Tuesday, June 29, 2010

I was scared... I felt sad...
Story started here

రాత్రి 10 గంటలవుతోంది..

మావయ్య: ఉంటాను రా .. బస్సు ఎక్కగానే ఫోన్ చేస్తాను.. 11.15 కి బండి..కదా..మళ్ళీ అటు ఇటూ అయితే ఇబ్బంది పడాలి..
నేను : అలాగే జాగ్రత్త మావయ్య.. ఫోన్ చెయ్యి మర్చి పోకు.. నీ ఫోన్ వచ్చాకే నిద్ర పోతాను..

అమ్మా నాన్న : దేవుడికి దణ్ణం పెట్టుకున్నావా..? సరే..తొందరగా బయలుదేరు.. ఆలస్యం అయితే మళ్ళీ సిటి బస్సులు దొరకవు..

మావయ్య : అలాగే మరి..మీరూ జాగ్రత్త..

-----------------------------------------------------

ఒక ఇరవై నిమిషాలు గడిచింది..

-----------------------------------------------------

ఫోన్ మోగుతోంది..

హలో .. హా..మావయ్య.. చెప్పు..

"మెహిదీపట్నం వచ్చేసాను రా. బస్సువాడు తొందరగానే పట్టుకొచ్చేసాడు. ఇంకా నలభై నిమిషాలు ఉంది బయపడక్కర్లేదు విజయవాడ బస్సు దొరికినట్టే "

"శుభం. టైం కి అందుకున్నావన్నమాట..మంచిది.. సరే మరి ఉంటా "

-----------------------------------------------------

తెలీకుండా నిద్రపట్టేసింది.. ఎందుకో తెలీదు ఎప్పుడూ లేనిది..నేను నా ఫోన్ నా పక్కనే పెట్టుకుని పడుకున్నాను..

అమ్మమ్మ తాతయ్య వచ్చారు..
అమ్మా నాన్న వాళ్ళతో ఏవో కబుర్లు చెపుతున్నారు..
చాలసేపయినట్టుంది..
నాకిప్పుడేమీ వినపడడం లేదు.. పెద్దవాళ్ళు కూడా నిద్రపోయినట్టున్నారు.

మంచి నిద్దరలో ఉన్నా..

-----------------------------------------------------------

ఉన్నట్టుండి ఫోన్..

తెలీట్లేదు ఎవరు ఫోన్ చేసారని.. కళ్ళు చిట్లేస్తే తెలుస్తోంది.. మావయ్య..

ఆటోమాటిక్ గా నా బొటనవేలు గ్రీన్ బటన్ నొక్కేసింది..

ఆ// బస్సేక్కేసావా..?

"ఒరే.. ఇంకా బస్సు రాలేదు చాలాసేపయింది.. ఇక్కడ, ఎదురు చూస్తున్నాను. నేను తప్ప ఎవరూ లేరు ఇక్కడ . బస్సు ఏమైనా వెళ్ళిపోయి ఉంటుందంటావా? "

వస్తుందిలే మావయ్య..కాస్త ఆలస్యం అవ్వచ్చు.. ఏముందిలే అంటూ వాచీకేసి చూసా..

మత్తు దిగిపోయింది.. టైం కాస్తా..12:00 దాటిపోయింది..

11:15 కి రావలిసిన బస్సు ఇంకా రాకపోవడం పైగా బస్స్టాపులో ఒక్కడివే ఉండడం ఏంటి?

ఎక్కడ నుంచున్నావు?

"వాడెవడో ఇక్కడే రైతు బజారు ఎదురగా నుంచోమన్నాడురా.. ఇంతసేపూ చూసి ఇప్పుడు నీకు ఫోన్ చేస్తున్నా . సరే ఇక్కడినించీ డిపోకి ఎలా వెళ్ళాలి"

డిపోనా అది చాలా దూరం మావయ్యా.. పైగా రాత్రి లగేజీతో ఒక్కడివే ఎలా..వెళ్తావు..?

