పాత్రలు..
సందర్భాలు..
వస్తువులు..
ఆ ప్రదేశాలు.

మళ్ళీ దర్సనమిస్తున్నాయి..
మళ్ళీ మళ్ళీ దర్సనమిస్తున్నాయి

అదిగో..
అదిగో..
ఎవరో కనపడుతున్నారు..
మాట్లాడుతున్నారు..

అస్పష్టం గా ఉన్న ఈ చలనం లో
స్పష్టంగా ఒక దృశ్యం కదులుతోంది..*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, November 14, 2011

డబ్బు వెనుక.. జబ్బు కనుక..?

ఏమిటో..
ఏమిటో..
ఉరకలు..
పరుగులు..

మనుషులొద్దు ..
మాటలొద్దు..
మాన మొద్దు ..
మనమొద్దు
ఎందుకనో?

ఆకలికి..
ఆరళ్లకు
కడుపుకు..
కరువుకు
వందనాలకు..
వందల నోళ్లకు
నిగ్గుకు..
నిస్సిగ్గుకు..
అన్నిటికీ ఒకటే మందు..
అన్నిటికీ అదే ముందు..

నేనే నీరై
నేనే వేరై..
పెంచుకున్న మాను ఇది..

ఇప్పుడు..
నేనంటే అదే..
అది కాక వేరు లేదు
ముఖ్యంగా నేనే లేను..
ఎందుకనో?

డబ్బు వెనుక..
జబ్బు కనుక..?


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Friday, October 28, 2011

ఆ మబ్బుల వెనుక ఏమున్నాయో? అని.
చాలాసేపటి నుండీ..
ఏవో ఏవో ఆకారాలుగా.. మబ్బులు కనిపిస్తున్నాయి..
వాటిని గాలులు ఎక్కడికో తోసుకు పోతున్నాయి..

ఆ మబ్బుల వెనుక ఏమున్నాయో? అని.
ఒక చిన్న ఆశతో నా కళ్ళు అటువైపే చూస్తున్నాయి..

కాసేపు దగ్గరగా వెళ్లి చూసోద్దామంటే
దూరం ఎక్కువుండి పోయింది.
దూరంగా చూస్తుంటే..
దగ్గరగా వెళ్ళే బుద్ధి, బుద్ధి మానుకోనంది..

వెలుగును ముక్కలు చేసి..
నగిషీలు చెక్కినట్టు.

కనురెప్పలు..
చప్పుడాపుకున్నట్టు

నిద్దుర లేచిన నీడలు..
వెలుతురును కౌగిలించుకున్నట్టు..

ఆనందం..
ఆకస్మిక తనిఖీ చేస్తున్నట్టు..

అప్పుడే..
అక్కడే పుట్టినట్టు.

నా ఆలోచనలు
పయనిస్తున్నాయి.. పరుగులు తీస్తున్నాయి..

అలా అలా ..మరి కాసేపటికి..
నేను అలిసిపోకూడదని ..
అంత ఎత్తు నుండీ..
ఆ మేఘాలు వర్షమై కదిలాయి.. ..

అభిషేకం జరిగినట్టు తడిసిపోయాను..
నేను..

ఆఖరికి చూసాను కదా..!
అక్కడ ఆకాశం అంతా తెల్ల మొహం వేసుక్కూర్చుంది..

శూన్యం చుట్టుకున్న..
లేమిలా..
అక్కడ నా ఆశలు తప్ప ఏమీ లేవు..

అటుపై...
ఏమీ లేని నా ఆశలు అక్కడ లేవు..*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, October 19, 2011

నీతో ఉన్నప్పుడు..

నీవేలే..
చెప్పని ఒక మాటైనా..

తలపుల తపనల గడి ..తడుతున్నా..
నీవేలే..

నీవేలే..
చప్పున చిర్నవ్వు దాచుకున్నా..

నన్ను దాటే నేను
నీవేలే..

నీవల్లే..
నీవల్లే...

తూరుపు నుండి ఓ గీతం పెదవి కదిపింది..
గతం చెరిగిపోయింది..
పూర్తిగా కాలం చనిపోయింది..
ఆశ్చర్యంగా.. నాలోని నిను చూస్తూ.. చూస్తూ..

ఆకాశం తల దించుకుంది..
వెన్నెలా చిన్నబోయింది..
వేకువా ఆగిపోయింది..
... మన కలయికను స్పృశిస్తూ...

ఆగిఉన్నా నాలో పరుగులు ఆగవు ..
ఊపిరికి తన ఉనికిని వెదకక తప్పదు..
కన్నులకు జాగరణ కాక దారి లేదు....
నన్ను కోల్పోతున్నానని తెలిసినా...
నేనేమి చేయగలను ..? ఇక
నీతో ఉన్నప్పుడు..

నీవైపోవడం తప్ప..!*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Thursday, October 13, 2011

ముగింపు తెలియదు వీటికెక్కడో..
వెన్నెలా ఎప్పుడూ ఉండదు..
సూర్యుడు ఎప్పుడూ చూస్తూనే ఉండడు..
చలికి చలేసినప్పుడు తప్ప రాదు..
వర్షమా..! వచ్చి పోయే అతిధి అంతే..
వీటితో పాటూ శాశ్వతం కానివెన్నో..!

ఇసకను వొత్తిన అడుగులూ
అలుపూ..
మజిలీలు
దూరాలు..
పరిచయాలు..
పరిస్తితులూ..
సంబరాలు..
సంబారాలు..
అన్నిటినీ స్పృశించీ కదులుతూ ఉంటుంది.. ఈ ప్రయాణం.

కొన్ని తీరాలు కలిసినట్టే ఉంటాయి..
కానీ ఎక్కడా కలవవు..
అలానే కొన్ని ప్రయాణాలూ మొదలవుతాయి..
ముగింపు తెలియదు వీటికెక్కడో..

ఆ తెలియని తనమే
నేటిని నిదురపుచ్చుతుంది
రేపటికి మేలుకొలుపుతుంది..

Saturday, October 8, 2011

నిన్ను ఎన్నుకుని నేను చేసిన తప్పుకా?నాయకుడా..
నాయకుడా..

ఒకటే..
కష్టాలు..
కష్టాలు..
కష్టాలు..
ఆరుస్తావా.. బాధ తీరుస్తావా..?

లక్షలు పోగు చేసుకుంటూ నువ్వు..
అక్షరాలు లేక నా పిల్లలు

తప్పులను కప్పుకుంటూ.. ఒప్పుల అతుకులతో నువ్వు..
ఎప్పుడు చినుగులు పడుతుందోనని వేసుకున్న బట్ట భయంతో.. నా యాలి

విద్యుత్ బిల్లుల పని లేని పేద్ద.. పేద్ద.. ఇండ్లలో నువ్వు...
చీకటి నిండిన గూడులో నేను

ఎక్కడికెళ్ళినా పది.. పాతిక మంది మూకతో నువ్వు..
అరక్షతో వీధిలో నేను..

టీవీలలో ఠీవిగా ప్రచారంలో నువ్వు..
కనీస గుర్తింపు కార్డు దొరకక నేను..

సర్కారు ఇచ్చే వాహనాలలో విహారానికి నువ్వు..
కర్చులకు జడిసి అటు ఇటూ కదలలేని నేను..

మిద్దెల మీద మిద్దెలతో ఇంకా విత్తు మత్తులోనే నువ్వు..
పన్నులకు.. నీ పంపకాలకు, .. ఇంకా పంతాలకు అప్పుల పాలైన నా కుటుంబం

పొరపాటున కాలం చెల్లి.. వెళ్లి పోయావా నువ్వు.. ?
బందులు.. పనికిమాలిన సెలవులు.. బలవంతపు అంజలి ప్రకటనలు...నాకు

నువ్వు ఉన్నా పోయినా ..
నష్టం నాకే ..

ఎందుకయా నువ్వు..?
ఉన్నది?

ఎవరికీ ప్రతినిదివి నువ్వు..?
నాకా?
నిన్ను ఎన్నుకుని నేను చేసిన తప్పుకా?
.
.
అయివుంటుంది..
అందుకే.. ఈ పశ్చాతాపం..
ఈ శిక్ష..

అవునూ..!
నువ్వు కాక పోతే.. మరొకడు వచ్చాడే అనుకో?
నా పిచ్చి గాని..
వాడు నన్ను ఉద్దరించేవాడని నమ్మకమేముంది..?
పట్టించుకోకు నేనన్న మాటలు..
ఏవో ప్రేలాపనలు..

చిన్నప్పుడు పెద్దవాళ్ళెవరో చెప్పారు..
తెలియని దైవం కన్నా.. తెలిసిన దెయ్యం మేలట

నేను మారను..
నువ్వూ మారకు..
మనమింతే..
మనకింతే..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, October 3, 2011

హాపి హైదరాబాద్...


వర్షాలతో సరిగ్గా నడవడానికి కూడా లేకుండా రోడ్లు..
ఎక్కడానికి లేకుండా బస్సులు..
అవసరానికి లేకుండా కరెంటు..
అవకాశాలు పెరిగిన ఆటోవాలాలు..
జీవనాధారం పోగూడని ఉసూరుమంటూ ఉద్యోగస్తులు..
సెక్యూరిటీ లేని సెక్యూరిటీ గా పోలీసు సోదరులు
ధరలు పెరిగి నెత్తి నోరూ బాదుకుంటున్న సామాన్య జనం తో..
మీరు బాగున్నారా ? అంటూ దూరవాణి ప్రశ్నలు..

ఆశలు ఆశయాలు..
కలిసిలేక.. కలవలేక..

తినడానికి..
వినడానికి..
ఉండడానికి..
ఊరట చెందడానికి..
భయానికి..
భాద్యతకి..
తరుణోపాయంలేక..
తప్పక..
బ్రతకడానికి..

