Tuesday, June 29, 2010

I was scared... I felt sad...
Story started here

రాత్రి 10 గంటలవుతోంది..

మావయ్య: ఉంటాను రా .. బస్సు ఎక్కగానే ఫోన్ చేస్తాను.. 11.15 కి బండి..కదా..మళ్ళీ అటు ఇటూ అయితే ఇబ్బంది పడాలి..
నేను : అలాగే జాగ్రత్త మావయ్య.. ఫోన్ చెయ్యి మర్చి పోకు.. నీ ఫోన్ వచ్చాకే నిద్ర పోతాను..

అమ్మా నాన్న : దేవుడికి దణ్ణం పెట్టుకున్నావా..? సరే..తొందరగా బయలుదేరు.. ఆలస్యం అయితే మళ్ళీ సిటి బస్సులు దొరకవు..

మావయ్య : అలాగే మరి..మీరూ జాగ్రత్త..

-----------------------------------------------------

ఒక ఇరవై నిమిషాలు గడిచింది..

-----------------------------------------------------

ఫోన్ మోగుతోంది..

హలో .. హా..మావయ్య.. చెప్పు..

"మెహిదీపట్నం వచ్చేసాను రా. బస్సువాడు తొందరగానే పట్టుకొచ్చేసాడు. ఇంకా నలభై నిమిషాలు ఉంది బయపడక్కర్లేదు విజయవాడ బస్సు దొరికినట్టే "

"శుభం. టైం కి అందుకున్నావన్నమాట..మంచిది.. సరే మరి ఉంటా "

-----------------------------------------------------

తెలీకుండా నిద్రపట్టేసింది.. ఎందుకో తెలీదు ఎప్పుడూ లేనిది..నేను నా ఫోన్ నా పక్కనే పెట్టుకుని పడుకున్నాను..

అమ్మమ్మ తాతయ్య వచ్చారు..
అమ్మా నాన్న వాళ్ళతో ఏవో కబుర్లు చెపుతున్నారు..
చాలసేపయినట్టుంది..
నాకిప్పుడేమీ వినపడడం లేదు.. పెద్దవాళ్ళు కూడా నిద్రపోయినట్టున్నారు.

మంచి నిద్దరలో ఉన్నా..

-----------------------------------------------------------

ఉన్నట్టుండి ఫోన్..

తెలీట్లేదు ఎవరు ఫోన్ చేసారని.. కళ్ళు చిట్లేస్తే తెలుస్తోంది.. మావయ్య..

ఆటోమాటిక్ గా నా బొటనవేలు గ్రీన్ బటన్ నొక్కేసింది..

ఆ// బస్సేక్కేసావా..?

"ఒరే.. ఇంకా బస్సు రాలేదు చాలాసేపయింది.. ఇక్కడ, ఎదురు చూస్తున్నాను. నేను తప్ప ఎవరూ లేరు ఇక్కడ . బస్సు ఏమైనా వెళ్ళిపోయి ఉంటుందంటావా? "

వస్తుందిలే మావయ్య..కాస్త ఆలస్యం అవ్వచ్చు.. ఏముందిలే అంటూ వాచీకేసి చూసా..

మత్తు దిగిపోయింది.. టైం కాస్తా..12:00 దాటిపోయింది..

11:15 కి రావలిసిన బస్సు ఇంకా రాకపోవడం పైగా బస్స్టాపులో ఒక్కడివే ఉండడం ఏంటి?

ఎక్కడ నుంచున్నావు?

"వాడెవడో ఇక్కడే రైతు బజారు ఎదురగా నుంచోమన్నాడురా.. ఇంతసేపూ చూసి ఇప్పుడు నీకు ఫోన్ చేస్తున్నా . సరే ఇక్కడినించీ డిపోకి ఎలా వెళ్ళాలి"

డిపోనా అది చాలా దూరం మావయ్యా.. పైగా రాత్రి లగేజీతో ఒక్కడివే ఎలా..వెళ్తావు..?

