Friday, May 14, 2010

ఆ కాగితం చెప్పింది ...




ఒకరి బలహీనతలమీద,
వేరొకరి
బ్రతుకుల మీద బతుకుతుంది...

ఆశలను
ఆకసపు ఎత్తులకు ఎగరేసి
అక్కడ బ్రతకమంటుంది..

నిన్ను కలలకొదిలేసి ...
నీ నిద్దురను పట్టుకెళ్ళి పోయింది..

బంధుత్వాలను లెక్కలకోసం రాసుకుని
బంధాలను తాకట్టు పెట్టుకుంది..

కళ్ళమెరుపూ అదే ..కంట తడీ అదే..

అదే అడిగా... గట్టిగా.. గట్టిగా అదే అడిగా..
తనని ఏమిటిదని..?

నా ఆవేశాన్ని .. నా తీరును ఏమాత్రం పట్టనట్టు..
స్తబ్దమైన నవ్వు నవ్వి..నావైపు చూసింది.. కాగితం..

నేనేనా..? అని తిరుగు ప్రశ్నించింది..

క్షణం నా చెంప చెళ్ళుమనిపించినట్టయింది ...

7 comments:

  1. కాగితం నిజమే చెప్పింది...

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు.

    ReplyDelete
  3. very well written!!

    చాలా బాగుంది... బాగా అడిగింది!

    ReplyDelete
  4. కొత్త పోస్ట్ ఎప్పుడు?

    ReplyDelete
  5. ఓ చిన్న కధ సగం రాసానండి...పూర్తి చేసి ఈరోజు పోస్టు చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను..

    ReplyDelete
  6. చాలా బాగా రాసారు...

    ReplyDelete