మొత్తంగా హైదరాబాదు క్షేమంగానే ఉంది..

Tuesday, September 6, 2011

నిన్న తెలియదు.. నేడు తెలిసింది.. రేపు ఉండవు..

ఏది ప్రపంచమయిందో ఇన్నాళ్ళు..
అదే చలించి పోతున్నప్పుడు..

ఏది నిర్మాణమై ఉన్నదో ఇన్నాళ్ళూ..
అదే శిధిలమై పోతున్నపుడు

ఏది నేను అయిందో ఇన్నాళ్ళూ ..
అదే నశించి పోతున్నపుడు

దూరాలతో సంభందం లేక అయినవారివెవరివో గుండెలు పగులుతున్నై..
ఎవరివో మాటలు కొన్ని లక్షలు, జాలిని ప్రసవిస్తున్నై..
మరి ఎవరివో కొన్ని చూపులు, కన్నీటిని ప్రసరిస్తున్నై..
ఎవరి కోరికలో కత్తులు అయి వేగంగా దూసుకు వస్తున్నై..
అక్కడే ఎక్కడో ఇంకెవరిదో అసూయ చల్లబడే ప్రయత్నం చేస్తోంది

నాన్నా..
అన్నా ..
కన్నా ..
అని ఒకటే పిలుపులు...ఏడుపులు.. అక్కడి నుండే.. వినపడుతున్నాయి..

వద్దని..
వద్దంటే వద్దని..
వదలి పోవద్దని
రోదనలు.. ఒకటే విపరీతమైన ప్రవర్తనలు..అక్కడే.. అక్కడే..తచ్చాడుతున్నాయి.

ఎవరూ తోడుగా రాకుండా
ఒంటరి ప్రయాణం..

ఎవరూ వెంట లేకుండా
వెళ్లిపోవాలనే ఆరాటం..

ఎదురు చూపులకు అందకుండా
ఆఖరి పయనం..

ఇదే
నిన్నటికీ..
నేటికీ..
రేపటికీ..
తేడా..

ఇదే ఒకరికి ఒక ప్రపంచం నుండీ నిశ్చలత్వం లోకి మొదటి అడుగు ...
ఇదే ప్రస్తానం ముగిసిన అదే ఒకరి మరో ప్రపంచంలోకి పరుగు..
అవును ఇదే...

Wednesday, August 31, 2011

నేను = ప్రశ్న
ఆకాశం రాత్రికి తన రంగు మార్చేసింది..
సూర్యుడు వెళ్లి పడుకున్నాడు..
వర్షం రావడంలేదని గాలి పిచ్చిదానిలా గోల చేస్తూ తిరుగుతోంది..
చెట్లూ.. మొక్కలూ.. అటూ ఇటూ చూడద్దని బలవంతంగా తల వంచుకుని ఉండిపోయాయి..
విలాసాలపాలు పడి అలసిపోయిన వారు ఇంటికి పోయారు..
పగలల్లా వినపడిన ఆ సత్యాసత్యాల వాదనల రోద ఇప్పుడు ఆగిపోయింది..
వీధికుక్కలు మొరిగి మొరిగి ఏ మూలకో పోయాయి..
ఆకలితో ఏడ్చి ఏడ్చి పడిపోయిన ఓ ముసలిదాని కన్నీళ్లు ఉప్పు మరకగా రూపాంతరం చెందాయి..
చూసే వారు లేక చూడలేని లోకాలకు పోయిన కొంతమంది శవాల గుట్టలు మళ్ళీ తయారయ్యాయి.
భయానికి కూడా భయమేస్తుందేమో అన్నట్టు ఉన్న ఈ రాత్రి సెక్యూరిటీ గార్డు కూడా కళ్ళు మూసుకున్నాడు
ఇప్పుడు తిరిగే పంకాలు ఆగిపోయినా .. విద్యుత్ దీపాలు వెలగకపోయినా.. ఎవ్వరూ అడగరు..
మంచి చెయ్యమని ... మనిషిగా ప్రవర్తించమని ఎవ్వరూ గుర్తు చెయ్యరు..
ప్రపంచానికేదో ఇవ్వాలని... పదే పదే తపించే పుస్తకాలూ పలకవు..
జాతీయ గీతం పాడే గొంతుకలిక లేవనే లేవవు..

నేను మాత్రం ఇంకా కళ్ళు తెరుచుకునే ఉన్నాను..
ఎందుకో మరి?
ఈ శూన్యంలో ఏ తెలియని ప్రశాంతత వెతుక్కోవడానికో ?
నేను మేలుకొని ఉన్నానని గుర్తించడానికో ?
రేపటి ఉదయాన ఎవరినో మేల్కొల్పడానికో?

Tuesday, August 23, 2011

స్వేచ్చగా స్వాతంత్ర్యం ఇచ్చేస్తున్నారు..
కావాలట
కావాలట
స్వాతంత్ర్యం కావాలట..
ఏడ్చారు..
గుండెలు బాదుకున్నారు..
పోరుకు పోయారు..
పోయారు..
మొత్తానికి తెచ్చుకున్నారు..

వద్దట..
వద్దట
దాస్యం వద్దట..
తపించారు..
తపస్సు చేసారు..
తన్నుకు చావద్దని..
తలఎత్తుకుని అడ్డుగా నిలబడ్డారు..
మొత్తానికి విముక్తులయ్యారు..

తరువాత ఆ కష్టాన్ని వారసులని చెప్పుకునేవారు అంది పుచ్చుకున్నారు..

ఇక్కడ..
ప్రతి ఒకడూ హిరణ్యకసిపుడే..
ప్రతి ఒకడూ రావణుడే..
ప్రతి ఒకడూ భస్మాసురుడే..
ప్రతి ఒకడూ దుర్యోదనుడే..
ప్రతి ఒకడూ కలి పుత్రుడే..

వీరి ఆద్వర్యంలో ఇపుడు..
ఆత్మ సాక్షిని కాలబెట్టే శ్మశాన వాటికల నిర్మాణం
నిర్విగ్నంగా కొనసాగుతోంది.

అంతర్ముఖంలో రాక్షస కోణపు నిర్యాణం
నిత్యం భగ్న పడుతూనే ఉంది..

తరానికి తరానికి అంతరాలు
పెరుగుతూనే ఉండేట్టు ఏర్పాట్లు చేసారు ..

నిస్సిగ్గుకు నాగరికత అనే
నామ కారణం చేసారు.

తప్పు ఒప్పులకు తేడాలను చూపే
త్రాసులో తక్కెడలను తుంచి వేసారు..

కర్తవ్యానికి ఓ రోజు సెలవు కోసం
స్వ'తంత్ర' వేడుకలు ఏర్పాటు చేసుకున్నారు

విలువలు వదిలి విహరించడానికి
సత్యానికి బిగిస్తున్న ఉరిని సరి చూడడానికి..
అభివృద్ధి పేరుతో నాశనం తెచ్చుకోవడానికి..
కాలానికి
కలానికి
నడకకు
నగ్నతకు
వాక్కుకు
వారసులకు
స్వాతంత్ర్యం ఇచ్చేస్తున్నారు..

స్వేచ్చగా
స్వేచ్చగా
స్వాతంత్ర్యం ఇచ్చేస్తున్నారు..
Sunday, August 14, 2011

కాక మరేమని?ఎక్కడిదీ ఈ నిశ్శబ్ద గానం..
ఎక్కడిదీ ఈ అవ్యక్త భావన..
ఎక్కడిదీ ఈ స్పృశించే భావం..
ఎక్కడిదీ నిశ్చలత్వంలో వేగం..
ఎక్కడిదీ నదిలా పరుగులు తీసే ఈ స్పందన..
ఎక్కడిదీ తేలిక పడుతున్న భారం..
ఎక్కడిదీ వెలుగును చూస్తున్న వేకువ..
ఎక్కడిదీ చీకటికి చీకటిని చుట్టేస్తున్న చేయూత..
ఎక్కడిదీ వెనుకకు లాగే యోచనను నిలిపి వేస్తున్న శక్తి..

ఎక్కడి నుండి జనియిస్తోంది..?
ఎక్కడి నుండి ఉదయిస్తోంది?
ఎక్కడి నుండి మొదలయిందీ? ఇది

ఏమిటీ మైత్రి నాతో నాకు..?
ఏమిటీ సృజన నాలో?

ఏమననూ దీనిని..?
ఆనందమని కాక మరేమని?


Wednesday, August 3, 2011

ఆమెతో - కధ రెండవ భాగం
ఆమె తో మొదటి భాగం ఇక్కడ చదవగలరు.

ఈమె అర్ధం కావడం లేదు..
ఏమీ పట్టనట్టు .. నేనంటే పడనట్టు ఉంటోంది.. ఇప్పుడేమో వచ్చి ఇదే ఆటోలో ఎక్కింది. ఇప్పుడు నేను ఏమర్ధం చేసుకోవాలి? కాస్త పాసిటివ్ గా ఆలోచిస్తే..ఈమెకి నామీద మంచి అభిప్రాయమే ఉండి ఉంటుంది...లేకుంటే ఎందుకు వచ్చి నాతో ప్రయాణం చేస్తుంది..? లేదు లేదు ఉంటే నాతో ముందే మాట్లాడి ఉండేది. ఏదో అవసరం అంతే..మరింకేమీ కాదు. లోపల ఆలోచనలు రెండు రకాలుగా తిరుగుతున్నాయి.. అయినా ఈమెకి నామీద ఉండే అభిప్రాయంతో నాకేమి నిమిత్తం? అసలు ఈమె వెనుక నా ఆలోచనలు ఎందుకు పరిగెడుతున్నాయి?

