Saturday, April 10, 2010

అనగనగా ఓ వీరుడి కధ...

చాలా కాలం క్రితం వజ్రపుర మహా రాజ్యానికి దగ్గరలో, ఓ పల్లె టూరిలో ...విద్యా ధనుడు .. వివేక ధనుడు.. అనే ఇద్దరు. అన్నదమ్ములు ఉండే వారు..

వారు ఇద్దరూ అదే పల్లెటూరిలో గల ఓ గురుకులంలో చిన్నప్పటినుండీ అనేక విధ్యలభ్యసించారు. దాదాపు నేర్చిన అన్నీ విద్యలలోనూ ఇద్దరూ సమంగా ఉత్తీర్ణులైనారు...ఇద్దరూ అక్కడినుండీ రాజ కొలువులో ఉద్యోగానికి బయలుదేరారు.

దారిలో వారు అనేక పల్లెటూర్లను దర్శించారు. ఓకొక్క పల్లె దాటి వెడుతుంటే రాజ్యానికి చేరువయ్యే కొద్దీ .. అన్నిటా దగ్గర దగ్గర ఒకే రకమైన సమస్యలు.. ఆందోళన.. భయం..అభద్రతా భావం... తాండవమాడుతున్నాయి.. ప్రభుత్వ అధికారులే అన్యాయానికి పాల్పడుతున్నారు.. అనారోగ్యం గల వారిని వూరి అవతల వదిలేయడం , విపరీతమైన దొంగల భయం, శత్రు రాజుల ఆకస్మిక దాడులు.. ఇళ్లనుండీ యువకులను సైనికులగా బలవంతం గా తీసుకెళ్ళిపోవడం లాంటివి చాలా చాలా జరుగుతున్నాయి ఇక్కడ... వీటిని పరిశీలిస్తూ వివేక ధనుడు, ఇంత కాలం మన రాజ్య పరిస్థితి ఇంత విచారకరంగా ఉన్నదన్న విషయం తెలీలేదని చింతిచాడు.. విద్యాధనుడు మాత్రం దానికి కారణమైన వారిని శిక్షించాలని మాటలు చెపుతూ ఆవేశానికి లోనైనాడు.

కొన్ని రోజులకు ఇద్దరూ వజ్ర పుర పట్టణానికి చేరుకున్నారు.. ఇంకో వారం రోజులలో పొరుగు రాజ్యంతో యుద్దమట.. అప్పుడే ఆకస్మికంగా మరణించిన సైన్యాధిపతి రుద్ర సేనుడికి బదులుగా ఆ స్థానం లో నియమించడానికి తగిన వ్యక్తి కోసం పోటీలు మొదలైనాయి.. ఆ పోటీలను వీక్షించడానికి రాజుగారు స్వయంగా విచ్చేశారు. ఈ పోటీలలో విచిత్రమేమిటంటే.. ఓడిపోయిన వారు మరణ దండనకు సిద్దపడాలి. పోటీ నియమాలు చాలా కటినంగా వున్నై.. ఎక్కువ మంది పోటీ జరుగు తున్నపుడే తమ ప్రాణాలను విడవాల్సి వచ్చింది.. ఇది చూస్తూ రాజుగారు చిరు మందహాసం చిందిస్తూ, దేశం కోసం పోయిన వారి కుటుంబాలకు బంగారు కాసులను విసిరేస్తున్నారు.. కొందరు మధ్యలోనే పలాయనం చిత్తగించ బోయి రాజు గారి బటులకు చిక్కి కారాగారం పాలైనారు.. పోటీ, పోటీకి విద్యా దనుడు మరింత ప్రభావవంతంగా తన విద్యనూ ప్రదర్శిస్తూ తరువాతి ఆవ్రుతికి సిద్దమౌతున్నాడు.. వివేకదనుడు మాత్రం అసహానికి గురౌతూ .. ముఖం లో మరింత దైన్యాన్ని ఆవరింపజేస్తున్నాడు.. ఎంత కటినమైనా గాని ఇద్దరూ అన్నీ పరీక్షల్లో బాగా రాణించారు.. చివరికి వీరిద్దరే పోటీలో మిగిలారు. ఇప్పుడిక ఆఖరి పరీక్ష..