"సరే మళ్ళీ చేస్తాను ఆగు.." - ఫోన్ పెట్టేసాడు మావయ్య..
-----------------------------------------------------

I was scared

పక్కన ఎవరూ లేరు. మావయ్య ఒక్కడే ఉన్నాడు. హైదరాబాదు కొత్త.. వెనక్కి రావడం సులభం కాదు.
ఒక చోట బదులు మరో చోట నించున్నాడేమో? బస్సు ఇంకా ఉంటుందా ? ఈపాటికి ఎప్పుడో వెళ్లిపోయుంటుంది.
ఇప్పుడెలాగ? చేతిలో లగేజీ ఉంది దొంగలెవరైనా ఉంటే..?

ఆక్షణం ఏమీ తెలీలేదు .. మొత్తం ప్రశ్నలు ..అనుమానాలు..

మామయ్య అనుభవమంత లేదు నా వయస్సు. మామయ్యకి లోకం తెలుసు. చిన్న పిల్లాడేమీ కాదు.. ప్రాంతమే కొంచెం కొత్త అంతే..

ఇంతా తెలిసీ ఏదో భయం.. లోపల .. మనవాళ్ళు ఎక్కడో అర్దరాత్రి ఒక్కరే ఇరుక్కుపోయారనే కంగారు..

------------------------------------------------------
ఇంతలో మళ్ళీ ఫోన్..

ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. రింగ్టోన్ సయిలెంట్ చేసాను.

మావయ్యా ఎక్కడున్నావ్?

"ఇంకా అక్కడే ఉన్నారా. బస్సు రాలేదు..దగ్గరలో డిపో ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు, కొంచెం మాట్లాడి బండి బయలుదేరిందో లేదో కనుక్కుంటా?"

ఇప్పుడే చెపుతాను అని ఫోన్ పెట్టేసాను. ఆవేశంలో తెలీలేదు కానీ నాకు మాత్రం ఆ ఫోన్ నెంబర్ ఇంత అర్దరాత్రి ఎక్కడినుండి వస్తుంది ?

సమయానికి gtalk లో online లో ఉన్న మాబావ ఒకతను చాలా సహాయం చేసాడు ..ఇంటర్నెట్ లో సెర్చ్ చేశా..ఏదో రకంగా కిందా మీదా పడి ఓ రెండు నంబరులు సంపాదించా .. అవికాస్తా ఫోన్ చేస్తే లిఫ్టు చేసే నాధుడే లేడు..
---------------------------------------------------------

మళ్ళీ ఫోన్..ఈసారి నేను చేశా.

మావయ్యా ఎక్కడున్నావు..?

"ఇంకెక్కడుంటాను? ఇక్కడే.! ఏదైనా ఫోన్ నెంబర్ దొరికిందా ? "

దొరికింది మావయ్యా కానీ లిఫ్ట్ చేయడంలేదు అంటున్నాను నేను ఫోన్ లో . ఇంతలో అవతల పక్కనించీ ఎవరో కొంచెం రాష్ .. గొంతుతో మాట్లాడుతున్నారు. కాస్త మందు తాగినట్టుందీ ఆ గొంతు..

ఎవరు మావయ్యా అక్కడ? - ఆపుకోలేక వెంటనే అడిగేసా !

"ఎవరో లేరా..మనకెందుకూ.. సరే నువ్వు ట్రై చెయ్యి, నెంబర్ నాకు మెసేజి పెట్టు నేనూ ట్రై చేస్తా.."

నాలో కంగారు పెరిగింది. అప్పటికే టైం ఒంటిగంట దాటిపోతోంది.. ఏం చేయను సొంత బండి లేదు కనుక..నేను బయలుదేరే పరిస్థితి లేదు..

-----------------------------------------
ఫోన్ వచ్చింది ..

"ఏదో ఆటో దొరికింది .. నేను పెద్ద బస్టాండుకి వెళ్లి అక్కడినించి బయలుదేరుతాలే. ఇది కాకుంటే మరో బస్సు.. పర్లేదు.. నువ్వింక నిద్రపో..సరేనా పొద్దున్న చేరాక నాన్నకి ఫోన్ చేసి చెపుతాలే "

ఆ తరువాత ఇంకో గంట వెయిట్ చేసి విజయవాడ బస్ బయలుదేరిందనే కబురు విన్నాక కొంచెం దడ తగ్గింది..

