Monday, November 15, 2010

నువ్వు నేను - మనమిద్దరం

.



తెలియలేదు కాని
ఒకరి చేయి పట్టుకుని మరొకరు.. మనమిద్దరం.. వీధి దీపాల వెలుగులో
అలా అలా ఎంతో దూరం ముందుకు వచ్చేసినట్టున్నాం

ఇప్పుడు ఎవరూ లేరు వీదిలో
కేవలం నువ్వూ నేను..
అంతే..


దారిపొడవునా
ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ నువ్వేదో చెప్పావు

నువ్వు - నేను కలిసిన మొదటి రోజుల గురించి చెప్పావు
నువ్వు నేనైన నీ గుర్తులను నాతో చెప్పావు

నేను లేనపుడు నీతో నువ్వేమిటో చెప్పావు..
నీకు నేనేమిటో చెప్పావు..

నామీద ప్రేమ దాచుకుని చూపించాలనుకున్న కోపం
వద్దు ఇక వద్దు, చాలు అనుకున్న దూరం
దూరంలోనే మళ్ళీ దగ్గరతనం
అన్నీ చెప్పావు..

చెప్పలేక ఆగిన క్షణాలు
చెప్పక దాచుకున్న మాటలు
నాకై నేనే చెప్పాలని నువ్వాపడ్డ ఇన్నాళ్ళు
అన్నిటి గురించీ చెప్పావు..
.
.
.
.
బహుశా నేను నీఅంతగా
నాలోని నిన్ను బయట పెట్టలేనేమో..?

ఇందాక అన్నాను
ఇక్కడెవరూ లేరని..
నిజానికి ఉన్నా నాకు అంతరం తెలీదు
ఇదే నేనూ నీకు చెప్పాలనుకున్నది..

నడిచే ప్రతి అడుగులో నా పక్కన నువ్వు...
నీ చేయి నా చేతిని తాకినప్పుడల్లా
నీ చిటికిన వేలు పట్టి నడుస్తానన్న నమ్మకం
ఏరోజుకారోజు జ్ఞాపకాల గదుల్లో దాచుకున్న ఆనందం
ఎప్పటికప్పుడు గుండెకి గొంతుకనిద్దామనే ఆత్రం

ఇవన్నీ నేనూ నీకు చెప్పలేదు...!

ఒక్క క్షణం నిన్ను దగ్గరకి తీసుకున్నాను..
గుండె చప్పుడు కు దగ్గరగా హత్తుకున్నాను
అంతే..

ఇక మాటల అవసరం మన మధ్య మళ్ళీ రాలేదు..

7 comments:

గీతిక said...

ఒక చిన్న భావాన్ని చాలా తేలిక మాటల్లో భావాత్మకంగా చెప్పారు. చాలా బాగుంది...

గీతిక

శివ చెరువు said...

ధన్యవాదాలు గీతిక గారు..

Sai Praveen said...

చాలా బాగుంది.

satya said...

చాల బాగుంది..మీ ప్రత్యేకత ఎంటంటే
చివరిదాకా విషయం తెలీదు!
తెలిసిన తరువాత చిరునవ్వాఅగదు!!



నడకలు కలిపిన దారుల మధ్య
మజిలీ మనయ్యాం
మనసులు కలిపిన మాటలమద్య
మౌనం మనమయ్యాం
-సత్య

satya said...

చాల బాగుంది..మీ ప్రత్యేకత ఎంటంటే
చివరిదాకా విషయం తెలీదు!
తెలిసిన తరువాత చిరునవ్వాఅగదు!!



నడకలు కలిపిన దారుల మధ్య
మజిలీ మనయ్యాం
మనసులు కలిపిన మాటలమద్య
మౌనం మనమయ్యాం
-సత్య

శివ చెరువు said...

థాంక్స్ సాయి ప్రవీణ్ గారు..

సత్య గారు..
మీరు రాసిన ఈ నాలుగు లైన్లు చాలా లోతైన భావాన్ని కలిగి వున్నై..

"నడకలు కలిపిన దారుల మధ్య
మజిలీ మనయ్యాం
మనసులు కలిపిన మాటలమద్య
మౌనం మనమయ్యాం"

రియల్లీ గుడ్ వన్..

మీ వ్యాఖ్య చూసిన తరువాత చాలా సంతోషమేసింది. నా రాతల మీద నాకు మరింత నమ్మకం ఏర్పడింది .
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

satya said...

thank you..........