Thursday, March 25, 2010

సొంత ఊరు...



ఎప్పుడెప్పుడా అని చూస్తుంది
నా ఊరు..
నేనొస్తానంటే...

ఆడుకుందామని
అలసిపోయే దాకా అల్లరి చేద్దామని...

వచ్చీ రాగానే ..
గోదావరి కరకట్ట, తాత గుడి చెట్టు నీడ
ఆప్యాయంగా పలకరిస్తాయి..
కాసేపు కూర్చోమని కుశల ప్రశ్నలేస్తాయి

రాజ వీధి దీపాలు తమ వెలుగులో
వర్షపు చినుకుల మధ్యలో
పిచ్చిగెంతులేస్తూ , లల్లాయి పాటలు పాడమంటాయి ..

అక్కడక్కడా వెలిసి పోయిన కొన్ని జ్ఞాపికలు ఎదురొస్తాయి ...
చెమటోర్చి వరించిన ఎప్పటివో విజయాలు ముందుంచుతాయి ..

చిన్న నాటి స్నేహితుల గుంపు ..
పాతబడి కూలిన నా.... బడి గోడలు
గడ్డి పూల చుట్టూ తూనీగల రెక్కల చప్పుడు
నేను వచ్చి ఇంకా కనపడక పోతే..
అలిగి , పసి పాపలా ముడుచుకు పోతుంటే...
ముద్దు చేసే ముచ్చట్లు మరింత అందంగా ఉంటాయి ..

కాని అంతలోనే ...
పాత రోజులను గుర్తు చేసుకుంటూ
కొత్త జ్ఞాపకాలను తయారు చేసుకుంటూ
వచ్చిన కాసిన్ని రోజులూ గడిపేసి ..
నే వెళ్లి పోతుంటే

ఊరిచివర పచ్చిక,
తిరిగి.. తిరిగి..అరిగిపోయిన రోడ్లు..
ళ్ళీ ఎప్పుడు వస్తావని అడుగుతాయి..
కంట తడి పెట్టుకుంటూ వెళ్లిరా అంటాయి..
జాగ్రత్తలు చెపుతాయి..
వచ్చేదాకా మళ్ళీ ఎదురు చూస్తుంటాయి..

ఆ .. క్షణాలు ..
కొత్త తూరుపు గురుతులుగా నాలో శాశ్వతం గా 'భద్ర'పరుస్తాయి

10 comments:

  1. baagundiraa abbaay , vooriki maLLee eppuDostunnaa vETi?

    - A kuDi vaipu taaTi cheTTu

    ReplyDelete
  2. kaadu , eeta cheTTu

    ReplyDelete
  3. Bagundi mee sontha ooru.. Nannaithe Mallesh Bajji bani, paani poori bandi, Mahaveer icecream rammantunnai.. Kaaani..

    Ramki :)

    ReplyDelete
  4. orey cricket Ground marchipoyav ra.

    ReplyDelete
  5. chala bagundi..mee gnyapakala thoranam...:)

    ReplyDelete
  6. HEY SIVA ENTAYYA AA PHOTO,,,, ADAVILO NAKSALITLAGA VUNNAV,, AA

    ReplyDelete
  7. ఓరబ్బీ చెబుతాను. ఓలమ్మీ చెబుతాను. పచ్చాని పైరుమీద బాసచేసి చెబుతాను. ఏం చెబుతావు. ఇది పల్లెకాదు మరు మల్లె అని.

    ReplyDelete
  8. bhagundi shiva bhadrachalam gurthochindi

    ReplyDelete
  9. ఎంతైనా చాలా రోజుల తరవాత సొంత ఊరు వెళ్తే వచ్చే అనుభూతే వేరు. నగరాల్లో పెరిగిన వారికి ఇలాంటివి ఏమైనా ఉంటాయో లేదో నాకు తెలియదు.

    ReplyDelete