కొత్తగా చేరిన సహఉద్యోగి అని పరిచయం చేసుకోవడం నా ప్రయత్నం కాదు..
నేను అని ఇక్కడ ఒకడిని ఉన్నాను అని ఆమెకి తెలియడం కాదు నాకు కావలసింది..
కలిసి బయలు దేరాము కనుక కాసేపు మాట్లాడాలనే ఊహ లేదు నాలో..
ఏదో ప్రత్యేకత ..
మరి ఏమై ఉంటుంది? కారణం..?
ఇది కాస్త లోతైన విషయమే.. చెప్పలేను..వివరణ లేదు దీనికి.. నిజమా కదా అని ఒక్కోసారి నన్ను నేను తడిమి చూసుకుంటాను.. ఆమెని చూసినపుడల్లా..

కొంత కాలంగా గమనిస్తున్నాను.. ఒక ఆకర్షణ ఆమెని చూసినపుడల్లా.. మునుపెన్నడూ ఆమెతో నేను మాట్లాడి ఎరుగను. ఇదే మొదటి పరిచయం. అయినా నాకు మొదటి పరిచయంలోనే ఇంత కంఫ్యూషన్ ఇంత హెసిటేషన్ ఉంటే.. రేపటి నుండీ నేను ఈమెతో ఏం మాట్లాడతానో.. ఎలా మాట్లాడతానో.. ? ఎక్కువగా నాతో నేను మాట్లాడేస్తూ గడిపేస్తున్నాను.. అయినా ఆ మాటల నిండా ఆమె ఉంది...

ఆలోచనలను కట్టేస్తున్నట్టు ఆమె మాట్లాడడం మొదలు పెట్టింది.. నా పేరు.. అనన్య , మీ పేరు అభిరామ్ అట కదా? ఇందాక ఆఫీసులో చెప్పారు.

ఏం చెప్పారో? మంచిగా చెప్పరా .. మరో రకంగా ఏమైనా చెప్పారా? మనుషులు ముందు ఒక రకంగా మాట్లాడతారు.. వెనుక మరో రకంగా మాట్లాడతారు.. వాళ్ళు మునుపే చాలా మంది గురించి వాళ్ళు ఎదుట లేనపుడు అసహ్యంగా మాట్లాడుకున్నవి నేను విని ఉన్నాను. వీళ్ళకి వేరొకరి గురించి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వస్తుంది అసలు? బహుశా జీవితంలో ఎక్కువ శాతం వీళ్ళు ఇతరుల గురించిన వ్యంగ్య వ్యాఖ్యానాలకోసమే వెచ్చిస్తారు కాబోలు..! అసలు ఈమెతో ఎవరు నాగురించి చెప్పారు? ఏమని?

నేను అడిగే అవకాసం తను నాకు ఇవ్వలేదు.

కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్న ప్రొమోషన్స్ కి సంభందించి లిస్టు వచ్చిందిట. అందులో మొదట మీపేరు ఉంది అని అందరూ చెప్పుకుంటున్నారు. congratulations అని ఆమె తన మాటను కొనసాగించింది. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారుట..? ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎర్లీ గా వెళ్ళిపోయాడు ప్రొమోషన్ సంగతి ముందే తెలిసి సెలెబ్రేట్ చేసుకోవడానికి అని అనుకుంటున్నారు.. పూర్తి చేసింది.

నేను అనుకున్నంత reserved కాదు ఆమె. పరిచయం ఉన్న వాళ్లకు మల్లె మాట్లాడేస్తోంది. ఒక వేళ నాకు అవకాసం ఇచ్చినా ఇంత చొరవగా నేను మాట్లాడేవాడిని కానేమో?

"ఇంతకు ముందు మీరు ఈ వే లో వెళ్ళడం నేను చూసాను. నేను ఈ రోజు ఇప్పటికే ఆలస్యం అయ్యాను. కనుక కాస్త త్వరగా వెళ్ళవలసి వచ్చి మీ హెల్ప్ అడిగాను. ఒక బర్త్ డే పార్టీ ఉంది."

"ఎక్కడ?" అసంకల్పితంగా అడిగాను నేను.

'శివాజీ నగర్ లో'

"పరవాలేదు లెండి అది నేను వెళ్ళే దారిలోనే ఉంది.. అక్కడి నుండీ ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఇల్లు"

ఆ తరువాత ఒక రెండు నిమిషాలు ఇద్దరి మధ్యన మాటలు లేవు. ఆమె మాట్లాడడానికి ఏమీ లేదు. నేను ఏమి మాట్లాడాలో తెలియదు. మాట్లాడితే ఎమనుకుంటుందో అని కాబోలు? అమ్మాయి మాట్లాడితే చొరవ .. అదే అబ్బాయి మాట్లాడ ప్రయత్నిస్తే మరేదో అర్ధం ఉందంటారు .. అది వేళాకోళమైనా అందులో నిజం లేక పోలేదు.

"ఎలా వుంది ఆఫీసు వాతావరణం?" అడిగాను నేను..

"బానే ఉంది.. ఇంకా అలవాటు పడాలి.." తల పైకి కిందకీ ఆడిస్తూ చెప్పింది.

కాస్త విశాలమైన నుదురు.. చంద్రుడు వంపులు తిరిగి ఉన్నాడా అన్నట్టు కనుబొమ్మలు.. మధ్యలో చిన్న బొట్టు.. దానికి అంటి ఉన్న కాస్త కుంకుమ.. లేత గోధుమ రంగు కన్నులు. కన్నుల మీదకు పడే జుట్టు ను ధిక్కరిస్తూ, రెప రెపలాడిస్తూ కనుబొమ్మలు.. అందమైన రాళ్ళ మధ్యలో అమర్చ బడ్డ జలపాతపు రూపు మల్లె ముక్కూ.. ఎరుపు రంగుకు కాస్త దగ్గరగా పెదవులు.. తెల్లని ఛాయా..

అమ్మాయిలు ఇంత అందంగా ఎందుకు ఉంటారు???? ఈ ప్రశ్న ఆమెని నేను అడగలేదు.

మీరు ఎప్పటి నుండీ ఇక్కడ పని చేస్తున్నారు?

"ఒక రెండు సంవత్సరాలయింది" సమాధానమిచ్చాను.

ఏం చదువుకున్నారు?

" MCA " ఇక్కడే యూనివెర్సిటి నుండీ చేశాను.. మళ్ళీ చెప్పాను

ఓహ్! మంచి తెలివితేటలున్నవాళ్ళన్నమాట ..మీరు? నవ్వింది..

నేనూ నవ్వి ఊరుకున్నాను..

ఆమె మాట వేగంగానూ లేదు.. అలా అని మెల్లగా మాట్లాడనూ లేదు.. మధ్యస్థం గా ఉంది. మాట్లాడాలా వద్ద అన్నట్టుగా లేదు ఆమె మాట..మాటలో స్పష్టత కనపడుతోంది.

మీది ఈ ఊరేనా? ఈ సారి ప్రశ్నించడం నేను మొదలు పెట్టాను..

"లేదండీ.." ఈ మధ్యనే నాన్న గారికి ట్రాన్స్ఫర్ అయ్యింది.. డిల్లీ నుండీ వచ్చాము మేము

తెలుగు బానే మాట్లాడుతున్నారు.. కొనసాగించాను నేను.

మేము తెలుగు వాళ్ళమేనండి కానీ కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నాము అంతే.. ఆమె పూర్తి చేసింది.

మీరేమి చదువుకున్నారు? అని అడిగే లోపే ఆమె వెళ్ళవలసిన శివాజీ నగర్ వచ్చేసింది..

ఉంటాను అని అక్కడ దిగేసి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు కనీసం థాంక్స్ అని కూడా చెప్పలేదు..

నేను మాత్రం మొదటి సారి సిటీలో ట్రాఫిక్ ఎక్కవ లేనందుకు చింతిస్తూ 'ముందుకు వెళ్ళమని' ఆటో అతనితో చెప్పాను ..

ఆ సందు తిరిగేంత వరకూ నా చూపులు అటు వైపే నడిచాయి.. మరి కాసేపటికి నేను దూరంగా వెళ్ళిపోయాను..

To be continued ...

Thursday, July 28, 2011

ఒక అర్ధం లేని ప్రశ్న ...కలలకు మెలకువా?
కన్నులకు తీరని ఆకలా?
ఊహలకు వీధి దీపమా?
నిను దాటిన ఆలోచనలకు సంకెలా?
నీ వెనుక నా పరుగులకు వేగమా?
ఏది వీటిలో నీ చూపుకు అర్ధం?

నిదుర చెడినా నీవే..
గాలిలో రాతల నిండుగ నీవే..
అస్పష్టంగా కదలిపోయే ఆ మేఘాల రూపులో నీవే..
వెనుక చుక్కలూ నీవే..
రాతిరి చలికి వెచ్చదనమై నా అంత దగ్గరగా నీవే..
నేనలవాటు పడిన ఆశ్చర్యానివి నీవే..
ఈ వరుసకు లయ నీవే..

అన్నీ నీవై పోతున్నపుడు...
నా ప్రశ్నకు అర్ధమేముంటుంది ..
అయినా అది ఒక పిచ్చి ప్రశ్నే అవుతుంది...*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, July 25, 2011

ఎవరి వ్యతిరేకత అది?ఆకాశం పగిలి నెత్తిమీద పడుతున్నట్టు ఉంటుందా?
ఏకాంతంలో ఎవరి పాట వారికి కూడా వినపడనట్టు గా ఉంటుందా?
కలిసే యత్నంలో కెరటం కసిగా తోసేసినట్టు ఉంటుందా?
ఆకాశంలో సూరీడు తన శక్తిని అంతటినీ బరువుగా బుజాలపై వదిలేసినట్టు ఉంటుందా?
నిప్పు కణికలు వడగళ్ళు అయి వర్షిస్తున్నట్టు ఉంటుందా?
నిశి అన్ని రంగులని తొక్కిపెట్టినట్టు ఉంటుందా?
నీడలు కూడా దొరకని మనిషి రూపమల్లె ఉంటుందా?
అంతరంగాన అఘాదం ఊడలై వేళ్ళూనుకుపోయినట్టు ఉంటుందా?
అంతః చక్షువులు పొడుచుకున్నట్టు ఉంటుందా?

