Monday, November 29, 2010

జీవితానికొకటే తెలుసు..



జీవితానికొకటే తెలుసు..
ఇవ్వడం..


ఈరోజు మీద ప్రేమ
ఊహలు నింపుకున్న రేపటి రోజు
బ్రతకడానికి కారణం

మనసుకు కాస్తంత నవ్వు..
మనిషిగా కాసిన్ని క్షణాలు..
తనదైన అస్తిత్వం

కొన్ని తీయనివి..
మరి కొన్ని మింగుడు పడనివి..
వెనుకటి రోజులకు, కాలం చెల్లని గురుతులు

అంతే..

2 comments:

రాజశేఖరుని విజయ్ శర్మ said...

అర్థం కాలేదు. కానీ బాగుంది అనిపించింది. :)

satya said...

శివా మీకు ఇంకో మంచి కారణం చెప్పనా....

" ప్రతీ క్షణం మనిషి దగ్గర కోల్పోవడానికి
భవవంతుడు ఏదో ఒకటి ఉంచుతాడు...
లేదా ఇవ్వడానికి ఏదో ఒకటి ఉంచుతాడు...
బహుషా ప్రేమ-వినిమయం కోసమేనేమో!!!!!"



నాకైతే అర్థమైంది!

-సత్య...