"సరే మళ్ళీ చేస్తాను ఆగు.." - ఫోన్ పెట్టేసాడు మావయ్య..
-----------------------------------------------------

I was scared

పక్కన ఎవరూ లేరు. మావయ్య ఒక్కడే ఉన్నాడు. హైదరాబాదు కొత్త.. వెనక్కి రావడం సులభం కాదు.
ఒక చోట బదులు మరో చోట నించున్నాడేమో? బస్సు ఇంకా ఉంటుందా ? ఈపాటికి ఎప్పుడో వెళ్లిపోయుంటుంది.
ఇప్పుడెలాగ? చేతిలో లగేజీ ఉంది దొంగలెవరైనా ఉంటే..?

ఆక్షణం ఏమీ తెలీలేదు .. మొత్తం ప్రశ్నలు ..అనుమానాలు..

మామయ్య అనుభవమంత లేదు నా వయస్సు. మామయ్యకి లోకం తెలుసు. చిన్న పిల్లాడేమీ కాదు.. ప్రాంతమే కొంచెం కొత్త అంతే..

ఇంతా తెలిసీ ఏదో భయం.. లోపల .. మనవాళ్ళు ఎక్కడో అర్దరాత్రి ఒక్కరే ఇరుక్కుపోయారనే కంగారు..

------------------------------------------------------
ఇంతలో మళ్ళీ ఫోన్..

ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. రింగ్టోన్ సయిలెంట్ చేసాను.

మావయ్యా ఎక్కడున్నావ్?

"ఇంకా అక్కడే ఉన్నారా. బస్సు రాలేదు..దగ్గరలో డిపో ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు, కొంచెం మాట్లాడి బండి బయలుదేరిందో లేదో కనుక్కుంటా?"

ఇప్పుడే చెపుతాను అని ఫోన్ పెట్టేసాను. ఆవేశంలో తెలీలేదు కానీ నాకు మాత్రం ఆ ఫోన్ నెంబర్ ఇంత అర్దరాత్రి ఎక్కడినుండి వస్తుంది ?

సమయానికి gtalk లో online లో ఉన్న మాబావ ఒకతను చాలా సహాయం చేసాడు ..ఇంటర్నెట్ లో సెర్చ్ చేశా..ఏదో రకంగా కిందా మీదా పడి ఓ రెండు నంబరులు సంపాదించా .. అవికాస్తా ఫోన్ చేస్తే లిఫ్టు చేసే నాధుడే లేడు..
---------------------------------------------------------

మళ్ళీ ఫోన్..ఈసారి నేను చేశా.

మావయ్యా ఎక్కడున్నావు..?

"ఇంకెక్కడుంటాను? ఇక్కడే.! ఏదైనా ఫోన్ నెంబర్ దొరికిందా ? "

దొరికింది మావయ్యా కానీ లిఫ్ట్ చేయడంలేదు అంటున్నాను నేను ఫోన్ లో . ఇంతలో అవతల పక్కనించీ ఎవరో కొంచెం రాష్ .. గొంతుతో మాట్లాడుతున్నారు. కాస్త మందు తాగినట్టుందీ ఆ గొంతు..

ఎవరు మావయ్యా అక్కడ? - ఆపుకోలేక వెంటనే అడిగేసా !

"ఎవరో లేరా..మనకెందుకూ.. సరే నువ్వు ట్రై చెయ్యి, నెంబర్ నాకు మెసేజి పెట్టు నేనూ ట్రై చేస్తా.."

నాలో కంగారు పెరిగింది. అప్పటికే టైం ఒంటిగంట దాటిపోతోంది.. ఏం చేయను సొంత బండి లేదు కనుక..నేను బయలుదేరే పరిస్థితి లేదు..

-----------------------------------------
ఫోన్ వచ్చింది ..