ఎంత భయంకరంగా ఉంటుంది ?
వ్యతిరేకత?

ఎవరి వ్యతిరేకత అది?
ఎవరి పై వారి వారిదై ఉంటుంది..
అందుకే అది అంత ప్రమాదమైనది
అంతగా భయానకమైనది
అంత భరించరానిది..

చివరకు మిగిలేది - బుచ్చి బాబు

చివరకు మిగిలేది - పుస్తకం ఎప్పటి నుండో చదవాలి అని ఆలోచన.. కానీ కుదరలేదు.. ఎందుకు?

కొనడానికి బద్ధకం.. - ఒక లక్షణం
షాపుకు వెళ్ళాలి అనేంతగా ఆ పుస్తకంలో ఏముంది? - ఒక అనుమానం
మతి మరపు.. - ఒక జబ్బు
ఇప్పుడు చదవాలి అన్న ఆత్రుత లేకపోవడం - ఒక అమాయకత్వం
ఇంకా ఇంకా.. ఇంకా

అవును నిజమే "మనిషి తన చేష్టలకు ఎప్పుడూ ఏవో కారణాలు వెతుక్కుంటూ ఉంటాడు".

కారణాలు ఏవైనా ఈ పుస్తకం చదవడం లో అనుకున్న సమయానికన్నా జాప్యం చేసాను. పుస్తకం కొని చదవడం మొదలు పెట్టేముందు ఎవరినో తెలిసినవాళ్ళని .. (నాలాగ .. కాదు కాదు.. నాకంటే చాలా ఎక్కువగా పుస్తకాల పురుగులైన వారినే) ఆ పుస్తకం పై వారి అభిప్రాయం అడిగాను... ఆ పుస్తకమా ఎడుకుకొన్నావు దండుగ.. ఇప్పటికే నేను రెండు సార్లు చదివాను. అర్ధం కాక మధ్యలోనే వదిలేసాను. నా జీవితం లో రెండు సార్లు చదివినా పుస్తకమంటే అదే తెలుసా? అడిగితే ఆ పుస్తకమేదో నేనే ఇచ్చేవాడిని.. అన్నాడు. మరొకరు అది ఏమిటో తెలియలేదు అని అనేసారు.

ఇదేమిటి ఈ పుస్తకంలో ఎముందబ్బా?
అనవసరంగా కొన్నానా?
ఇప్పుడు చదవాలా వద్దా?
కొట్టువాడు వెనుకకు తీసుకోడు.. అయినా కొన్న పుస్తకం వెనుకకు ఇచ్చే అలవాటు.. ఆలోచన నాకు లేవు..
అసలు అంత అర్ధం కానీ విషయం ఏముంది ఈ పుస్తకంలో?
అసలిది పుస్తకమేనా మరే లిపిలో రాసిన ఆదిమానవుల చరిత్రా?

ఏమో ? ఏముందో ? కానీ ఈ పుస్తకం చదవక మునుపే ఇందులో ఏదో ఉంది అనేది నా నిశ్చిత అభిప్రాయం.. ఆ అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో నాకూ తెలియదు. అదే నన్ను పుస్తకం కొనేదాకా..ఇప్పుడు ఈ పుస్తకం ముందు కూర్చునేలా చేసింది.

సరే.. చదివేస్తే పోలా! ఒక తెగింపు.. ఒక పనికి నన్ను నేను పురికోల్పుకున్నాను.. ఏ పుస్తకం చదివినా మొదట ముందు మాట నుండీ చదవడం నా అలవాటు.

రచయిత బుచ్చిబాబు అన్నారు.. ఈ పుస్తకంలో ఏముందో? నాకు చాలా లోపాలు కనిపించాయి.. ముద్రణకు కావాలి అని అంటే.. గతంలో పత్రికలలో అచ్చు వేయబడ్డ ఈ సీరియలు అంతా అట్ట కట్టి ఇచ్చేసాను అని.

మొదటి కొన్ని పేజీలు సరిగా అర్ధం కావడం లేదు. యాస.. రచయిత శైలి.. వగైరా వంటివి..

అలా అలా చదువుకుంటూ వెడితే.. పూర్తిగా పుస్తకం పూర్తి చేస్తే. నాకు 267 పేజీల కవిత్వం కనపడింది. మనిషి ఆలోచనలు.. అనుభవాలు.. ఎలా పెర్సీవ్ చేసుకుంటాడో ఆయన అద్భుతం గా రాసారు.

సరే..
నేను చెప్పదలచినది ఏమంటే..

ఇది నేను చదివిన ఉత్తమ పుస్తకం అని..

అయితే ఒక లోపమేమంటే.. (లోపం అనొచ్చో లేదో తెలీదు నాకు) కానీ కధ అంతా ఒక దయానిది అనే పాత్ర (మగ పాత్ర) ను పెట్టి నడిపించి అతని దృక్కోణం లోనుండి మాత్రమే కధను నడిపినట్టు అనిపించింది.
మరిన్ని పార్శ్వాలు కనపరచి ఉంటే ఇంకా గొప్పగా అనిపించేదేమో..

ఇది విమర్శా కాదు.. విశ్లేషణ కాదు. అభిప్రాయం మాత్రమే..

శివ చెరువు

Monday, July 18, 2011

అదే అర్ధం కాని ..నన్ను నేను కనుగొంటున్నాను

నిరంతరం అంతరాయం లేని..
ఒక శబ్దం .. ఒక హోరు.. లోపల నుండీ..
ఆ సముద్రం యేమని చెపుతోందో.?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని సంగీతం వినపడుతోంది..

అలుపు, విసుగు లేని ..
ఓ స్పర్శ.. ఓ పలకరింపు.. లోపల నుండీ..
ఆ సముద్రం ఎందుకు ఓదారుస్తోందో?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని చనువు దగ్గరగా అనిపిస్తోంది..

ఆగిపోవడం ఆగడం లేని
ఆ నడక.. ఆ నాట్యం.. లోపల నుండీ..
ఆ సముద్రం ఎటువైపుకు పయనిస్తోందో?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని దృశ్య కావ్యం గోచరిస్తోంది..

తిరగపడ్డ పడవలు
విసుగుపడ్డ సుడులు
ఎగసి పడే కెరటాలు
కాన రాని నిధుల శిధిలాలు
నురగలు కడిగే అరుగులు

తెలుసుకుందామని ప్రయత్నిస్తే..
నన్ను నేను కనుగొంటున్నాను

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, July 13, 2011

ఉన్నది నీవే.. మిగిలిపోతున్నదీ నీవే!
నీరుగారిపోకు
దారినుండి జారి పోకు
వెనుకకు నీ అడుగులు పడనీకు..

పద..
పద ..
ముందుకు పద..

రేపటితో పరిచయం ఎవడికి?
నిన్నలో నిలిచిపోయే అవకాసం ఎవడికి?
నీకా?
నాకా?

తప్పు చేస్తావా?
చేయి!
ఈ రోజు కాకుంటే రేపటి రోజును..దక్కించుకుంటావ్ ..

కానీ తప్పుకుపోతావా?
పో!
పో!
పోతే పో!
శాశ్వతంగా పో!
అదే రేపటి రోజు పూర్తిగా అనంతమైన చీకటిలోకి తోయబడతావు..
ఆ కారు చీకట్లు కూడా నీ సృష్టి అని గురుతుకొచ్చినప్పుడల్లా. నీ నీడ నిన్ను భయపెడుతుంది...

ఇంకెవరో వచ్చి నడిపిస్తారని
నువ్వెదురు చూసే ఆ ముహూర్తం
లేదని.. రాదనీ నీకూ తెలుసు

సరిపెట్టుకునే..
సర్దుకుపోయే..
సరదా రోజులు అయిపోయాయి.. వెళ్ళిపోయాయి.

ఉన్నది నీవే..
మిగిలిపోతున్నదీ నీవే!

సమస్య నీవైనపుడు..
ఆ పరిష్కారమూ నీవే అయి ఉండాలి..

ప్రశ్నలు నీవైనపుడు..
బదులూ నీవుగానే మారాలి

పద..
పద ..
ముందుకు పద..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Sunday, July 10, 2011

అందుకే మనమధ్య ఏ మాటలూ మిగలలేదు'నేను' అని అనుకున్నపుడల్లా..
'నీవు' అని తెలుసుకుంటున్నాను..
'నా' జాడ తెలియనపుడల్లా
'నిన్ను' వెతుకుతున్నాను..

నిలుపలేను నిమిషమైనా నా నడక
నీతో ..

క్షణ కాలం కనపడవు ఏమో?
గుండె చప్పుడు ఆగిపోయినట్టవుతుంది నాకు

మరి కాసేపటికి ఎదురవుతావా?
వేల సంవత్సరాలకు ఊపిరి పోసినట్టవుతుంది మళ్ళీ..

ఎన్ని లక్షల సార్లు జన్మించానో
ఎన్ని వేల కోట్ల ఊహలకు ఊపిరినిచ్చానో
నీవే నిండుగా..

ప్రతి ఉదయం రంగుల వెలుగై నిలిచింది.
చీకటికి ఎప్పటికీ సెలవే మిగిలింది..
నీవే నిండగా..

నిజముగా నిజం..
నువ్వు మాత్రమే నా నిజం..

నీతో నే చెప్పని ఈ మాటలు..
'నీ' 'నా' 'మన' దగ్గరతనంలో నీవెప్పుడో తెలుసుకున్నావన్న సంగతి నాకూ తెలుసు..

