Saturday, June 5, 2010

నాకిష్టం..




ప్రపంచం నాకిష్టం..

ఏరోజూ ఒకేలా ఉండనీదు..
నన్ను నానుండి దూరం కానీదు..

బ్రతుకు బడిలో తలుపు వేసేస్తే...
మరో తరగతికి తలుపు తెరుస్తుంది..

అందరిలో నను చూపించేస్తూ..
నను ముందుకు నడిపించేస్తుంది..
మరింత మెరుగ్గా ఆవిష్కరింపజేసేందుకు సిద్ధం చేస్తుంది..

నా గురువు
నా బందువు
నా ఆప్తమిత్రుడు
నా ప్రపంచం..

ద్వేషాన్ని రుచి చూపిస్తూ..
ప్రేమ విలువ చెప్పింది..

మోసపోయినపుడల్లా
మరింత మంచి వాడివవమంది..

ఆశలు ఆవిరి చేసి పట్టుకెళ్ళి..
మండుటెండల మాపటి రోజు మేఘమై వచ్చింది..

నిన్న లేనిదే నేడు లేదని
నేటి రేపటికి ఈనాటి అవసరమెంతో గుర్తు చేసింది..

తత్వాలు చెపుతుంది..
గీతా గానం చేస్తుంది..
తనను మరిచి తాండవం చేస్తుంది..

నా దృష్టి
నా తీరు
నా నిర్ణయం
నా ప్రపంచం..

నాకెంతో ఇష్టం..


.

7 comments:

  1. బాగుంది.
    "బ్రతుకు బడిలో ఓ తలుపు వేసేస్తే...
    మరో తరగతికి తలుపు తెరుస్తుంది.. "

    ఇప్పుడు మీరెన్నో తరగతి? :):)

    ReplyDelete
  2. chala baga rasav..

    ReplyDelete
  3. @విశ్వ ప్రేమికుడు గారూ..
    ఇంకా స్కూలింగే పూర్తి కానిదే..అయితే తరగతులేవో మారుతున్నట్టే తెలుస్తోంది.. మీ బ్లాగ్ ఫాలో అవుతుంటాను.. మీరు కూడా చాలా క్లాసులే దాతెసినట్టే ఉన్నారు..?

    @అజ్ఞాత గారు.
    థాంక్స్ అండి..

    ReplyDelete
  4. //మండుటెండల మాపటి రోజు మేఘమై వచ్చింది..//
    avasaaraaniki matku raaadu lendi.. ee line chaala baagundi...

    ReplyDelete
  5. hey chala chala chalaaaaaa bagundi siva garu...:)

    ReplyDelete
  6. bagundi siva garu, chaala bagundi,
    mi prapancham bagundi :)

    ReplyDelete
  7. బావుందండి ....చాలాబావుంది.

    ReplyDelete