Saturday, June 12, 2010

24/7 మొదటి షార్ట్ ఫిలిం.

ఎప్పటినించో అనుకుంటున్నా .. రాసేదేదైనా వీడియో తీద్దామని.. ఈ వీడియో తీసి ఎడిట్ చెయ్యడానికి మూడు వారాలు పట్టింది.. (నిజానికి 5 గంటలే కానీ మిగతాది బద్ధకం అన్నమాట..).

చెప్పుకోవడం కాదు కాని.. దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది..రోడ్లమీద షూటింగ్ అంటే మాటలేమి కాదు.. జనాలంతా మనల్నే చూస్తున్నారేమో అనే ఫీలింగ్.. ఎవరైనా వచ్చి.. ఏంటిది ..? అని అడిగితే..? (ఆ ముచ్చట కూడా తీరింది.. లక్డికాపూల్ రైల్వే స్టేషన్ లో )

ఉదాహరణ..కి . నాకు .. ఇందులో యాక్ట్ చేసిన నా మిత్రునికి ఇద్దరికీ సిగరెట్ గురించి తెలీదు.. కొట్టుకెళ్ళి బాబూ..బాగా పొగ వచ్చేది.. మంచిగా బూదిదొచ్చేది . ఓ సిగరెట్ ఇయ్యమ్మా.. అని అడిగాం.. ఆ కొట్టు అతను పైనించీ కింద దాక.. ఎగా దిగా చూసాడు.. ;)

సినిమా చూసి ఓ నాలుగు కామెంట్లు విసిరి కొట్టడం నాకు .. కెమేరాతో పెట్టిన విద్య..

తీరా నేను కెమెరా పట్టుకునేటప్పటికీ.. కధ కాస్తా. సగం మర్చిపోయా..!

అనుకున్న కరెక్ట్ లోకేషన్స్ దొరక్క..కొన్ని చోట్ల కుదరక.. కధ మార్చుకోవాల్సి వచ్చింది..

ఆఖరున షూటింగ్ మొత్తం అయ్యాకా. ఇంకా ఏదో తియ్యల్సింది.. అనే ఫీలింగ్..

సరే.. ఏదో మొత్తానికి కెమెరాలో భంధిచాం అనుకున్నాక.. ఇప్పుడు దీన్ని ఎడిటింగ్ చెయ్యాలి..

మనకి రాదు.. వచ్చిన వాడు తెలీదు..సొంతగా నేర్చుకోక తప్పింది కాదు..

ఏదో సొంత వాయిస్ ఆడ్ చేసి.. ఇంగ్లిష్ ఆల్బం లో మ్యూజిక్ కొట్టేశా.. (నేనూ సినిమల్లోకెళ్ళిపోతానేమో డవుటొ చ్చేస్తోంది..)

ఇది మొదటి పూర్తి ప్రయత్నం..నేను హాపీస్..

చూసి మీరుకూడా హాప్పీస్ అవునో కాదో.. చెప్పండే..

గమనిక.. సలహాలు తీసుకోబడును*

15 comments:

 1. బాగుది మీ మొదటి ప్రయత్నం. సిగరెట్ బాగా పొగ వచ్చినట్టుంది.:):) మరో సినిమా తీసేటప్పుడు మమ్మల్నీ ఇన్వైట్ చెయ్యండి. కలిసి పని చేయడానికి నేను రెడీ :)

  ReplyDelete
 2. తప్పకుండా నండీ .. నేను మొదట అనుకున్న షార్ట్ ఫిలిం టైటిల్ Ctrl + Z కాని అది తీయడం కుదరలేదు .. ఇక ఇది మొదలు పెట్టాలని చాలాకాలం అనుకుని వర్క్ చేయకుండా ఆపేసాను..తరువాత మా స్నేహితుని ప్రోత్సాహంతో పూర్తి చేయగలిగాను..

  ReplyDelete
 3. bagundi..concept sariga chepladhu..inka baga thiyachu..all the best..

  ReplyDelete
 4. hello boss!
  It is a good attempt.
  "ఇంతకుముందు ఇలా ఉండేవాడిని. మరి ఇప్పుడు ..." అనే సీన్ కొంచెం ameture గా, silly గా (pardon me if my words are harsh) ఉంది. నేను ఇది ఎందుకు అంటున్నానంటే మీ కథా రచనా శైలి నాకు నచ్చింది. అంత మంచి థాట్స్ ఉన్న మీ ముంచి expect చేసేది కాదు అది.
  Over all, its a good attempt. Waiting for your next film :)

  ReplyDelete
 5. Great post, very thorough discussion of the topic. Does anybody know where can find additional info on this subject? Thanks for any input.

  ReplyDelete
 6. @అజ్ఞాత గారు..అవునండీ సరిగ్గా (poorthi gaa) చెప్పలేదనే నా అభిప్రాయం కూడా..ఎందుకంటే. వీడియో చివర మీరు చూసిన మొబైల్ రింగ్ ఆ అమ్మాయి దగ్గర నుండి వచ్చింది అనేట్టుగా తీద్దామనే ప్రయత్నం.. కాని అది కన్వే చేయలేక పోయాను.. నా ప్రయత్నాన్ని ప్రోత్సహించినందుకు ధన్య వాదాలు..


  @స్వప్న గారు.. థాంక్స్ అండి..
  @ కత్తి మహేష్ గారు.. మీకు కూడా ధన్యవాదాలు

  @ Sai Praveen మీ అభిప్రాయం తెలియ జేసినందుకు చాలా థాంక్స్ అండి.. కధలో చాలా సీన్లు అనుకున్నా.. కొన్నే తీయ గలిగాను..అసలు ఆ అమ్మాయిని పరిచయం చేసుకునే సీన్ ఒకటి. ఆమె పేరు "తన్మయి" అని తెలుసుకునే సీన్ కాని.. క్లైమాక్ష్ సీన్ కాని.. ఇలా చాలా చెప్పాలి అనుకుని వదిలేసాను.. చాలా తీయలేదు.. పైగా పైన చెప్పినట్టు ప్రొఫెషనల్స్ కి అర గంట పడితే.. నాకు అయిదు గంటలు పట్టింది నా వీడియో ఎడిట్ చేయడానికి..ఈ సారి మరింత మెరుగ్గా అనుకున్నది అనుకున్నట్టుగా తీసే ప్రయతహ్నం చేస్తాను.. అన్నట్టు ఈ వీడియో నాకు చాలా నేర్పింది..

  ReplyDelete
 7. ధన్యవాదాలు.. శ్రీనాథ్ గారు..

  ReplyDelete
 8. Hi all e cinema lo act chesina Somu gadini nene e 6 mins cinema kosam enta sraminchamo maku and ma tadisina chokalakey telusu epudu chala relief ga undi next ma project ki kotha utsaham vastondi next time cimpestam ani promise chestuna :)

  Siva nuvu keka ra :)

  Comments+Suggestions+titlu+butulu+mudulu
  all r invited with open hearts

  Thanks bye !!! Tipper lorry next movie lo chasi# chubista :P

  ReplyDelete
 9. Sound lekunda dance adinchina credit siva gadidey :) -Somu

  ReplyDelete
 10. First attempt ... చాలా బాగుందండి!
  i like that background music and voice. ఆ వాయిస్... కథని చెప్పిన విథానం కూడా నచ్చింది.
  కాని visuals అంత impressive గా అనిపించలేదు!

  ఓవరాల్ గా బాగుంది :)

  waiting for your next attempt!

  ReplyDelete
 11. చాలా థాంక్స్ చైతన్య గారు..

  ReplyDelete