అందుకే మనమధ్య ఏ మాటలూ మిగలలేదు


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, July 6, 2011

నిశ్శబ్దం మాట్లాడుతోంది..

ఒక అద్భుతం దర్శనమిచ్చినపుడు

ఒక ఆశ్చర్యం తలుపు తట్టినపుడు

ఒక శోకం నిదుర చెడినప్పుడు

ఒక దూరానికి అడుగుల అవసరం లేనపుడు

ఒక నమ్మకం నిశ్చలమైనపుడు

ఒక ఎదురుచూపుకు పనిలేనపుడు

ఒక భాషకు కన్నులు రచన చేస్తున్నప్పుడు

ఒక నువ్వు ఒక నేను లేనప్పుడు

ఒక మాటకు మాటలు లేనపుడు

నిశ్శబ్దం మాట్లాడుతోంది..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, July 5, 2011

ఆమె తో..

తను వెళ్లి పోతోంది.. నాకు ఇంకా పని వున్నా.. నేను బయటకి వచ్చేసాను..సిస్టం కూడా షట్ డౌన్ చేయలేదనుకుంటా..! కాస్త తొందరలో ఉన్నాను మరి.

కొంత మందికి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచనే ఎప్పుడూ కూడాను.. అలాంటి వాళ్ళ కళ్ళు నామీద పడ్డాయి. నేను పట్టించుకోకుండా లోపలినుండీ వెలుపలకు వచ్చేసాను.

ఈరోజు ఎరుపు రంగు శారీ వేసుకుంది. ఆమెని చీరలో చూడడం ఇదే మొదటి సారి నాకు. అసలే ఆ రంగంటే ఇష్టం నాకు, అందునా శారీ..ఇప్పుడు నాలో కవి పుట్టుకొస్తాడేమో అని అనుమానం వచ్చేసింది. అమ్మాయిలు ఎప్పుడూ అందంగానే ఉంటారు. పైగా అదే అమ్మాయిలు కొత్తగా కనిపించినప్పుడు కాస్త ఎక్కువ అందంగా కనపడుతుంటారు.

తననే అనుసరిస్తున్నాను. ఆమె గమనించే ఉంటుంది, కాని నేను వెనుకే ఉన్నట్టు తనకి తెలియనట్టు ముందుకు వెళుతోంది. అమ్మాయిలు ఎప్పుడూ ముందు అబ్బాయిలే చొరవ తీసుకోవాలని చూస్తుంటారని గుర్తుకొచ్చింది. Friday కావడం మూలాన సాయంత్రం ఏదో బయటకి వెళ్ళే ప్లాన్ వేసుకుందని తెలుసుకున్నాను. తన పొడవాటి జుట్టు ముడులు వేయకుండా అలానే వదిలేసింది. ఆమె నడుస్తుంటే అవి కూడా నాలాగే ఆమెననుసరిస్తున్నాయేమో అనిపించింది నాకు.

ఆమెని పలకరించడానికి ఉపక్రమించాను..excuse me .. హలో మిమ్మల్నే.. కొత్తగా చేరినట్టునారు కంపెనీలో?

"అవును" ముక్తసరిగా సమాధానమిచ్చింది ఆమె.

"అదే ఆ రిపోర్టింగ్ టీం లో చూసాను మిమ్మల్ని" అని ఏదో చెప్పబోయాను. ఆమె నా మాటలకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు లేదు. "నేను మీ నెక్స్ట్ block లో పని చేస్తున్నాను" కొనసాగించాను.

వెనక పడే వాళ్లకి అమ్మాయిలు ఎంత ప్రియారిటి ఇస్తారో తెలిసింది అప్పుడు నాకు. ఒక్క క్షణం నన్ను నేను తిట్టుకున్నాను "నీకు ఇవ్వన్నీ అవసరమా?" అని. కాని ఆ ఎరుపు రంగు శారీ గుర్తుకు వచ్చి మళ్ళీ ఓ అడుగు ముందుకు వేసాను. దగ్గర దగ్గర ఇద్దరం కలిసే నడుస్తున్నాం కాని ఓ నిమషం ఏం మాట్లాడుకోలేదు.
ఆమెని పలకరించినప్పుడు నన్ను చూసిన ఆమె కళ్ళు మాత్రం ఇంకా నాకు అలానే కనపడుతున్నాయి.

ఆఫీసునుండీ బస్టాప్ ఎంతో దూరంలో లేదు. రెండు నిమిషాలు నడక అంతే. ఈ రెండు నిమిషాలు ఆమెతో పాటే నడుస్తూ అడుగులు లెక్క పెట్టుకుంటున్నాను. అడుగువేస్తే నేల కందిపోతుందేమో అన్నట్టు నడుస్తోంది ఆమె... గాలికి, దూది పింజె మెల్ల మెల్లగా ముందుకు వెడుతున్నట్టు..నిశ్సబ్దంగా ఒక లయతో ఉంది అది. ఎక్కడ అందంగా కనిపించదు ఈమె నాకు? అనే అనుమానం వచ్చింది.

.
.
.
.
.

ఇప్పటికే చాలా సేపు అయ్యింది ఇక్కడికి వచ్చి. బహుశా ఒక అరగంట దాటి ఉంటుంది. బస్సులు రావడం లేదు. మొదటిసారి బస్సు టైం కి రాకపోవడం నచ్చింది నాకు. ప్రతి నిమిషానికీ చేతి గడియారం చూసుకుంటోంది. ఎదురుచూపులు..కాస్త విసుగు..కాస్త కోపం..ఒకింత తొందర.. అన్నీ ఆమెలో స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏది ఏమైనా గడియారం గడిచేకొద్దీ ఆమె నాకు మరింత అందంగా కనపడుతోంది..ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను.. అమ్మాయిలు ఎంత అందంగా వుంటారు? అయినా .. లేకపోతే అబ్బాయిలు మరి ఎలా వెంటపడతారు..? ఒక పిచ్చి ప్రశ్న ఒక పనికిమాలిన సమాధానం.. ఆలోచించడం ఆపేస్తే మంచిదేమో! లేకపోతే నన్ను నేను తిట్టుకోవాలి.

బస్సులు రావడం లేదో ఏమో, అంత పెద్ద రద్దీగా ఏమీ లేదు ఇక్కడ. ఎవరో మాట్లాడుకుంటున్నారు. ట్రాఫిక్ వల్ల ఈ పూట బస్సు రూట్లు మార్చారు..అని.
దొరికిన వాళ్ళు దొరికినట్టు ఏవో ఆటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయినా ఇంకా జనాలు ఉంటూనే ఉన్నారు. ఇలా ఉన్నా నేను ఇంటికి ఎలాగ వెళతాను అన్న ఆలోచన మాత్రం నాకు రావడం లేదు ఎందుకో? అయినా ఇంకాస్త సేపు ఇక్కడే ఉండి నేను ఏం చెయ్యాలి? అసలు ఇక్కడ ఎందుకు వున్నాను? ఆమె కోసమా? అసలు ఆమే ఎందుకు? ఇంత కాలం లేనిది ఇప్పుడెలా? ప్రశ్నలు మోహరిస్తున్నాయి..

Excuse me .. ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? ఆమే!? Excuse me .. నా సెల్ ఫోన్ మిస్ అయ్యింది. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక సారి మీ ఫోన్ నుండీ నా ఫోన్ కి కాల్ చేసుకోవచ్చా? మొత్తం బాలన్సు అయ్యేదాకా మాట్లాడుకోమని చెపుదామన్నంత ఉత్సాహం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడకుండా జేబులోంచి ఫోన్ తీసి ఇచ్చాను.
ఆమె ఒకసారి చెక్ చేసుకుని చెప్పింది.. థాంక్ గాడ్ నా సెల్ ఫోన్ ఎక్కడికీ పోలేదు, డెస్క్ దగ్గరే మర్చిపోయాను. ఫోన్ ఇచ్చినందుకు థాంక్స్.. అని తిరిగి ఆఫీసుకు బయలుదేరింది.

ఏమన్నా అనుకుంటుందేమో అని కూడా లేకుండా తన వెనుకే అలాగే వెళ్లిపోదామనిపించిది ఆఫీసుకు.. కానీ పని వొదిలేసి పారిపోయిన నన్ను ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చావని నా చుట్టూ వాళ్ళు చూసే చూపులు గుర్తొచ్చాయి.. అవి వెక్కిరింతో.. జాలో..కోపమో.. అర్ధమయి చావదు.. ఆ చావు కన్నా ఇక్కడ చావడమే మేలని ఆగిపోయా..

అయిదు నిమిషాలు..
పది నిమిషాలు..
పావుగంట..
ఆమె ఇంకా రావడం లేదు..

ఎక్కడో ఆశ, వెనక్కి వచ్చినతరువాత మళ్లీ నాతో మాట్లాడుతుందని.. అందుకే వెళ్ళ బుద్ది కావడం లేదు. కానీ ఎంత సేపని ఇలా ఎదురు చూసేది? ఆమె అక్కడినుండీ ఇంకా ఎక్కడికైనా వెళ్లిపోయుంటే? ఆఫీసులో మళ్ళీ పని పడి ఆగిపోయిందా? ఎందుకని ఇంకా రాలేదు?