మంచి నిద్ర వచ్చింది..

------------------------------------------

I felt sad...

ఉన్నట్టుండి ఓ ఆలోచన.. ఓ ప్రశ్న.. జనించింది నాలో..!

నేను ఎందుకు అంత భయపడ్డాను..?

అక్కడ నా భయం కేవలం మావయ్యకి ఈ ప్రాంతం కొత్త అనే కాదు..ఎవరైనా ఏమైనా చేస్తారేమో అనే భయం. తాగి గొడవలు పెట్టుకునే వాళ్ళు వస్తే..? దొంగలు వస్తే? పోలీసులొచ్చి డబ్బులడిగితే?

అది నావాళ్ళు ఒంటరిగా ఉన్నారనే భయం. చీకటి గురించిన భయం.

Its all about bloody insecurity

క్షణం..సిగ్గుపడ్డాను..బాధ పడ్డాను...

నేనూ.. నాలాగే నలుగురు.. ఇదేగా సమాజం..మరి ఇంత చిన్న సమాజంలో ఎందుకీ అబద్రతాబావం?

నిజానికి నాదగ్గర సమాధానం లేదు.. ;(

ఎందుకో తెలీదు కానీ ఈ మాట గుర్తుకొస్తోంది..
"ఇంకా మన సమాజంలో మంచివాళ్ళు మిగిలి ఉన్నారు"

ఎంత దరిద్రంగా ఉందీ ఈ పై మాట ?

"అంతా మంచి వాళ్ళే ఉన్నారు అని చెప్పుకోవలసిన స్థితి పోయి..ఇంకా మిగిలున్నారు అని చెప్పుకోవడం భాధాకరం"

-----------------------------------------------------------------

తరువాత రోజు పొద్దున్నే మళ్ళీ వేక్ అప్ కాల్

"ఒరే శివా నేను క్షేమంగా చేరాను.. ఆఫీసుకి బయలు దేరుతున్నాను.. మళ్ళీ ఫోన్ చేస్తా ఉంటా .." మామయ్య..


========================

5 comments:

 1. మామయ్య ఒక్కడే ఉన్నాడు, బస్సు దొరకలేదు, నేను కూడా వెంట వెళ్లి ఎక్కించి వస్తే బాగుండేది,తప్పు చేశాను ఇలాంటి భావనలన్నీ కలసి వచ్చిన స్థితి. కొంచెం భయం, బస్సు వెళ్లిపోయుంటుందే ఎలాగ అన్న బెంగ కొంచం, ఇప్పుడేం చెయ్యాలి అన్న ప్రశ్నలు ఇలా... ఇలా... అన్నీ కలసి మిమ్మల్ని కలవర పెట్టాయి.

  ఒకటి మాత్రం నిజం పోలీసులంటే భద్రతా భావం మాత్రం మనలో లేదు. రాత్రి పూట పోలీసులు ఎదురైతే మరీ కంగారు పడతాం.

  మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు.

  ReplyDelete
 2. chaalaa baagundi bhayamtho koodina mee experiance.
  idi mee okkarike kaadu jeevitamlo edo oka samayam lo pratee okkaru edurkunede.
  nenaite ilaanti sthithini chaalaa saarle edurkovaalsi vachhindi.
  meeru raasina paddathi baagundi
  -vedakiran

  ReplyDelete
 3. meru rasindi bagundi..life lo prathi okaru ilanti sitution ga feel avutharu...

  ReplyDelete
 4. nijanganey manalo abhadratha bhavam chlala perigipoyindi...
  idi kevalam samajam valleney na?

  baga rasaru..

  ReplyDelete
 5. "నేనూ.. నాలాగే నలుగురు.. ఇదేగా సమాజం..మరి ఇంత చిన్న సమాజంలో ఎందుకీ అబద్రతాబావం?"

  దీనికి సమాధానం తెలిసినా తెలీనట్టు... ఏం పట్టనట్టు ఉండే సమాజంలో ఉన్నాం కాబట్టి!

  ReplyDelete