Wednesday, December 29, 2010

మళ్ళీ ఎక్కడో మొదలవుతాయి..



ఆలోచనలు..
ఎందుకో అలసిపోవు..
తిరుగాడుతూనే ఉంటాయి..!

కాసేపు..భయంతో,
కాసేపు.. పరధ్యాన్నంలో..
కలలను కలుపుకు పోతుంటాయి..

------------------------------------
ఆలకించని తనం..
అతి మంచి తనం..
మధ్యే మార్గం..
ఏది తమ అస్తిత్వమో?

ఒక సారి ఆగలేక తొందర 'పడతా'యి
మరోసారి..
ఆలసించి తప్పుచేస్తాయి..

------------------------------------

క్షణకాలం..
కార్యాచరణ కాలం..
ఏంటో మరి వాటి జీవిత కాలం.. ?

చెప్పక తప్పుకు పోతూ ..
తమ పని తాము చేసుకు పోతూ..
ఆదరణ ఉన్నంత కాలం ఊపిరి పోసుకుంటాయి..

------------------------------------

గీసుకున్న గిరి వరకూ..
హద్దులు చెరిపే చొరవ చేరువను చేరే వరకు..
మరి ఎంత వరకో వాటి నడక..?

అంతర్చక్షువులను తెరిచి ..
అంతరాన్తరాలను తెలుసుకుని..
తెలియని తనమే తామయ్యామని మురిసిపోతుంటాయి..
అద్బుతాలయి కూడా అమాయకంగా చూస్తుంటాయి..
అంతా అయిపోయాక .. అంతర్దానమవక..
మళ్ళీ ఎక్కడో మొదలవుతాయి..

------------------------------------

6 comments:

Balu said...

Very Nice

తృష్ణ said...

చాలాబావుందండి. మీ కవితలు బాగుంటాయి.

Anonymous said...

hi bava..chala baga rasav...

శివ చెరువు said...

బాలు గారు..
thank you

తృష్ణ గారు..మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండి..

ఒరే బావ గారు .. మొత్తానికి నా బ్లాగు చూసావు.. హి హి హి.

satya said...

శివ గారు బావుంది...!!

మధురవాణి said...

@ శివ గారూ,
సత్య గారు లింక్ ఇస్తే ఇటు వచ్చాను. .. ఆలోచనల గురించి చాలా లోతుగా, వైవిధ్యంగా చెప్పారు. చాలా బాగుంది. వీలైతే ఓసారి ఇది చూడండి.
http://madhuravaani.blogspot.com/2011/01/blog-post_12.html