Wednesday, July 7, 2010

రానీ వాటన్నిటినీ..





బరువులెత్తనీ..
బలహీన పడనీ.. నీ బలాన్ని..

కలలన్నీ ఒక్కసారిగా కసురుకోనీ..
పొడిచేస్తూ.. ప్రశ్నలు వెంటపడనీ..
పరిచయమవనీ పరుగులు పెట్టే పరిస్థితి..
నీ మనుగడ కూడా మరుగయ్యే దాకా రానీ..

రానీ ..
రానీ..
రానీ వాటన్నిటినీ..

తరిమి కొడుదువుగాని..
తరిమి తరిమి.. కొడుదువుగాని..

రానీ ..
రానీ..
రానీ వాటన్నిటినీ..

వేదనలే లేని బ్రతుకెందుకు?
వెతలే లేనప్పుడిక వేడుకలెందుకు?

ఆకాశం అంతలోనే చేతికందొస్తే..
ఆదుర్దా అవసరమే పోతే..
అసలు నీవెందుకు..?

ఆకాంక్షల.. ఆలోచనల అవసరమెందుకు?
అసలు 'అవసర'మెందుకు..?

4 comments:

  1. hi siva garu..chala baga rasaru..

    ReplyDelete
  2. shiva bagundi sri sri praranatho baghane rasavu

    ReplyDelete
  3. అర్థం అయి అవనట్టు ఉంది!
    కాని బాగున్నట్టు అనిపిస్తుంది!

    నాక్కూడా శ్రీ శ్రీ గారి ఛాయలు కనిపించాయి :)

    ReplyDelete
  4. నాకు కూడా శ్రీ శ్రీ గారు గుర్తొచ్చారు. బాగా రాసారు.

    ReplyDelete