అప్పుడు రాజు గారు .. మీరిద్దరూ యువకులే అయితే సైనాదిపతిగా భాద్యతలు చేపట్టడానికి గొప్ప నాయకత్వ లక్షణాలు వున్న వ్యక్తి కావాలి.. రాజ నీతి తెలిసిన వాడై ఉండాలి .. ధైర్యం కలవాడై వుండాలి. చావుకు వెనకాడని వాడై ఉండాలి. కనుక మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే మిగులుతారు.. పోటీకి సిద్ద పడండి.. అని చెప్పి సుఖాసీనుడైనాడు..

చాలా సేపటి వరకు పోటీ మొదలు కాలేదు ..ఇద్దరూ ఏ ఒక్క అడుగూ ముందుకు వేయడం లేదు.
అప్పుడు వివేక ధనుడు, నేను ఈ పోటీ నుండీ విరమించుకుంటున్నాను. కనుక విద్యాధనుడినే ఇక సైనాదిపతి గా నియమించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు.. విద్యాధనుడు కూడా అదే మాట అన్నాడు..తను కూడా పోటీ నుండి విరమించుకుంటున్నానని.. ఒక్క సారిగా రాజు గారి సభ అంతా నిశ్సభ్దం నెలకొంది..మళ్ళీ రాజు గారు మాట్లాడడం మొదలు పెట్టారు..నియమం ప్రకారం ఎవరు మిగిలితే వారే సైనాదిపతి.. కనుక పోటీ తప్పని సరి..పోటీనుండి విరమిన్చుకోవడమనేది నిషిద్దం అని తేల్చి చెప్పేశారు.. ఇక పోటీ మొదలు కాక తప్పింది కాదు..

ఇద్దరూ ... చాలా సేపు ఒకరిని మించి ఒకరు పోటీలో తమ విద్యలను ప్రదర్శించారు.. రాజుగారు బహు సంబర పడిపోతున్నారు..ఇద్దరికీ తీవ్రంగా గాయాలయి, ప్రాంగణమంతా రక్తమయమైంది.. ఇంతవరకూ జరిగిన పోటీలో ఇదే ఎక్కువ సేపు జరిగిన పోటీ , వీళ్ళే ఎక్కువ సేపు నిలిచిన పోటీదారులు . కళ్ళు ఎర్రబడ్డాయి.. శరీరం హూనమయింది..ఏ ఒక్కరూ తక్కువ అని అనిపించడం లేదు..అంతటా ఉత్కంట నెలకొంది.. ఉన్నట్టుండి ఇద్దరూ మరింత బీకరంగా పోరాడసాగారు.. అలా జనాల మీదకు కూడా వెళ్లి పోతున్నారు.. విద్యాధనుడు, వివేక ధనుడు కొట్టిన దెబ్బకు కింద పడ్డాడు.. మరిక లేవలేడన్నట్టు గా దెబ్బతిన్నాడు. సభలో అంతా హోరు మొదలయింది.. చంపేయ్.. చంపేయ్.. చంపేయ్..

రాజు గారు కానియ్ అన్నట్టు.. వివేక ధనుడు కేసి చూసి కన్నెగరేసారు.. విద్యాధనుని కళ్ళల్లో మాత్రం వీసమంతైనా బెరుకు లేదు.. అతని చూపు కేవలం వివేక ధనుడు కళ్ళ వైపే వుంది.. వివేక ధనుడు కను బొమ్మల మీదనుండి కారే రక్తపు బొట్లు విద్యాదనుని చేతులపై పడుతున్నై.. కళ్ళు పూర్తిగా ఎరుపు రంగు లోకి మారిపొయినాయి.. మొఖం నిండా దెబ్బలే .. నోటినుండి ఆయాసపు శబ్దం వినబడుతోంది.. సభలో అంతా ఒకటే అరుపు .. చంపేయ్.. చంపేయ్.. చంపేయ్..