సరే, ఈలోపల ఏదో ఆలోచన..ఇందాక తన సెల్ ఫోన్ కు నా మొబైల్ నుండీ కాల్ చేసింది కదా.. అంటే తన నెంబర్ దొరికినట్టే.. అనుకుంటూ డయల్డ్ కాల్స్ చూసాను. ఎంత తెలివి గలది? కాల్ చేసిన తరువాత డయల్డ్ కాల్స్ లోంచి తన నెంబర్ డిలీట్ చేసి మరీ ఫోన్ ఇచ్చింది. నన్ను నేను తిట్టుకోవడం మొదలు పెట్టాను.. పని ఉండి పలకరించింది కానీ నీ మీద ఏదో పుట్టి కాదు. అయినా నిన్నేమైనా ఇక్కడ ఎదురు చూడమని చెప్పిందా? వెధవ.. వెదవన్నర వెధవ.. నడువు ముందు ఇక్కడి నుంచీ.

సరే ఏదో ఆటో వస్తోంది..
బాబు శాంతి నగర్ వస్తావా? అడిగాను. మీటర్ వెయ్యను సార్ మరి పర్లేదా? తిరిగి నన్నే ప్రశ్నించాడు. ఆటో వాళ్ళు ఎలాగూ చెప్పింది వినరు. మరి పెద్ద ఏదో చాయిస్ ఇచ్చినట్టు అడగడమెందుకో "మీటర్ వెయ్యను సార్ మరి పర్లేదా?". ఇప్పుడు వీడిని మీటర్ వెయ్యమని నేను అడిగానా? నాటకాలూ వీడూనూ.. సరే ఎంత తీసుకుంటావ్? నూట యాబై ఇవ్వండి అన్నాడు. పక్కనే ఉందికదయ్యా 100 చేస్కో అన్నాను. లేదు సార్ ఇంకో ఆటో చూస్కోండి. వాడి నమ్మకం ముందు నేను ఓడిపోయాను.. సరే కానీ 150 ఖాయం చేసుకుందాం.

ఎక్కి కూర్చున్నాను. ఈ సారి ఆమె వస్తుందేమో అని వెనక్కు చూడలేదు. మరో సారి నిరాశకు గురికావడం నాకు ఇష్టం లేదు. ఆటో బయలుదేరింది.

excuse me ..excuse me .. మిమ్మల్నే..ఎక్కడినుండో ఒక గొంతు..అది ఆమెదే.. ఆటో ఆగింది..

నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నేను కూడా మీతోపాటూ ఆటోలో రావచ్చా?

తప్పకుండా.. అని నా మాట పూర్తి కాకుండానే తను చొరవ తీసుకుని లోపల కూర్చుంది.

To be continued ..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, July 4, 2011

ఆ కాగితాలలోనే..!
ఒకటి కాదు, రెండు కాదు..!

కాగితం..
మొత్తం కలలన్నిటినీ అక్షరాల రూపంలో తాగేసింది..

ఊహలు పుట్టినప్పటినుండీ పెరుగుతున్నంత కాలం కూడా
ఇదే జరుగుతోంది..
సిరా చుక్కలుగా రూపాంతరం చెందడం
అదే పుస్తకంలో కలిసిపోవడం..
వాటి చరిత్రను అక్కడే రాసుకోవడం..
అప్పుడప్పుడూ తెరచి చదువుకోవడం..

ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను
ఈ పుస్తకం ఎంత పెద్దదో..! నిండదు ఎన్నటికీ.. అని

కానీ..
ఇప్పుడు భయపడుతున్నాను
కారణం..?
చోటు చాలక.. నా కొత్త ఆశలు పదాలు పెనవేసుకోవడంలో తడపడుతున్నాయి

అందుకే అంతగా తనలో ఏం నింపుకుందో అనుకుంటూ...!
ఓ సారి స్వప్నావలోకనం చేసుకోవడం మొదలు పెట్టాను

ఎంత అందంగా ఉన్నదో అక్కడ?
అద్దం లాగ..

ఎలాంటి శబ్దరాహిత్యతన ఉన్నదో అక్కడ ?
స్పష్టంగా వినగలిగేటట్టు..

ఎలాంటి అనుభూతి ఉన్నదో అక్కడ?
ఆనందమే తన్మయంచెందేట్టు..

అంతా ఒక అధ్బుతమే దర్సించినట్టయింది

కానీ..
అక్కడే మొరొకటి చూస్తాననుకోలేదు..
ఏళ్ళ నుండీ ఏవో ఆలోచనలు ఆయువు పోసుకుని
ఇక్కడే ఇల్లు కట్టుకు నివసిస్తున్నాయి..

నిజానికి వాటికి ఉనికి లేదు..
వాటి ఉనికిని నేనే!

అందుకే నా కలాన్ని కదలనీయక
కాలాన్ని కట్టేద్దామని చూస్తున్నాయి..

అవసరం లేనివి..
అవసరానికి రానివి..
ఎన్నో?

కలవనివి..
'కల్ల' అనేవి..
ఎన్నో?

వ్యక్తిత్వం లేనివి..
వ్యక్తీకరించాలేనివి..
ఎన్నో?

నిజానికి దూరంగా..
నిస్సిగ్గుగా..
ఎన్నో? ఎన్నో?

తమ అస్తిత్వం కోసం దాగివున్నవి..
అన్నీ ఆ కాగితాలలోనే..!

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, June 28, 2011

అన్నిటికన్నా ఉత్తమమైన జ్ఞాపిక..

కాసేపు ఏకాకిలా అనిపిస్తాను..
కాసేపు ఒక్కడినే కాను అని గుర్తు చేసుకుంటాను..

కాసింత నిద్ర..
కాసేపు మెలకువ..
కాస్తంత చీకటి..
అంతలోనే వేకువ..
అన్ని అధ్యాయాలను కూడుకుని ఇదే నా జీవితమని తెలుసుకుంటూ ఉంటాను.

తల ఎత్తి పైకి చూసినప్పుడల్లా..
కోరుకునే రేపటి రోజు ఎంతో ఎత్తులో కనపడుతూ ఉంటుంది..
మొదటలో తడపడినా ..
నెమ్మది నెమ్మదిగా ఆకాంక్షలకు ఆచరణలను జోడించి
నిచ్చెనను తయారు చేసుకుంటాను.. పై పైకి వెడుతుంటాను..

మధ్య మధ్యలో ..
ఆశలు ఆంక్షల దెబ్బలు తగిలి జబ్బు పడతాయి..
తిరిగి తేరుకున్నాక తూరుపుని చూస్తాయి..
అటుపై..
అటువైపే పయనిస్తాయి..

పయనపు ప్రారంభంలోని దూరాలు..
ఆఖరుకు చేరువవుతాయి..
చేరుకున్న శిఖరాగ్రాలు..
చుట్టూ ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తాయి..
సాధించిన విజయాలు..
ప్రపంచానికి నన్ను కొత్తగా పరిచయం చేస్తాయి...

అన్నిటినీ మించి..
నాకు నాపై గల నమ్మకం గొప్ప తృప్తినిచ్చి అభినందిస్తుంది..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, June 13, 2011

నీవు లేవు.. నాకూ తెలుస్తోంది..నీ పాదాలు ఎప్పుడో నే చేరలేనంత దూరం వెళ్ళిపోయాయి
అలసి అలసి నా అడుగులూ ఆగిపోయాయి..
ఇకపై కదలికలు లేవనీ..
నూరేళ్ళకు సరిపడా దూరం మధ్యన చేరుకుందని..
ఎలాగ నన్ను ఒప్పించుకోగలను?
ఎలాగ నా నీ నుండి తప్పించుకోగలను..?

నీ నుండీ పిలుపులు రావు
నా మాటలూ నిన్ను చేరుకోలేవు
ఈ మధ్యన నిలచిన నిశ్శబ్దం మాత్రం..
నాదగ్గర సమాధానం లేదనీ తెలిసీ
అదే ప్రశ్నను పదే పదే ఆహ్వానిస్తోంది

నీవు లేవు..
నాకూ తెలుస్తోంది
అయినా నీవు నాతో లేవనే అబద్దం నాకు నేను చెప్పుకోలేక పోతున్నాను..
నిన్నటి రోజు.. నావనుకున్న క్షణాలనుండీ
బయట పడలేకున్నాను

ఆగిపోయిన ఈ ప్రయాణంలో..
ఇకపై ఎదురుచూపులు కూడా ఉండవు..
నవ్వులకు నవ్వులు లేవు..
నేడు లేదు..రేపూ లేదు..
ఏదో జరుగుతుందన్న మిణుగురు వెలుగులూ లేవు..

అయినా నేను ఉన్నాను..!*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, June 7, 2011

కానీ.. నేను "ఇది.." అవునో కాదో అని..!
నోట్ల కట్ట వెనకో..
విలాసపు జీవన విధానాల కొరకో..
నన్నెవరో చూస్తున్నారనో..చూస్తారనే అప్రమత్తత వెనకో..
నేను అని..నన్నేమనుకుంటున్నానో దాని జాగ్రత్త కొరకో..
నేటి భయం వెనుకో.. రేపటి కొరకో..

యంత్రమల్లె..
మంత్రం వేసిన వాడికి మల్లె..
ఏదో ఏదేదో చేసుకు పోతుంటాను..

కాంక్షలు నావి..
కారణాలు నావి..
కొత్త కొత్త దారులు నావి..
కాంక్షల నావను అందుకోవాలని పరుగులే నావి..
కారణాలు వెతికే కొత్త దారులే నావి..
కొత్త దారులకు కారణాలే నావి..

తడబడుతుంటాను..
ఒప్పులని ఒప్పించేందుకు.. ఓపిక దారపోస్తాను..
ఏదో ఏదేదో చేసుకు పోతుంటాను..

కానీ..
కానీ..
అప్పుడప్పుడూ
అప్పటికప్పుడు..
ఒకింత అయోమయం
కాస్తంత అసంతృప్తి..
నన్ను కప్పేసినప్పుడల్లా..
అనుకుంటూ ఉంటాను..
నేను "ఇది.." అవునో కాదో అని..!