"ఏదో ఆటో దొరికింది .. నేను పెద్ద బస్టాండుకి వెళ్లి అక్కడినించి బయలుదేరుతాలే. ఇది కాకుంటే మరో బస్సు.. పర్లేదు.. నువ్వింక నిద్రపో..సరేనా పొద్దున్న చేరాక నాన్నకి ఫోన్ చేసి చెపుతాలే "

ఆ తరువాత ఇంకో గంట వెయిట్ చేసి విజయవాడ బస్ బయలుదేరిందనే కబురు విన్నాక కొంచెం దడ తగ్గింది..

మంచి నిద్ర వచ్చింది..

------------------------------------------

I felt sad...

ఉన్నట్టుండి ఓ ఆలోచన.. ఓ ప్రశ్న.. జనించింది నాలో..!

నేను ఎందుకు అంత భయపడ్డాను..?

అక్కడ నా భయం కేవలం మావయ్యకి ఈ ప్రాంతం కొత్త అనే కాదు..ఎవరైనా ఏమైనా చేస్తారేమో అనే భయం. తాగి గొడవలు పెట్టుకునే వాళ్ళు వస్తే..? దొంగలు వస్తే? పోలీసులొచ్చి డబ్బులడిగితే?

అది నావాళ్ళు ఒంటరిగా ఉన్నారనే భయం. చీకటి గురించిన భయం.

Its all about bloody insecurity

క్షణం..సిగ్గుపడ్డాను..బాధ పడ్డాను...

నేనూ.. నాలాగే నలుగురు.. ఇదేగా సమాజం..మరి ఇంత చిన్న సమాజంలో ఎందుకీ అబద్రతాబావం?

నిజానికి నాదగ్గర సమాధానం లేదు.. ;(

ఎందుకో తెలీదు కానీ ఈ మాట గుర్తుకొస్తోంది..
"ఇంకా మన సమాజంలో మంచివాళ్ళు మిగిలి ఉన్నారు"

ఎంత దరిద్రంగా ఉందీ ఈ పై మాట ?

"అంతా మంచి వాళ్ళే ఉన్నారు అని చెప్పుకోవలసిన స్థితి పోయి..ఇంకా మిగిలున్నారు అని చెప్పుకోవడం భాధాకరం"

-----------------------------------------------------------------

తరువాత రోజు పొద్దున్నే మళ్ళీ వేక్ అప్ కాల్

"ఒరే శివా నేను క్షేమంగా చేరాను.. ఆఫీసుకి బయలు దేరుతున్నాను.. మళ్ళీ ఫోన్ చేస్తా ఉంటా .." మామయ్య..


========================

Thursday, June 24, 2010

శూన్యం అంటే..?
శూన్యం అంటే..?
ఎవరిని వారు వేరుగా చూసుకోవడమే..

మనసు నిండుకున్నప్పుడే వస్తుందది..

మసిబారిన.. చీకటిలా
రంగులు చెదిరిన బొమ్మలా..
అర్ధవిహీన ఆకారం కలిగి వుంటుంది

మబ్బుల నీడ పడని మొలక మల్లె..
రెక్కలు విరిచిన విహంగమల్లె విలపిస్తూ ఉంటుంది..

పాడని గేయాలు పలు రాసుకుని.
పరి పరి తరచి చూసుకుంటుంది..

అనుభూతులు కరువైనది
తానే 'కరువై'నది శూన్యం..

ఎక్కడ ఏమీ లేదో..
అక్కడ తానే ఉంది.. తానై వుంది..

ఆకలి కన్నా భాదంత..
చావుకన్నా మేలంత..
చెడుకన్నా చేదంత...
బాగుంటుందీ అదీ..


.

veda గారి బ్లాగ్ లో ఈ టపా చూసి రాసిన కవిత ఇది..

http://vedakiran.blogspot.com/2010/06/blog-post_24.html

veda గారికి ధన్యవాదాలు..