వివేక ధనుడు తన చేతిలోని కత్తిని బలంగా గురిచూసి విసిరాడు..ఒక్క నిమిషం .. సభలో జనం అంతా నిస్చేష్టులైపోయారు.. అది సరాసరి రాజుగారి గుండెల్లో దిగింది.. ఆ రాజుగారు అక్కడికక్కడే అదే మందహాసవదనంతో కుప్పకూలి పోయాడు..

విద్యాధనుడిని లేవనెత్తి , తన బుజాన అతడి బరువు ఆపి .. వివేక ధనుడు మాట్లాడడం మొదలు పెట్టాడు..

ఇతడు రాజు కాదు కేవలం వినోద ప్రియుడు. ఇతగాడికి మనిషి ప్రాణం విలువ తెలీదు. భాద్యత తెలీదు.. ఆయన ప్రాదాన్యత వినోదం కాని భాద్యత కాదు ..యధా రాజా తధా ప్రజా.. ఈ రాజ్యం లో విలాసాలకే పెద్ద పీట... బలహీనులు అంటే బలైపోఏవాళ్ళు.. వేరొకరి భాద మనకు కాలక్షేపం.సమస్యలేవరికీ పట్టవు..పరిష్కారమేవరికీ తట్టదు.. సంఘమంటే కలిసి బతకడం కదా..? ఎవరికి వారే బ్రతకితే.. నేను బాగుంటే చాలనుకుంటే..ఎవరు మిగులుతారు..? ఎక్కువ బలం కలవారు, ఎక్కువ గా మోసం చేయగలవారు.. ఏదైనా చెడ్డది ఎక్కువ..ఎక్కువ.. గా చేయగలిగిన వారు.. వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు.. మిగతావారు చస్తూ బ్రతుకుతారు... మనిషి, మనిషి కే విలువీయడు.. ప్రాణాలు పోయినా పట్టించుకోడు.. బంధాలు.. లేవు... నువ్వు పోతే పోయావు నేను ఇంకా ఉన్నానుగా.. అనే అవలక్షణం తప్ప... ఇక ఇలాంటి రాజ్యానికి శత్రు రాజు దాడి చేసినా ఇంతకన్నా ఏమి పాడు చేయగలదు...?

అంటూ విద్యాధనుడిని తీస్కుని.. అక్కడనుండి బయలు దేరాడు...

.

Monday, April 5, 2010

ఏమంటున్నాయి..?ఈ నది ఒడ్డున
చెవుల దగ్గర సన్నటి శబ్దం చేస్తూ ...
అటుగా వెళ్ళే గాలి ఏం చెపుతోంది

నీరెండి అక్కడక్కడా కనపడే
ఆ ఇసుక తిన్నెలు.. రాళ్ళ గుట్టలు ఏం చెపుతున్నాయి

పడమర వైపుకు రాలి ..
అస్తమయానికి చేరువయ్యే ఆ సూరీడు ఏం చెపుతున్నాడు..

మోడై ఆ పక్కకు ఒంగి న ..
ఈ పెద్ద చెట్టు మాను ఏం చెపుతోంది

కాలే ఆ కట్టెల వాసన, మధ్య మధ్యలో బయట పడే నిప్పు రవ్వలు..
ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి...

ఓ నాలుగు ఓదార్పు మాటలు వెతుక్కో మంటున్నాయా?
అంతా అయిపోయిందని చెపుతున్నాయా?
పనికి రాని ఏదో వైరాగ్యపు ఛాయల్లో నిలబడమంటున్నాయా?
అయిపోయిన ఆ రోజులకు ఇవే ఆఖరి క్షణాలంటున్నాయా ?

ఏమంటున్నాయి..?
ఏమంటున్నాయి..?