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, May 31, 2011

నేను మారలేను..మారాలనుకుంటాను..
నిన్నటి నాడు ఏదో జరిగిందని ఈరోజూ బాధ పడతాను..
ఈ నాటి తప్పుకు.. రేపటి రోజు అద్దం పడతాను..
చింతనతో..చింతలతో..
చిన్న చిన్న తప్పులేనని నాకు నేను సర్ది చెప్పుకుంటూ..
నన్ను నేను క్షమించేసుకుంటూ..
కాలంతో కలిసి ముందుకు వెడతాను..
జీవితంలో మళ్ళీ మళ్ళీ వెనక పడిపోతాను..

నేను నేనే ..
నేను మారలేను..

అప్పుడప్పుడూ.. అంతంత మాత్రం ఆలోచన వచ్చిందా..?
ఆగిపోయానని గుర్తుచేసుకుంటాను.! అక్కడే ఉండిపోకూడదనుకుంటాను..!
అలసిపోయినా .. స్వేదం ఆవిరవకూడదని..
మెలి మెల్లిగా.ఓపికకు కొత్త ఊపిరి పోసుకుంటూ .
అప్పటికప్పుడు..బలాన్నంతా కాళ్ళకిచ్చేసి..
ఒక్కో అడుగూ ముందుకు వేస్తాను..
వెనుకనుండీ ఏదో రోజు.. అనుకున్నంత ఎదుటకూ వస్తాను..

నేను నేనే..
అయినా నేను మారాలనుకుంటాను..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, May 25, 2011

నేనొక డబ్బింగ్ పాట రాసాను.. హి హి హి.. మీ దగ్గర ట్యూన్ ఉంటే.. పాట కట్టుకోండి.. ఎంజాయ్.. హ హ హ...

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం..
నాకు ఒక ఐస్క్రీం.. నీకు ఒక కూల్డ్రింక్..
చూసేవాళ్ళు కుళ్ళుకుంటే.. కడుపునింపుకుందాం..

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ.. (2)

ఇంత కాలము మనమేం చేసాం..?
నీకు నేను..నాకు నువ్వు.. దూరమున్నాం..
ఇప్పుడైతే మరి ఏం చేద్దాం..?
కలిసి ఉన్న ఒక్కో రోజు.. కలిసి తిందాం ..
దూరమున్నా.. దగ్గరున్నా...
ఎవ్వరైనా.. ఏమనుకున్నా..
మనమిద్దరమూ ఒక్కటేలే.. మనకిద్దరికీ మనమేలే...

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం.. (1)

ఇంత భారమూ మనకెందుకంటావ్ ?
నువ్వో వైపు.. నేనో వైపు.. ప్రేమ పంచుకున్నాం..
ఇప్పుడైతే మరి ఏం చేద్దాం..?
పంచుకున్న ప్రేమనింక కొంచెం దాచుకుందాం..
ఎప్పుడైనా.. ఎక్కడైనా..
ఎన్నడైనా.. ఎలాగైనా..
మనమిద్దరమూ మనమేలే.. మామూలుగా మనకిది మామూలే....

నేను ఒక ఈగ.. నువ్వు ఒక ఈగ..
రెక్కలార్పుతూ ఎగిరేల్లిపోదాం..
నాకు ఒక ఐస్క్రీం.. నీకు ఒక కూల్డ్రింక్..
చూసేవాళ్ళు కుళ్ళుకుంటే.. కడుపునింపుకుందాం..
......................................................................................


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

అడగమని నాతో.. అడుగేస్తుంది..
అవునో కాదో ఆశలకి.. ఊపిరి పోసే ఊహ ఇది..
అంతో ఇంతో మాటలకి.. మాటలు మోసే మౌనమిది..
ఆకాశమిలా అప్పటికప్పుడు అందివచ్చిన అనుభవమే ఇది..
ఆనందంలో ఆసాంతమిలా.. మునిగి తేలిన మనసు నది..

ఏమైందో ఏమని చెప్పను?
నాకైనా తెలియని ముప్పును..
నాకే నే గుర్తుకు రాను..
చూశాక ఈ కన్నియను..

మెరుపులను వెలిగించి..
మబ్బులను తడిపేసి..
చీకటికి చలి తెచ్చే..
తరుణమా ఇది?

ఉప్పెనే అయినా అది..
ఉలుకు పలుకే లేదు..
తీరమందాకైనా మరి..
భాష బదులే రాదు..

తెలిసినా ఆ తెలియని తనమే..
తళుకుమనే ఆ తలపే..
నీతో ఉంటే.. అడుగు అడుగు లో..
అడగమని నాతో.. అడుగేస్తుంది..

చెప్పు మరి ..!
ఇప్పుడేమని చెప్పను?

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Thursday, May 19, 2011

Tuesday, May 10, 2011

రేపటి నుండీ ...Short film by Siva Cheruvu
This is the third short film I have taken. However, this one got completed with editing a bit earlier than the second one. This is a about a man who misuses his time and wanted to prepare himself ready from tomorrow all the times. What happens at the end? is the movie all about.

Details :

Camera Used - Nokia 5230
Editing done using - Windows Movie Maker
No. Of people worked on this video - 2
Entire length of raw video before editing - 15:20
After editing : 8:50
Resolution : 740 * 480

ఏదైనా ఎన్నాళ్ళు?
ఎక్కడీ మనుషులు?
ఎక్కడ బంధం?
ఇక ఎక్కడిదీ బలం?
ఎక్కడికెళ్ళాయి నిన్నటి రోజులు?
ఏదైనా ఎన్నాళ్ళు?

పసి పాపగ పసిడి రోజులు
పరువాన పరుగులున్నన్నాళ్ళూ
పైన పడ్డాకా ఆ మిగిలిన వయసు..
ఏదైనా ఎన్నాళ్ళు?

అయిపోవా కాసిన్నినవ్వులు..
ఆగిపోవా ఓనాటికి కన్నీళ్ళూ..
ఆనక ..
ఏదైనా ఎన్నాళ్ళు?

*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

Monday, May 9, 2011

ఈ సినిమాలో పాటలు విన్నారా? విధేయుడు..ఎప్పటి నుండో అనుకుంటున్నాను.. విధేయుడు సినిమా పాటలగురించి రాద్దామని.కానీ మర్చి పోవడమో.. లేకపోతే బద్దకిన్చడమో .... ఇవాళ కాదు రేపు అని ఇలా చాలా రోజులు గా రాయలేక పోయాను. లాస్ట్ వన్ అండ్ హాఫ్ యీయర్ గా ఈ సినిమా పాటలు వింటున్నాను. వివరాలు తెలియదు కానీ సినిమా ఇంకా విడుదల అయినట్టు లేదు. ఈ సినిమాకి నిర్మాత ప్రేమ్ కుమార్ పాత్ర. సంగీతం కార్తిక్ m . దర్శకత్వం సాయి మీరా..

పాటల వివరాలలో కి వెళితే..మొత్తం అయిదు పాటలు ఉన్నాయి ఈ సినిమాలో.

1. పాహి శంకర : ఈ పాటని చిత్ర పాడారు. రచన వేటూరి. ఈ పాట వింటే అయ్యబాబోయ్.. ఇంత కష్టమైన పాట ఎంత అవలీల గా పాడేసారు ఈమె.. అను కోక మానరు. లిరికల్ గా అద్భుతమైనిపించక మానదు. ఇందులో ఒక లైన్.. "మనసంటే మనిషికి గల విలువే. కలిసుంటే కలలకు ఇక సెలవే.కదిలేది కదిలించేది యదలోని ప్రేమ నువ్వే "

2. మనసా : మనసా నువ్వెందుకు ముడి వేస్తావే ప్రతి ఇరువురిని.. ? అని ఒక అబ్బాయి అంటే.. దానికి సమాధానం చెప్పే ఒక అమ్మాయి పాట ఇది. ఇడి టీసింగ్ సాంగ్ అనుకుంటే పొరపాటే. ఇది మంచి మెలోడి. కార్తిక్ ఇంకా సుమంగళి పాడిన ఈ పాట రాసింది వనమాలి గారు. మంచి పదాలు పడ్డాయి..ఒకరి ప్రశ్న ఒకరి సమాధానం..

3. వయ్యారం ఇస్తా కానీ..: ఈ పాట ప్రియదర్శిని అనే గాయని పాడారు. ఈ పాటకు కూడా రచన వేటూరి గారే. అయితే..ఈ పాట మాస్ పాట.. ఐటెం సాంగ్ అనొచ్చో లేదో నాకు తెలియదు. కానీ వింటే అదే కోవకి వచ్చే పాటలా ఉంటుంది. అయితే పాట పాడిన విధానం బాగుంది. నాకు lyrics అర్ధం కాలేదు.

4. నిదుర లేచిన ఆమని.: ఈ పాట వనమాలి గారు రాసారు. గానం హరి హరన్. ఇది మంచి సూథింగ్ సాంగ్. ఇది సోలో సాంగ్. ఇది బహుశా బాక్గ్రౌండ్ సాంగ్ అయ్యుండొచ్చు ఈ సినిమాలో. నిశ్శబ్దంలో అలా కళ్లుమూసుని ఒక్కసారి ఈ పాట వింటే అయ్యబాబోయ్.. ఎక్కడో ఉన్నాను నేను అనిపించేస్తుంది అంతే..ఈ లైన్ నాకు ఈ పాటలో ఇష్టం."ఓ ఎటో పడే నా ప్రతి అడుగు ఓ ముడే పడీ నీ వెన్నంటే.. ఇలా ననూ నీ దరి చేర్చే ఓ వరం కదా ఈ ప్రేమంటే "

5.చేతుల్లో డప్పు : ఈ పాట పాడింది సాగర్. మంచి డప్పు బీట్ ఉన్న పాట. ఈ సినిమాలో వేటూరి గారు రాసిన మూడో పాట ఇది. పాట బాగుంటుంది కానీ నాకు నచ్చలేదు ఎందుకో. శివుడు అంటే ఏమిటి అన్న అర్ధం చెపుతూ పాడుతున్నట్టు ఉంటుంది ఈ పాట అర్ధం.

