Thursday, September 23, 2010

ఎందుకు?
తల్లి తండ్రులిచ్చిన ఈ జన్మ ఎందుకు?
భగవత్ ప్రసాదితమైన ఈ ఆయువెందుకు?
గురువులు అందించిన విద్య ఎందుకు?

పై మూడూ నాకున్న ముఖ్యమైన ప్రశ్నల్లో మూడు..
ఇంకా ఇలాంటివేవో 'ఎందుక'నే ప్రశ్నలే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదురవుతూ నన్ను పూర్తిగా ఆలోచనల్లో పడేస్తూ ఉంటై..ఒక ప్రశ్నకు సమాధానం దొరికిందనగానే మరో ప్రశ్న పుడుతూనే వుంటుంది..దొరికిన సమాదానం ముందు ప్రశ్న చిన్నదైపోతుంటుంది..అచ్చూ మనిషి కోరిక లాగా..

ఒక చిన్న ఉదాహరణ..
రోడ్డు మీద ఓ ముష్టి ఆయనని చూసి (వయసు దగ్గర దగ్గర యాభై పైనే వుంటుంది ) చాల బాధగా అనిపించింది..పక్కనే ఉన్న మా స్నేహితుడినోకడిని అడిగాను ఆ పెద్దాయనను చూపిస్తూ..'ఎందుకు' ఇలా అయిపోతారు అని ? అతడు వెంటనే అన్నాడు "ప్రేమించే వారు లేక" అని. ఆ సమాధానానికి అప్పటికి నేను సంతృప్తి చెందినా .. తరువాత మళ్ళి అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడల్లా నా ప్రశ్న పునరుద్భవించేది.. వీరి సమస్య వీరిని 'ప్రేమించే వారు లేకనా' లేక "వీరి పై వీరికి ప్రేమ లేకనా..?" అని..

================================

ఒక్కోసారి విపరీతమైన సంతోషమోచ్చేస్తుంటుంది.. అప్పుడనిపిస్తుంది 'ఎందుక'ని? మరోసారి దిగాలుగా ఉన్నా ఇదే ప్రశ్న.."ఎందుకని ?"...ఈ ప్రశ్న ఎక్కడ జనించిందంటే.. భావాల మూలం ఎక్కడని తెలుసుకోవాలని ఆకాంక్ష మొదలైనప్పుడు.. భావజాలమే మనిషి తత్త్వం. జీవితంలో ఎక్కువ సమయం వేరెవరినో అర్ధం చేసుకోవడానికే వెచ్చిన్చేస్తుంటాం.. మనల్ని మనం మరిచి పోతుంటాం.. అందుకే మనల్ని మనం మరింత అర్ధం చేసుకోవడానికే తరచూ ప్రశ్నించుకోవడం తప్పనిసరేమో అనిపిస్తూ ఉంటుంది..

ప్రశ్నలకందిన సమాధానాలు పరిపూర్ణంగా ఆ ఖాళీలని నింపనప్పుడు వాటిని వెలుగు లోనికి తీసుకురాక పోవడమే మంచిది. లేకుంటే ఈ సమాధానాలే సమస్యలవగలవు..

======================================

Purpose of life…

Purpose of existence…

Purpose of learning…


పైన చెప్పిన మూడు ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడల్లా ఈ మధ్య దొరికిన ఒక సమాధానం.. "ధర్మం"..

మళ్ళీ ఏది "ధర్మం" అనే ప్రశ్న తలెత్తింది నాలో .. ఇది ఒక లంకె.. కొన సాగుతూనే వుంటుంది..

ప్రశ్నలు ఆలోచనాధారిత జనితాలు.. మనిషి ఆలోచనలు అనంతం, అందుకే ప్రశ్నలూ అనేకం..

మిత్రులారా ఇలాంటి ప్రశ్నలూ మీలోనూ ఉండి ఉండవచ్చు..కనుక మీనుండి కొంత తెలుసుకుందామనే ఈ టపా రాసాను..

ధన్యవాదాలు..
శివ చెరువు

5 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. క్లిష్ఠ పరిస్థితులలో ఎదుటివారి తరఫునుండి అలొచించడాన్ని ధర్మం అంటాం ...
  దానికి మూడు ముఖ్య లక్షణాలు....
  1) నిర్భయం 2) నిస్వార్థం 3) ఆదర్శం

  ( నారద భక్తి సూత్రాలు నుంది )

  ధర్మం " ఎందుకు? ".....శాంతి కొరకు......

  ReplyDelete
 3. సంతోషం అండి. మీరు చెప్పిన ఆ మూడు లక్షణాలు కూడా మహాత్తరమైనవి.. మరి ఒక మిత్రునిగా.. ఒక ఉద్యోగిగా..ఒక నిరంతర విద్యార్ధిగా మనం కొన్ని భాద్యతలను నెరవేర్చా వలసి వుంటుంది. ఈ భాద్యతలను చాలామంది 'ధర్మానికి' పర్యాయ పదంగా వాడుతూ ఉంటారు.. (మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి అంటూ ఉంటారు.)" ఎందుకు? " అయితే చిత్రం గా అవి మనిషి మనిషికీ, ప్రదేశానికి ప్రదేశానికీ, కాలానికి కాలానికి మారి పోతూ ఉంటై.. దీనిని అర్ధం చేసుకోవడం కష్టమే. నేను చదివిన శంకరాచార్యుల వారి పుస్తకం లో ఉన్న మూడు విషయాలు.. ఇవి..

  1.నిత్యానిత్య వస్తు వికేకం
  2.వైరాగ్యం
  3.ధ్యానం..

  మీరన్నట్టు ధర్మం శాంతికి దారి తీస్తుంది. లోపలా బయట కూడా..

  ReplyDelete
 4. శాంతి "ఎందుకు?" అంటే సుఖం కోసం... " అశాంతస్య కుతో సుఖం?" అని భగవత్ గీత లో శ్రీకృష్ణుడంటాడు "శాంతి లేని వాడికి సుఖం దొరకదు" అని. ప్రశాంతంగా ఉన్నప్పుడే సౌకర్యాలనుకునే సుఖాలని, సుఖంగా అనుభవించగలుగుతాం ... ధర్మార్థకామమోక్షాలతో , సుఖ-శాంతులు పొందడం ...పొందిన దాన్ని ఇతరులకందిచడం మానవ లక్ష్యం .. "అందుకే !"
  గురువు-గురుపరంపర !.

  ReplyDelete
 5. సత్య గారు..
  చింతలు ... అధిక అనవసర చింతనలు కలిగి లేకపోవడమే శాంతి.. శాంతి కలిగినప్పుడు.. అప్పటిదాకా అందుబాటులో వున్నా తెలుసుకోలేని సుఖాలు అనుభవం లోకి వస్తాయి.. అయితే శాంతి లేనప్పుడు మనం వెత్తుక్కునే .. దొరికిందని చెప్పుకునే సుఖాన్ని స్వాంతన అనొచ్చుకాని.. సుఖానికి సంతోషానికి పర్యాయ పదాలు గా వాడలేము.. ఇక్కడ నా ఉద్దేశంలో సుఖం = Comfortableness

  ReplyDelete