గూగుల్ ఫోటోలతో జాగ్రత్త..
మే నెలలో నేను ప్రచురించిన కధ "ఆ సాయంత్రం" అనే పోస్టు లో కొన్ని ఫోటోలు గూగుల్ నుండి వెతికి పెట్టడం జరిగింది.. అయితే..నిన్న నాకో మెయిల్ వచ్చింది.. DMCA కాపి రైటు క్రింద వేరేవారి వెబ్ సైట్ లో ఉన్న images వాడడం illegal అనీ..వారి కాపి రైటు హాక్కులను దెబ్బదీయడమని కనుకా నా పోస్టు నా బ్లాగు నుండి గూగుల్ వారు తొలగించడమైనది.. మరల నా టపా తిరిగి డ్రాఫ్ట్ కి సేవ్ చేయబడింది..

కనుక బ్లాగ్మిత్రులారా.. గూగుల్ ఫోటోలతో జాగ్రత్త..

మీరు కూడా మీరు రాసే టపాలకు images ఎంచుకునేటప్పుడు అవి copyrighted content అవునో కాదో చూసుకోండి..

తొలగించిన నా టపా లింకు ఇదిగో.. ఇప్పుడిది పని చేయడం లేదు.. అయితే..ఆ లింకు నొక్కితే ఏ సందేశం వస్తుందో చూడండి అంతే..

http://gurivindaginja.blogspot.com/2010/05/blog-post.html


నాకు వచ్చిన ఆ మెయిలులో సందేశం..యదాతధం గా..

Blogger has been notified, according to the terms of the Digital Millennium Copyright Act (DMCA), that certain content in your blog is alleged to infringe upon the copyrights of others. As a result, we have reset the post(s) to "draft" status. (If we did not do so, we would be subject to a claim of copyright infringement, regardless of its merits. The URL(s) of the allegedly infringing post(s) may be found at the end of this message.) This means your post - and any images, links or other content - is not gone. You may edit the post to remove the offending content and republish, at which point the post in question will be visible to your readers again.

అయితే నాకు మాత్రం మంచే అయ్యింది.. ఈ సారి నుంచీ నా టపాలకు కావలసిన ఛాయా చిత్రాలు నా సొంత ( నేను తీసిన ) చిత్రాలు అయ్యేట్టు చూసుకున్దామన్న ఆలోచన కలిగింది..


.

Wednesday, June 16, 2010

ప్రేమించలేని ప్రేమ
పంతాలకు .. పట్టింపులకు..
తను వేరు పడుతుందేమో అని భయమేసి..

అటు ఇటు తేలక ..
ఆలోచనలను తూకం వేస్తే..
అసహనం తాలూకు తొందర పాటు మొత్తం వైపుకు తూగింది.

క్షణం..
వదలలేని ప్రేమ
వదిలిపోలేని ప్రేమ
విసిగి.. వలసపోవడానికి సిద్ద పడింది..

గుడ్డిధైర్యం .. పోగేసుకుని..
వేళ్ళూనుకుపోయిన మొండితనం...వెనకేసుకుని..
సొంతంగా బ్రతకడానికి వెళ్ళిపోతోంది..

పెద్ద వాళ్ళ ప్రేమని ఖర్చు చేసి..
పెంచిన విలువలకి నిలువు శిలువలేసి..
తెలుస్తున్నా....
చేస్తున్న తప్పుకు జడిసి..
తనను తాను తరుముకుంటూ దూరంగా తీసుకుపోతోంది..
అనంతమైన తన ప్రవాహాన్ని కాలవ గట్టుకు ధారపోస్తోంది...

పరిపూర్ణం గా..
ప్రేమించలేని ప్రేమ

పాపం

పిచ్చి
ప్రేమ..!

Saturday, June 12, 2010

24/7 మొదటి షార్ట్ ఫిలిం.

ఎప్పటినించో అనుకుంటున్నా .. రాసేదేదైనా వీడియో తీద్దామని.. ఈ వీడియో తీసి ఎడిట్ చెయ్యడానికి మూడు వారాలు పట్టింది.. (నిజానికి 5 గంటలే కానీ మిగతాది బద్ధకం అన్నమాట..).