ప్రచారం లేకో మరి చిన్న సినిమా అని చాలామంది పాటలా వైపు చూడకో.. ఈ పాటలు అంతా ఫేమస్ అవ్వలేదు అనుకుంటాను. కానీ సాంగ్స్ ఆర్ వర్త్ లిసనింగ్ టు. అందుకే మీ అందరితో ఈ పాటల గురించి తెలియ చేసే ప్రయత్నం చేస్తున్నా.

పాటలు వినడానికి ఈ క్రింది లింకు క్లిక్కు చేయండి.

http://www.123musiq.com/Vidheyudu.htm

Friday, May 6, 2011

ఆ రాత్రి ఉదయమైంది..

సరిగ్గా ఇప్పటికి వారం రోజులు..

నేషనల్ హైవే.. హైదరాబాద్ టు బంగలుర్ APSRTC వోల్వో వేగంగా వెళ్తోంది.. అందులో నేను. నాతోపాటు బస్సు నిండా జనం (ఏదైనా మాట్లాడే టప్పుడు ముందు నేను తరువాతే మిగతా వాళ్ళు ముఖ్యం గా ఇలాంటి వి మాట్లాడే టప్పుడు ఇంకొంచెం ఎక్కువ నేను ).

అప్పటికి రాత్రి 12.40 అయింది. మామూలు గా బస్సులో ఘాడమైన నిద్ర రాదు నాకు. కానీ ఆరోజు నేను మంచి మత్తులో ఉన్నాను. ఒక్కసారిగా ఎవరో అరుస్తున్నట్టు వినపడుతోంది. ఏం జరుగుతోంది.. ? మత్తులోనే ఉన్న నేను ఇంకా ఏమిటి ? ఏం అవుతోంది ఇక్కడ అనే ఆలోచన పూర్తిగా చేయలేకున్నాను. బస్సు మాత్రం చిన్న పిల్లాడి చేతిలో ఆడుకునే ఆట బొమ్మలా రక రకాల వంపులు తిరుగుతోంది. ఏదో unusual గా జరుగుతోందన్న విషయం అర్ధం అవున్నంతలో.. బస్సులో అరుపులు ఇంకా పెరిగిపోతున్నాయి..
నేను పూర్తిగా తేరుకోలేదు. మత్తు దిగలేదు ఇంకా. బస్సు ఆగిపోయింది.

చాలా మంది బస్సు డ్రైవర్ మీద అరవడానికి సిద్దమైపోతున్నారు. ఎవరో అన్నారు... అసలు ఏమైందో ముందు తెలుసుకుందామని.. కానీ అందరూ ముందు బస్ వెకేట్ చెయ్యాలని పరుగు పరుగున వెళ్తున్నారు. ఎస్.. ఇది ప్రాణ భయం. అప్పుడు నాకేదో అర్ధం అయ్యింది. బస్సు ఒక పెద్ద ఆక్సిడెంట్ మిస్ అయ్యి ఎక్కడో ల్యాండ్ అయ్యింది. అందరూ దిగేశారు... నేను ఒక్కడినే బస్సులో ఆఖరి వ్యక్తిని.. నా చెప్పులు ఎక్కడికో వెళ్ళిపోయాయి..కళ్ళు నులుముకుంటూ వెతుక్కోవడం మొదలు పెట్టాను. బహుశా నేను సేఫ్ అనే అభిప్రాయానికి వచ్చినట్టున్నాను. బస్సు దిగడానికి మరీ మిగతావాళ్ళ అంత తొందర పడలేదు నేను.ఇక నెమ్మదిగా కిందకి దిగిన నేను చాలా మందిని ఒక గుంపుగా చూసాను. బస్సుకు దూరం గా నిలబడి ఏమైంది అని చూస్తూ వాళ్ళు వాళ్ళా అభిప్రాయలు వెలిబుచ్చుతున్నారు..డ్రైవర్
క్లేఅనేర్ కొంత సేపటి వరకు కనపడలేదు.సమయం గడిచే కొద్దీ ఒక్కొక్కోళ్ళలో భయం తగ్గుతూ పోయింది. వాళ్ళు లోపలి వెళ్లి వాళ్ళ వాళ్ళ లగేజీలను తెచ్చుకుని నేను సేఫ్ అని సర్దిచేప్పుకోవడం మొదలు పెట్టారు. ఒక పక్క ఆవలింతలు వస్తున్నాయి. ఇంత సమయంలో పక్క వాళ్ళని నమ్మలేని వాళ్ళను చూసి కొంత నవ్వు వచ్చినా..ఆ అవులింతలో నవ్వు ఆపుకున్నాను. బస్సు డీసిల్ టాంకు ఒకటి పూర్తిగా డామేజి అయ్యింది. అందులో నుండీ పంట పొలాలకు నీళ్ళు పోసినట్టు అంత వేగంగా మొత్తం డీసిల్ పోయింది.ఒక అరగంట చర్చ తరువాత ఇక చేసేది ఏమీ లేదు ఎవరికీ ఏ బస్సు దొరికిఎతే అది పట్టుకుని వెళ్ళిపోవడమే అని తెల్చ్చి చెప్పేశారు. అందరూ ఆ ఆక్సిడెంట్ స్పాట్ నుండి మెయిన్ రోడ్డు కి రావడం మొదలు పెట్టారు. అప్పుడు నా మత్తు పూర్తిగా వదిలిపోయింది.మెయిన్ రోడ్డుకు వచ్చే దారిలో రాళ్ళు ఆ గోతులు.. పెద్ద పెద్ద గుంతను చూస్తే.. ఎలా ఇలా మేము కాపాడబడ్డాము అని అర్ధం కాలేదు. మనసులో మరో సారి భగవంతునికి నమస్కారాలు తెలియజేసుకున్నాను. When I look at the surrounding... I could not believe how I got saved from this and it a real miracle happened. As a human being I could not even see any possibility of getting out of this. Its just because of god's grace and blessings that made me to be alive that day. The most important point of it is we are not injured not even a single scratch.

బ్రేకు ఫెయిలు అయ్యిందని డ్రైవెర్ చెప్పడం. కొంతమంది డ్రైవెర్ నిద్ర పోయాడని అనడం.. ఇక్కడ రెండు రకాలైన వాదనలు జరిగాయి.
ఏమి జరిగిన ఎవ్వరికీ ఏమీ కాలేదు. అది ముఖ్యమైనది అని తోచింది నాకు. నేను వెళ్లి ఆ డ్రైవెర్ కి థాంక్స్ చెప్పాను. నీవల్లే మేము ప్రాణాలతో బయట పడ్డాం.. చాలా థాంక్స్ అని.. కానీ అతను ఏమి మాట్లాడలేదు. ఎందుకో నాకు తెలియలేదు కానీ నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు.
ఏవో చిన్న చిన్న సమస్యలో.. పెద్ద పెద్ద సమస్యలో వస్తాయి.. వాటిని గురిచి ఎంతో భాద పడి..సమయాన్ని .. జీవితాన్ని నిందలు వేస్తూ గడిపేయడం చూస్తుంటాము. ఆ క్షణం నాకు అనిపించింది .. అన్నిటి కంటే గొప్పది మన దగ్గర ఉంది. అదే ప్రాణం. బ్రతికి ఉంటే సమస్య చిన్నదో పెద్దదో ఏదైనా పరిష్కరించుకోవచ్చు అదే.. నేనే లేకపోతే. ఇక ఆ సమస్య ఉన్నా లేకున్నా.. అది పెద్దదైనా.. చిన్నదైనా.. నాకు దానితో అవసరమే లేదు కదా.. I should feel happy that I am live. I should be happy that I have been given with great energy to do what ever is given to me. My nature is to be happy and not to feel bad or sad about all the simple things and silly things that come across in life line.

ఆ బస్సులో క్లీనేర్ తో మాట్లాడాను.. అతని జీతం 3000 అని చెప్పాడు. హ హ హ.. నాకు వచ్చే వేలకు వేలు చూసి నేను ఎప్పుడైనా సంతృప్తి పడ్డానో లేదో తెలీదు..కానీ ఇంకొంచెం ఇంకొంచెం అనే భావన మాత్రం నాలో ఉండేది. మూడు వేలకు అతను చేసే ఉద్యోగం కన్నా అంతకన్నా చాలా రెట్లు అయిన నా జీతం ఇచ్చే ఉద్యోగం తక్కువ Risk Factors ఉన్నది. ఇంకా వంకలు పెట్టడం మానేద్దామని అనుకున్నాను. ultimate గా నేను బ్రతుకుతున్నాను.. అతనూ బ్రతుకుతున్నాడు. జీతం డబ్బులు వేరైనా.


అయితే..జీతం వేరైనా.. పనులు వేరైనా..ప్రదేశాలు వేరైనా..జీవన విధానం వేరైనా.. మనుషులు అందరూ బ్రతకడానికి ఒక కామన్ రీసన్ ఉందని అనిపించింది నాకు ఆరోజు. అదే ప్రతి రోజునూ ఆనందంగా గడపటం. కొందరు అదే ఆనందం కోసం సమస్యలు తెచ్చుకుంటారు. కొందరు సమస్యలు వదిలించుకుంటారు..
The most important thing in life at the end of day..really is I am satisfied with my life or not.. no matter how much you are earning, how many people you have around, the kind of life style you are with.

ఒక రెండు గంటల తరువాత.. మరో బస్సు లో మెట్ల దగ్గర కొంత చోటు దొరికితే ... జాగ్రత్తగా బంగళూరు చేరుకున్నాను.

One Last word.. Thanks to you God..