Monday, May 31, 2010

లేదిక లేదు..





కానీ కానీ ...
ఏమైనా కానీ ...
మరేమైనా రానీ ....

కాలనాగు విషం కక్కనీ
సాక్షాత్ కలి రూపు కంటపడనీ

మృత్యువు తాడై కంఠాన్ని నులమనీ
నలువైపుల నలుపే నిలవనీ
నర నరాన హిమాలయమే పుట్టనీ

భూమి రెండవనీ..

రవి గాని శి గాని..
వారు వీరవనీ..

లేదిక.. లేదిక లేదు..
భయానికి మరో పుట్టుక లేదిక్కడ...

నిస్సత్తువ
నిర్లిప్తత
నిరీక్షణ
లేవు..

సంఘర్షణ
లొంగుబాటు
లేవు..

ధైర్యేతర ధ్యాస
లేనే లేదు..
లేదు ఇక లేదు..
.
.
.

8 comments:

అశోక్ పాపాయి said...

chaala baaga rasharu .....nice

చైతన్య said...

బాగుంది కానీ నాకు Context అర్థం కాలేదు!

శివ చెరువు said...

అశోక్ గారు... చైతన్య గారు.. ధన్యవాదాలండీ..

భయం ఉన్నప్పుడు.. ధైర్యం అవసరం పడుతుంది.. కానీ ధైర్యం తప్ప మరేదీ లేనప్పుడు....భీతి కొల్పే అంశాలు ఎన్ని వచ్చినా .. వాటి ప్రభావం శూన్యమే..

చైతన్య గారు..
పెద్ద ప్రయోగమని ఫీలయ్యాను.. చూస్తే మీ ప్రశ్న నా గాలి కాస్తా తీసేసింది.. ;)

మధురవాణి said...
This comment has been removed by the author.
మధురవాణి said...

శివ గారూ,
మీరొకసారి sujanamadhuram@gmail.com కి మెయిల్ చేయగలరా?

CHANDU EEE @ JNTU said...

ధైర్యే సాహసే లక్ష్మి.. అనే నానుడి గుర్తుకు వచ్చింది..మీ కవితకు..
గుండె నిండుగా బలిమి ఉందిగా..
భయము ఎందులకు?
భీతి ని త్యజించి గెలిచిననాడే మనుజుడు పో .....

మీ కవితాక్షారములకు..నా జొహార్లు

Anonymous said...

Hello meeru 24X7 movie epudu release chestaru ??? ekada waiting :)

N. Aditya Madhav said...

bagundi :)