Thursday, June 24, 2010

గూగుల్ ఫోటోలతో జాగ్రత్త..
మే నెలలో నేను ప్రచురించిన కధ "ఆ సాయంత్రం" అనే పోస్టు లో కొన్ని ఫోటోలు గూగుల్ నుండి వెతికి పెట్టడం జరిగింది.. అయితే..నిన్న నాకో మెయిల్ వచ్చింది.. DMCA కాపి రైటు క్రింద వేరేవారి వెబ్ సైట్ లో ఉన్న images వాడడం illegal అనీ..వారి కాపి రైటు హాక్కులను దెబ్బదీయడమని కనుకా నా పోస్టు నా బ్లాగు నుండి గూగుల్ వారు తొలగించడమైనది.. మరల నా టపా తిరిగి డ్రాఫ్ట్ కి సేవ్ చేయబడింది..

కనుక బ్లాగ్మిత్రులారా.. గూగుల్ ఫోటోలతో జాగ్రత్త..

మీరు కూడా మీరు రాసే టపాలకు images ఎంచుకునేటప్పుడు అవి copyrighted content అవునో కాదో చూసుకోండి..

తొలగించిన నా టపా లింకు ఇదిగో.. ఇప్పుడిది పని చేయడం లేదు.. అయితే..ఆ లింకు నొక్కితే ఏ సందేశం వస్తుందో చూడండి అంతే..

http://gurivindaginja.blogspot.com/2010/05/blog-post.html


నాకు వచ్చిన ఆ మెయిలులో సందేశం..యదాతధం గా..

Blogger has been notified, according to the terms of the Digital Millennium Copyright Act (DMCA), that certain content in your blog is alleged to infringe upon the copyrights of others. As a result, we have reset the post(s) to "draft" status. (If we did not do so, we would be subject to a claim of copyright infringement, regardless of its merits. The URL(s) of the allegedly infringing post(s) may be found at the end of this message.) This means your post - and any images, links or other content - is not gone. You may edit the post to remove the offending content and republish, at which point the post in question will be visible to your readers again.

అయితే నాకు మాత్రం మంచే అయ్యింది.. ఈ సారి నుంచీ నా టపాలకు కావలసిన ఛాయా చిత్రాలు నా సొంత ( నేను తీసిన ) చిత్రాలు అయ్యేట్టు చూసుకున్దామన్న ఆలోచన కలిగింది..


.

7 comments:

 1. చాలా మంచి విషయం చెప్పారు. మనకి కావలసినన్ని ఇమేజ్ లు గూగులమ్మలో ఉన్నాయని, వెతికి పెట్టుకోవడమే మన పని అని అనుకున్నాను. కాపీరైట్ ఇష్యూ బ్లాగు పోస్టులకి వర్తిస్తుందని అనుకోలేదు. ఇకపై జాగ్రత్తగా ఉంటాం. మీ పోస్టుకి థాంక్స్.

  ReplyDelete
 2. ఇదన్యాయం అక్రమం. కాపీ రైటు చేయకూడదంటే మరెందుకు దింపుకోనిచ్చారు? గూగుల్ మీదే పడి కట్ అండ్ పేస్ట్ బ్లాగరులు ఏమయిపోవాలి?

  ReplyDelete
 3. మన తెలుగు బ్లాగర్లకు ఇదో కొత్త పాఠం. బ్లాగులలో ఇతర వెబ్సైట్లనుంచి చిత్రాలు వాడుకునే సమయాన, వాటికి క్రెడిట్ ఇవ్వటం, మూల వెబ్ సైట్ల నుంచి అనుమతి తీసుకోవటం యొక్క అవసరం ఈ సంఘటన ద్వారా తేటతెల్లమవుతుంది. యుట్యూబ్ లోని కొన్ని వేల వీడియోలు కూడా వాటి కాపీరైట్ దారులు గూగుల్ కు తమ అభ్యంతరం వెల్లడించాక తొలగించటం జరిగింది.

  ReplyDelete
 4. మంచి విషయం చెప్పారు . ఇక నుంచి జాగ్రత్తగా వుంటాము . థాంక్ యు .

  ReplyDelete
 5. Hi Buddies,

  In case if you are using any one's images you are violating the cyber laws and property rights :(

  what 2 do now ???

  simple: use image in your blogs, below it paste link from where it is copied and mention the photo owners name and tell that it is copy righted.

  now every 1's happy..... :)

  i like happy endings :) :) :)

  ReplyDelete
 6. అవునాండీ !!నేనూ గూగుల్ గతప్రాణినే :(

  ReplyDelete
 7. అయితే ఇక నుండి మీరు రాసే కవితలే కాదు మీరు తీసే ఫొటోస్ కూడా చూసే భాగ్యం కలుగుతుంది అన్నమాట మాకు! :)

  ReplyDelete