చెప్పుకోవడం కాదు కాని.. దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది..రోడ్లమీద షూటింగ్ అంటే మాటలేమి కాదు.. జనాలంతా మనల్నే చూస్తున్నారేమో అనే ఫీలింగ్.. ఎవరైనా వచ్చి.. ఏంటిది ..? అని అడిగితే..? (ఆ ముచ్చట కూడా తీరింది.. లక్డికాపూల్ రైల్వే స్టేషన్ లో )

ఉదాహరణ..కి . నాకు .. ఇందులో యాక్ట్ చేసిన నా మిత్రునికి ఇద్దరికీ సిగరెట్ గురించి తెలీదు.. కొట్టుకెళ్ళి బాబూ..బాగా పొగ వచ్చేది.. మంచిగా బూదిదొచ్చేది . ఓ సిగరెట్ ఇయ్యమ్మా.. అని అడిగాం.. ఆ కొట్టు అతను పైనించీ కింద దాక.. ఎగా దిగా చూసాడు.. ;)

సినిమా చూసి ఓ నాలుగు కామెంట్లు విసిరి కొట్టడం నాకు .. కెమేరాతో పెట్టిన విద్య..

తీరా నేను కెమెరా పట్టుకునేటప్పటికీ.. కధ కాస్తా. సగం మర్చిపోయా..!

అనుకున్న కరెక్ట్ లోకేషన్స్ దొరక్క..కొన్ని చోట్ల కుదరక.. కధ మార్చుకోవాల్సి వచ్చింది..

ఆఖరున షూటింగ్ మొత్తం అయ్యాకా. ఇంకా ఏదో తియ్యల్సింది.. అనే ఫీలింగ్..

సరే.. ఏదో మొత్తానికి కెమెరాలో భంధిచాం అనుకున్నాక.. ఇప్పుడు దీన్ని ఎడిటింగ్ చెయ్యాలి..

మనకి రాదు.. వచ్చిన వాడు తెలీదు..సొంతగా నేర్చుకోక తప్పింది కాదు..

ఏదో సొంత వాయిస్ ఆడ్ చేసి.. ఇంగ్లిష్ ఆల్బం లో మ్యూజిక్ కొట్టేశా.. (నేనూ సినిమల్లోకెళ్ళిపోతానేమో డవుటొ చ్చేస్తోంది..)

ఇది మొదటి పూర్తి ప్రయత్నం..నేను హాపీస్..

చూసి మీరుకూడా హాప్పీస్ అవునో కాదో.. చెప్పండే..

గమనిక.. సలహాలు తీసుకోబడును*

Saturday, June 5, 2010

నాకిష్టం..
ప్రపంచం నాకిష్టం..

ఏరోజూ ఒకేలా ఉండనీదు..
నన్ను నానుండి దూరం కానీదు..

బ్రతుకు బడిలో తలుపు వేసేస్తే...
మరో తరగతికి తలుపు తెరుస్తుంది..

అందరిలో నను చూపించేస్తూ..
నను ముందుకు నడిపించేస్తుంది..
మరింత మెరుగ్గా ఆవిష్కరింపజేసేందుకు సిద్ధం చేస్తుంది..

నా గురువు
నా బందువు
నా ఆప్తమిత్రుడు
నా ప్రపంచం..

ద్వేషాన్ని రుచి చూపిస్తూ..
ప్రేమ విలువ చెప్పింది..

మోసపోయినపుడల్లా
మరింత మంచి వాడివవమంది..

ఆశలు ఆవిరి చేసి పట్టుకెళ్ళి..
మండుటెండల మాపటి రోజు మేఘమై వచ్చింది..

నిన్న లేనిదే నేడు లేదని
నేటి రేపటికి ఈనాటి అవసరమెంతో గుర్తు చేసింది..

తత్వాలు చెపుతుంది..
గీతా గానం చేస్తుంది..
తనను మరిచి తాండవం చేస్తుంది..

నా దృష్టి
నా తీరు
నా నిర్ణయం
నా ప్రపంచం..

నాకెంతో ఇష్టం..


.